E-Paper
Advertisement

తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ రిలీజ్.. ట్రంప్ మీదే రివేంజా?

తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ రిలీజ్.. ట్రంప్ మీదే రివేంజా?
Advertisement

Gaayapadda Simham Trailer: ఇటీవల కాలంలో తరుణ్ భాస్కర్(Tharun Bhascker) దర్శకుడిగా కాకుండా హీరోగా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇటీవల ఓం శాంతి శాంతి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పరవాలేదు అనిపించుకున్న తరుణ్ భాస్కర్ త్వరలోనే గాయపడ్డ సింహం(Gaayapadda Simham) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తరుణ్ భాస్కర్ ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మే ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

అంచనాలు పెంచిన ట్రైలర్..

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తరుణ్ భాస్కర్ ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump)ను బీభత్సంగా వాడడంతో ఈ సినిమాకు ఎనలేని క్రేజ్ లభించింది. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఫన్ గా ఉందని చెప్పాలి. అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలని హీరో కలలు కంటున్నాడు అయితే డోనాల్డ్ ట్రంప్ పెట్టిన ఆంక్షలు కారణంగా తన కల నెరవేరదు. అలాగే హీరో తన వ్యక్తిగత విషయాలు ప్రేమ జీవితంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే విషయాలను ఈ ట్రైలర్ లో చాలా అద్భుతంగా చూపించారు.

శ్రీ విష్ణు క్యామియో..

Advertisement

ఇక ఈ ట్రైలర్ వీడియోలో హీరో తరుణ్ భాస్కర్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో జెడి చక్రవర్తి (J.D.Chakravarthy), మానస చౌదరి విష్ణు వంటి తదితరుల పాత్ర కూడా చాలా వినోదాత్మకంగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. ఈ సినిమాలో నటుడు శ్రీ విష్ణు క్యామియో పాత్ర మంచి అంచనాలను పెంచేస్తుంది. తరుణ్ భాస్కర్ అమెరికా వెళ్లాలనుకుంటే శ్రీ విష్ణు మాత్రం ఇండియాలో ఉండి ఏదైనా సాధించాలని భావిస్తూ ఉంటారు. ఇలా వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలవబోతున్నాయని తెలుస్తోంది. ఇలా ట్రైలర్ వీడియో ద్వారా సినిమా పట్ల ఎంతో మంచి అంచనాలను పెంచేశారు. మరి మే ఒకటో తేదీ విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.

Advertisement

కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గాయపడ్డ సింహం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే థియేటర్లలో విడుదల అయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ఈ సినిమాకు పోటీగా పెద్దగా సినిమాలు ఏవి కూడా లేవని చెప్పాలి అయితే మే ఒకటవ తేదీ కమెడియన్ సత్య హీరోగా నటించిన జెట్లీ సినిమా విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కావడం విశేషం. ఇక వేసవి సెలవులు వచ్చినప్పటికీ స్టార్ హీరోలు ఎవరు కూడా బాక్స్ ఆఫీస్ బరిలో లేకపోవడంతో థియేటర్లు కాస్త వేలవెలబోతున్నాయి. ఇలా చిన్న సినిమాలతోనే ప్రేక్షకులు సరిపెట్టుకుంటున్నారని చెప్పాలి.

Also Read: మెక్సికోలో రాజమౌళి వారణాసి సినిమాకు అవమానం.. మరీ ఇంత దారుణమా?

Related News

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

Big Stories

Advertisement
×