E-Paper
Advertisement

India vs West Indies: క్యాచ్ వ‌దిలేసిన అభిషేక్‌..బండ‌బూతులు తిట్టిన బుమ్రా..టీమిండియా టార్గెట్ ఎంతంటే

India vs West Indies: క్యాచ్ వ‌దిలేసిన అభిషేక్‌..బండ‌బూతులు తిట్టిన బుమ్రా..టీమిండియా టార్గెట్ ఎంతంటే
Advertisement

India vs West Indies:  టి20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 లో ( T20 World Cup 2026 tournament) భాగంగా వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా ( India vs West Indies) మధ్య మ్యాచ్ ఇవాళ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్ ( Eden Gardens, Kolkata) వేదికగా ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో టాస్ గెలిచిన టీమిండియా మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో వెస్టిండీస్ బ్యాటింగ్ కు దిగింది. అయితే ఈ సందర్భంగా ఓపెనర్లు దాటిగా ఆడారు. అయితే ఈ మ్యాచ్ లో బుమ్రా, వేసిన అద్భుతమైన బంతికి వెస్టిండీస్ ఆటగాడు రోస్టన్ చేజ్ ( Roston Chase) టెంప్ట్ అయ్యాడు. భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఇచ్చాడు. అయితే సర్కిల్ లోనే ఫీల్డింగ్ చేస్తున్న అభిషేక్ శర్మ, ఆ క్యాచ్ అందుకోబోయి విఫలమయ్యాడు. దీంతో అభిషేక్ శర్మను ఉద్దేశించి బండ బూతులు తిట్టాడు బుమ్రా. అటు సూర్య కుమార్ యాద‌వ్ కూడా సీరియ‌స్ అయ్యారు. కాగా ఆ క్యాచ్ మిస్ కావ‌డంతో వెస్టిండీస్ ఆటగాడు రోస్టన్ చేజ్ ( Roston Chase) 40 ప‌రుగులు చేసి, ఇండియాను దెబ్బ కొట్టాడు.

Also Read: Fakhar Zaman : పాకిస్తాన్ తో శ్రీలంక మ్యాచ్ ఫిక్సింగ్‌..లైవ్ మ్యాచ్ లోనే అండంగా దొరికిపోయారు, ఇదిగో వీడియో

టీమిండియా ముందు భారీ టార్గెట్

Advertisement

ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా ( India vs West Indies) మధ్య సూపర్ 8 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసింది వెస్టిండీస్. ఈ నేపథ్యంలోనే వెస్టిండీస్ భారీ స్కోర్ చేయగలిగింది. నిర్ణీత 20 ఓవర్లు ఆడిన వెస్టిండీస్, గౌరవప్రదమైన టార్గెట్ ను టీమిండియా ముందు ఉంచింది. ఈ మ్యాచ్ లో 4 వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్, 195 పరుగులు సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవాలంటే నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులు చేయాల్సి ఉంటుంది. వెస్టిండీస్ బ్యాటర్లలో రోస్టన్ చేజ్ 40 పరుగులతో రాణించగా షై హోప్ 32 పరుగులు చేశాడు.

షిమ్రాన్ హెట్మెయర్ 27 పరుగులతో పర్వాలేదనిపించాడు. రూథర్ ఫ‌ర్డ్ 14 పరుగులు చేయగా… చివరలో రోవ్‌మన్ పావెల్ అలాగే జాస‌న్‌ హోల్డర్ మంచి పార్టనర్ షిప్ నెలకొల్పారు. ఈ మ్యాచ్ లో రోవ్‌మన్ పావెల్ 34 పరుగులు చేయగా హోల్డర్ 37 పరుగులతో రాణించాడు. దీంతో 195 పరుగులు చేసింది వెస్టిండీస్. అటు టీమిండియా బౌలర్లలో బూమ్రా నాలుగు ఓవర్లు వేసి రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ సందర్భంగా 36 పరుగులు సమర్పించుకున్నాడు. హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీయగా వరుణ్ చక్రవర్తికి మరో వికెట్ పడింది. ఇక ఛేజింగ్ లో టీమిండియాకు అడ్వాంటేజ్ కానుంది. ఇప్పటికే ఈడెన్ గార్డెన్స్ లో మంచు ప‌డుతోంది. ఇది సెకండ్ బ్యాటింగ్ చేసే ఇండియాకు అనుకూలించ‌నుంది.

Advertisement

Also Read: US Israel Iran War: టీ20 వ‌రల్డ్ క‌ప్ పై వార్ ఎఫెక్ట్..గ‌జ గ‌జ వ‌ణికిపోతోన్న ప్లేయ‌ర్లు..రంగంలోకి ఐసీసీ

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×