E-Paper
Advertisement

Rahul sankrityan: అది పోస్టర్ కాదు.. అపురూప క్షణం…రణబాలి పోస్టర్ పై డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్!

Rahul sankrityan: అది పోస్టర్ కాదు.. అపురూప క్షణం…రణబాలి పోస్టర్ పై డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్!
Advertisement

Rahul sankrityan: దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ప్రస్తుతం నటుడు విజయ్ దేవరకొండతో కలిసి రణబాలి (Ranabaali)అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి కావడంతో వీరిద్దరూ ఈ సినిమాకి చిన్న విరామం ఇచ్చారు. రష్మిక విజయ్ దేవరకొండ ముచ్చటగా మూడోసారి ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రష్మిక మందన్న విజయ్ ఫిబ్రవరి 26వ తేదీ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో రణబాలి సినిమా నుంచి ఒక ఓల్డ్ గెటప్ వెడ్డింగ్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

ఫోటో పోస్టర్ కాదు.. అపురూప క్షణం ..

ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లికూతురు పెళ్లి కొడుకు గెటప్ లో వింటేజ్ లుక్ లో ఎంతో చూడచక్కగా ఉన్నారు. పాతకాలపు ఫోటోలలో ఉండే సహజత్వం ఈ ఫోటోలో ఉట్టిపడుతోంది. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్(Rahul sankrityan) ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు ఈ పోస్టర్ వెనుక స్టోరీని ఆయన తెలియజేస్తూ.. మేము నిన్న రణబాలి నుంచి వివాహ పోస్టర్ ను విడుదల చేశాము అయితే ఇది పోస్టర్ గా రూపొందించబడలేదని ఇదొక అపురూపమైన క్షణం అని తెలిపారు.

కెమెరా ముందు ఫోజులు లేవు ..

Advertisement

తనకు పాత ఫోటోలు అంటే ఎంతో ఇష్టమని మా తల్లిదండ్రులు తాతమామలు కెమెరా ముందు నిలబడిన విధానం ఫోటోలకు ఫోజులు ఇవ్వలేదు చిరునవ్వులు చిందించలేదు ఆ ఫోటో ఎలా ఉంటుందో అని ఆందోళన కూడా లేదు. ఆ ఫోటోలు చాలా నిజాయితీగా అనిపిస్తాయని తెలిపారు. రణబాలి ప్రపంచాన్ని నిర్మిస్తున్నప్పుడు నేను కూడా నటీనటుల నుంచి అదే నిజాయితీ కోరుకున్నానని తెలిపారు. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ఈ వివాహపు దుస్తులలో సెట్ కి వచ్చినప్పుడు ఆ దుస్తులలో వారు ఒక హీరో హీరోయిన్ లాగా కనిపించలేదు పూర్వకాలంలో ప్రయాణించిన వారిలాగా కనిపించారు. కొన్ని బంధాలు శాశ్వతమైన కొన్నిసార్లు ఇది వారి గత జీవితాల నుంచి వారి పెళ్లి ఫోటో అని నేను భావిస్తున్నామంటూ రాహుల్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Advertisement

ఇలా రష్మిక మందన్న విజయ్ దేవరకొండ ఓల్డ్ గెటప్ కి సంబంధించిన ఈ ఫోటో ప ఈయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా సినిమా పట్ల ఆయన ఎంతటి నమ్మకాన్ని నిజాయితీని కలిగి ఉన్నారో స్పష్టం అవుతుంది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రణబాలిగా రష్మిక జయమ్మ అనే పాత్రలో కనిపించబోతున్నారని స్పష్టమవుతుంది. ఈ సినిమా 1854 – 1878 మధ్య బ్రిటిష్ పాలిత భారతదేశంలో జరిగిన యదార్థ సంఘటనల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

Also Read: Rakasa Teaser: సమయం ఆసన్నమైంది.. ఓ స్త్రీ రేపు రా.. భయపెట్టేస్తున్న రాకాస టీజర్!

Related News

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

Big Stories

Advertisement
×