E-Paper
Advertisement

Nayanatara : 20 ఏళ్లు అయిన వాటిని మర్చిపోలేను..భర్త గురించి నయన్ షాకింగ్ కామెంట్స్..

Nayanatara : 20 ఏళ్లు అయిన వాటిని మర్చిపోలేను..భర్త గురించి నయన్ షాకింగ్ కామెంట్స్..
Advertisement

Nayanatara : తమిళ స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ తమిళంలోనూ ఎన్నో సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకుంది. పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అనౌన్స్ చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన పాటలు ప్రేక్షకులను బాగా అలరించాయి.. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో తన పర్సనల్ లైఫ్, సినిమా లైఫ్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.. అందులో ఎలాంటి విషయాలను చర్చించిందో ఒకసారి తెలుసుకుందాం..

20 ఏళ్లు అవుతున్నా మర్చిపోలేకున్నా.. 

ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు అయిపోయింది. పెద్ద పెద్ద స్టార్ హీరోలతో నటించాను. మొదట్లో నా సినిమాలు ఎంతగా సక్సెస్ అయ్యాయో అదేవిధంగా నేను కొన్ని చిన్న పొరపాట్లు కూడా చేస్తూ వచ్చాను. అందులో నటన గురించి మెలుకువలు నేర్చుకోవడంలో చేసిన పొరపాట్లు ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నాను.. ఓ సినిమా షూటింగ్లో మోహన్ లాల్ గారితో నటించినప్పుడు నా పాత్రకు ఎక్కువ డైలాగులు ఉన్నాయి. అయితే వాటిని నేను నేర్చుకుంటూ ఉండక మోహన్లాల్ ఇంకా బాగా హావ భావాలు పలకాలి అని నాకు పదేపదే చెప్తూ వచ్చాడు. ఇంటికి వెళ్లి రాత్రి కూడా నేను ఆ డైలాగుల్ని రిహర్సల్స్ చేస్తూ వచ్చాను అలా కష్టపడ్డాను దానికి ఫలితం దక్కింది. సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది అని నయన్ అన్నారు..

Advertisement

Also Read : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

నా భర్త రోజు ఆపని చేస్తాడు.. 

బ్యూటిఫుల్ హీరోయిన్ నయనతార, తమిళ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ కొన్నేళ్లపాటు ప్రేమించి ఆ తర్వాత పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నయనతార కు పిల్లలు అంటే ఎంత ఇష్టమో ఆమె సోషల్ మీడియా ఫోటోలను చూస్తే తెలుస్తుంది. కాసేపు ఇంటర్వ్యూలో తన భర్త గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను బయట పెట్టింది. ప్రతిరోజు ఆయన తిని మొదటి ముద్ద నాకే పెడతాడు అని ఆమె అన్నారు.. మేమిద్దరం దగ్గర ఉన్నప్పుడు కలిసే భోజనం చేస్తాము. నేను ఎప్పుడైనా సీరియస్ గా ఉన్న గొడవ పడినా కూడా నాకు ముద్ద పెట్టడం మాత్రం మర్చిపోడు. ఎలాగైనా సరే నా కోపాన్ని కంట్రోల్ చేసి నాకు అన్నం తినిపిస్తాడు అని నయన్ తన భర్త గురించి చాలా గొప్పగా చెప్పారు.. ఈ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో ఆమె అభిమానులు ఫుల్ ఫిదా అవుతున్నారు.. ఇక ప్రస్తుతం ఏమి చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. చిరంజీవితో కలిసి మన శంకర వరప్రసాద్ గారు లో నటిస్తుంది… దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వచ్చేయడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది.

Related News

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×