E-Paper
Advertisement

ఆ యాప్ క్లిక్ చేశావో నీ సమాధి నీవే తవ్వుకున్నట్లు.. ఓటీటీలోకి భయం పుట్టించే థ్రిల్లర్ సిరీస్

ఆ యాప్ క్లిక్ చేశావో నీ సమాధి నీవే తవ్వుకున్నట్లు.. ఓటీటీలోకి భయం పుట్టించే థ్రిల్లర్ సిరీస్
Advertisement

Horror thriller series OTT : కొరియన్ డ్రామాలకు ఉన్న క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. అదే పనిగా వీటిని చూస్తున్నారు తెలుగు ఆడియన్స్. వీటిలో థ్రిల్లర్ స్టోరీలను మరింత క్రేజీగా చూస్తున్నారు. మేకర్స్ కూడా ఈ కంటెంట్ ను సరికొత్తగా తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఓటీటీలోకి ఇవాళ నేరుగా సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇది కోరికలు తీర్చి ప్రాణాలు తీసే ఓ మొబైల్ యాప్ చుట్టూ తిరుగుతుంది. ఇది టెక్నాలజీకి అతీత శక్తులు తోడైతే ఎలా ఉంటుందో చూపించే ఒక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. ఇందులో ఒళ్లు గగుర్పొడిచే సీన్స్ చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఈ సిరీస్ ఓటీటీలో ట్రెండింగ్ లో కూడా ఉంది. వీకెండ్‌లో వణికించే ఒక హారర్ థ్రిల్లర్ చూడాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఛాయిస్.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ కొరియా యంగ్ అడల్ట్ హారర్ థ్రిల్లర్ సిరీస్‌ పేరు ‘ఇఫ్ విషెస్ కుడ్ కిల్’ (If wishes could kill) వచ్చేసింది. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఏప్రిల్ 24 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇందులో అన్ని ఎపిసోడ్లను ఒకేసారి విడుదల చేశారు. ఇది తెలుగులో ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే ఇంగ్షీషు సబ్ టైటిల్స్ తో దీనిని ఎంచక్కా చూసేయచ్చు. ఈ కథ కొరియాలో ఫేమస్ అయిన ఒక వెబ్‌టూన్ (ఆన్‌లైన్ కామిక్) ఆధారంగా తీశారు. స్మార్ట్‌ఫోన్ యాప్‌ని, పాత కాలపు మంత్రతంత్రాలని కలిపి చూపించిన విధానం ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్ ఇచ్చింది. అందుకే ఇది రిలీజ్ అయిన వెంటనే నెట్‌ఫ్లిక్స్ లో టాప్ లిస్టులో టాప్‌లో నిలిచింది. ఇందులో నటించిన వాళ్లంతా కొత్త కుర్రాళ్లే అయినా అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఇందులో వాడిన సౌండ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పుకోవాలి; ఆ యాప్ నుంచి వచ్చే వింత శబ్దాలు వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. షూటింగ్ సమయంలో సెట్‌లో కూడా కొన్ని వింత సంఘటనలు జరిగాయని, అందుకే ఆ భయం నటీనటుల ముఖాల్లో క్లియర్ గా కనిపిస్తుందని యూనిట్ సభ్యులు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

కొరియాలో ఒక హైస్కూల్‌లో చదివే ఐదుగురు కుర్రాళ్లకి అనుకోకుండా “గిరిగో” అనే ఒక వింత యాప్ దొరుకుతుంది. ఆ యాప్ సాదాసీదాది కాదు, అందులో మన మనసులో ఉన్న కోరిక చెప్పి, పేరు, డేట్ ఆఫ్ బర్త్ కొడితే చాలు.. అది ఎంతటి కోరికైనా చిటికెలో తీర్చేస్తుంది. అరేయ్ భలే యాప్ దొరికిందిరా అని మురిసిపోయి, ఎవరికి నచ్చిన కోరికలు వాళ్లు కోరేస్తారు. తీరా చూస్తే, కోరిక తీరిన ఆనందం ఐదు నిమిషాలు కూడా ఉండదు. వెంటనే వాళ్ల ఫోన్లలో 24 గంటల మరణ గండం మొదలవుతుంది. అంటే ఆ టైమ్ అయిపోయేలోపు వాళ్లు కచ్చితంగా చచ్చిపోవాల్సిందే.
ఒక్కొక్కడికి చావు కళ్లముందు కనిపిస్తుంటే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి మిగతా వాళ్ళకి. కోరిక తీరడం ఏమో గానీ, ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ ఐదుగురు ఫ్రెండ్స్ ఊపిరి సలపని పోరాటం మొదలుపెడతారు.

ఒక పక్క టైమ్ అయిపోతుంటే, మరోపక్క వింత వింత శక్తులు వీళ్లను వెంటాడుతుంటే, ఆ నరకం నుంచి బయటపడటానికి వాళ్లు పడే పాట్లు మామూలుగా ఉండవు. కథ క్లైమాక్స్‌కి వచ్చేసరికి అసలు ట్విస్ట్ బయటపడుతుంది. ఇది కేవలం టెక్నాలజీ మాయాజాలం కాదు, పాత కాలపు మంత్రతంత్రాలు, క్షుద్ర పూజల ఫలితమని తెలుస్తుంది. ఆ శాపాన్ని ఆపాలంటే వీళ్ళకు ఒకే ఒక్క దారి దొరుకుతుంది. ఆ దారి ఏమిటి ? ఈ గండం నుంచి వీళ్ళు బయట పడతారా ? అసలు ఈ యాప్ వెనక ఉన్న మర్మం ఏంటి?  క్షుద్ర శక్తులు ఈ యాప్ ద్వారా స్టూడెంట్స్ ప్రాణాలతో ఎందుకు ఆడుకుంటున్నాయి? అనే విషయాలతో సిరీస్ హోరెత్తిపోతుంది.

Advertisement

Read Also : చచ్చినోళ్ళు హత్యలు చేస్తూ డిటెక్టివ్ లకే ముప్పుతిప్పలు పెట్టే కేసు… ఓటీటీలో అదరగొడుతున్న సిరీస్

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×