Varanasi Film: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం వారణాసి (Varanasi). ఈ సినిమా 2027 ఏప్రిల్ ఏడో తేదీ ప్రేక్షకులకు రావడానికి సిద్ధమవుతోంది. గ్లోబల్ రేంజ్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా రాజమౌళి అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా మెక్సికో(Mexico)లో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.
మెక్సికోలో జరిగిన ప్రఖ్యాత ‘కామిక్ కాన్ ఎక్స్‌పీరియన్స్’ (CCXP) ఈవెంట్ నుంచి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు రాజమౌళి (Rajamouli)శ్రీకారం చుట్టారు. హాలీవుడ్ సినిమాలకు పోటీగా ఈ ఈవెంట్ లో వారణాసి ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర నిర్మాతలను ఒకరైన ఎస్ ఎస్ కార్తికేయ పాల్గొని సినిమాకు సంబంధించి పలు విషయాలను తెలియచేశారు. ఇక ఈ కార్యక్రమంలో వారణాసి సినిమాకు సంబంధించిన మునుపెన్నడూ చూడని మేకింగ్ విజువల్స్, బీటీఎస్ వీడియోలను ప్రదర్శించారు.
ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియోలలో భాగంగా ఈ కార్యక్రమంలో వారణాసి సినిమా గురించి నిర్మాత కార్తికేయ మాట్లాడుతూ ఉండగా అక్కడ కాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత రాజమౌళికి ఉంది. అలాంటిది మెక్సికోలో రాజమౌళి వారణాసి సినిమాకు ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదని అభిమానులు భావిస్తున్నారు. మెక్సికోలో రాజమౌళి వారణాసి సినిమాకు అవమానం జరిగిందని అందుకు నిదర్శనమే ఆ ఖాళీ కుర్చీలు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
This is really Embarrassing, SSR Represented India on a Global Scale and Audience at Mexico Comic con are not giving deserved importance to Varanasi.
The Empty seats conveys everything….. https://t.co/gV0BMFBfb5
— KBP Reviews🏹 (@KshitizCritic) April 25, 2026
ఇలా రాజమౌళి వారణాసి సినిమాకు సంబంధించి ఈ వీడియోలు పట్ల విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాజమౌళి అభిమానులు మహేష్ బాబు అభిమానులు ఈ విమర్శలపై ఘాటుగా స్పందిస్తూ కౌంటర్లు ఇస్తున్నారు. ఈ వీడియోలు ఫోటోలు ఒకవైపు నుంచి మాత్రమే తీసినవని, అభిమానులు ఈ ఫోటోలు వీడియోలపై స్పందిస్తూ కౌంటర్లు ఇస్తున్నారు. ఇక ఈ సినిమా పై ఇప్పటికే గ్లోబల్ రేంజ్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మరికొద్ది నెలలో షూటింగ్ పనులు పూర్తికానున్నాయి. ఈ సినిమాని 2027 ఉగాది పండుగ సందర్భంగా ఏప్రిల్ 7 వ తేదీ విడుదలకానుంది. ఇందులో మహేష్ బాబు జోడిగా ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, మాధవన్ వంటి తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు.
Also Read: సినిమాల కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని పక్కనపెట్టిన డైరెక్టర్.. కట్ చేస్తే ఇండస్ట్రీలో ఇలా?