E-Paper
Advertisement

Bhartha Mahasayulaku Wignyapthi OTT: ఫైనల్ గా ఓటీటీలోకి రానున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Bhartha Mahasayulaku Wignyapthi OTT: ఫైనల్ గా ఓటీటీలోకి రానున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!
Advertisement

Bhartha Mahasayulaku Wignyapthi OTT: ఈ కాలంలో థియేటర్లలో విడుదలైన సినిమాలు చాలా త్వరగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలోకి వచ్చేస్తున్నాయి. సాధారణంగా రెండు లేదా మూడు వారాల..తర్వాతే ప్రేక్షకులు ఇంట్లోనే కూర్చొని సినిమాలు చూసే అవకాశం పొందుతున్నారు. కానీ రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా మాత్రం ఓటీటీ విడుదల విషయంలో కొంత ఆలస్యం ఎదుర్కొంది.

మొదట ఈ సినిమాను ఫిబ్రవరి రెండో వారం నుంచే ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ నిర్ణయం వాయిదా పడింది. దీంతో అభిమానులు ఈ సినిమా డిజిటల్ విడుదల కోసం కొంతకాలం ఎదురుచూడాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం ఆ ఎదురుచూపులకు ముగింపు వచ్చింది.

స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Advertisement

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5 ఈ సినిమా డిజిటల్.. హక్కులను కొనుగోలు చేసింది. అధికారిక సమాచారం ప్రకారం ఈ సినిమా మార్చి 13 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఓ ప్రత్యేక ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.

సంక్రాంతి పండుగకు రెండు రోజుల ముందే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. సినిమా విడుదలైన తర్వాత పెద్దగా అద్భుతమైన రివ్యూలు రాకపోయినా, కుటుంబంతో కలిసి చూడదగ్గ సరదా చిత్రం.. అనే పేరు మాత్రం సంపాదించింది. ముఖ్యంగా రవితేజ తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను బాగా నవ్వించాడు.

కథ ఏమిటంటే..!

Advertisement

ఈ సినిమాలో రవితేజ ఇద్దరు మహిళల మధ్య చిక్కుకున్న వ్యక్తిగా కనిపిస్తాడు. అతని పాత్రలో ఉన్న హాస్యం ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది. అయినప్పటికీ థియేటర్లలో కలెక్షన్ల పరంగా మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.

సినిమా మొత్తం రన్‌లో దాదాపు 13 కోట్ల రూపాయల వరకు మాత్రమే వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమాకు జరిగిన వ్యాపారం దాదాపు 19 కోట్ల రూపాయలు. అందువల్ల బ్రేక్ ఈవెన్ సాధించడానికి ఇంకా ఎక్కువ కలెక్షన్లు రావాల్సి ఉంది. చివరికి ఈ సినిమా కొంత నష్టంతోనే థియేటర్ రన్‌ను ముగించింది.

కథ విషయానికి వస్తే..రామ్ అనే వ్యక్తి జీవితంలో ఇద్దరు మహిళలు రావడంతో అతని జీవితం ఎలా మారుతుంది అనే అంశంపై సినిమా సాగుతుంది. ఒకరికి పెళ్లైన విషయం మరోకరికి తెలియకపోవడం వల్ల జరిగే సంఘటనలు కథలో ఆసక్తిని పెంచుతాయి. చివరికి ఈ పరిస్థితి ఎలా పరిష్కారమవుతుంది అనేది సినిమాలో ప్రధాన అంశం. ఇప్పుడు థియేటర్లలో మిస్ అయిన వారు మార్చి 13 నుంచి ఓటీటీలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు.

ALSO READ: Vijay Rashmika: రష్మికకు కానుకగా 90 కోట్ల విల్లా.. అసలు విషయం చెప్పిన విజయ్ మేనమామ!

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×