Bigg Boss 9 Telugu : ఈ సీజన్లో గతవారం జరిగిన టాస్క్ లో వచ్చిన ట్రయాంగిల్ కాంట్రవర్సీ టాక్ ఆఫ్ ది టౌన్ అయిన విషయం తెలిసిందే. ఇంతకీ అదసలు ట్రయాంగిలా కాదా అని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బిగ్ బాస్ ఆడియన్స్ మదిలో మెదులుతున్న ప్రశ్నకు ఈరోజు స్వయంగా నాగార్జున ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
“సంజన మీ మ్యాథ్స్ టీచర్ ఎవరు? ఏ క్లాస్ లో నీకు ట్రయాంగిల్ వంటివి టీచ్ చేశారు?” అంటూ ఇష్యూ గురించి మొదలెట్టారు నాగార్జున. “ఫ్లోరా మీనా టీచర్. 1 నుంచి 2వ తరగతిలో చెప్పారు. 3 సైడ్స్ ఉంటే ట్రయాంగిల్ అవుతుంది” అని సమాధానం చెప్పింది సంజన. “ట్రయాంగిల్ కు ఉండే రెండు ప్రాపర్టీలు చెప్పు” అని డైరెక్ట్ గా భరణిని అడిగారు. ఆయన “ఏ భుజం నుంచి తీసినా 90 డిగ్రీ కాకుండా ఉండాలి” అని సమాధానమిచ్చాడు. “మరి 90 డిగ్రీలు ఉంటే?” అని మళ్ళీ నాగ్ క్వశ్చన్ చేశారు. “90 డిగ్రీస్ ఉంటే రెక్ట్యాంగిల్ లేదా స్క్వేర్ అవుతుంది” అని చెప్పాడు భరణి.
“మరి 90, 45, 45 డిగ్రీస్ ఉంటే ఏంటి? ఏం ఉండకూడదు అనే దాన్ని బట్టి ప్రాపర్టీని డిసైడ్ చేయరు. తనూజా నీకు అర్థమైందా? అది ట్రయాంగిల్ కాదని గొడవ మొదలెట్టిన సైంటిస్ట్ వి నువ్వే. ఒకే షేప్ లో ఉండాలని ఎవరు చెప్పారు ? ఇన్ని వారాలు హౌస్ లో ఉండి హ్యాలుజనేషన్ లోకి వెళ్లారు. నాకు ఇలాగే అనిపించింది, కాన్షియల్ లేదు అని చెబుతున్నారు. ఈ గొడవకు కారణం నువ్వే. గేమ్ డిక్లేర్డ్ అని సంచాలక్ చెప్పాక అనవసరంగా ఇష్యూ చేయడం వల్ల లాభం ఏంటి ?” అంటూ వీడియోను ప్లే చేశారు నాగార్జున.
“తనుజా నువ్వు సపోర్ట్ చేయాలనుకోవడం తప్పు కాదు. అన్నీ చూసుకుని మాట్లాడాలి కదా. ట్రయాంగిల్ అంటే మూడు యాంగిల్స్ మొత్తం కలిపి 180 డిగ్రీస్ ఉండాలి” అని క్లారిటీ ఇచ్చాడు. భరణిని మ్యాథ్స్ స్టూడెంట్ అని వ్యంగ్యంగా అంటూ నాగార్జున మరో వీడియోను వదిలారు. అదులో భరణి “దాన్ని రెక్యాంగిల్ అంటారు. ఆడియన్స్ చూడండి” అంటూ రచ్చ చేయడం కన్పించింది.
“ఈ ట్రయాంగిల్ చెక్కినప్పుడు అలా బంప్ వచ్చింది. దాన్ని పట్టుకుని రెక్టాంగిల్ అన్నావు. మరి నీ ట్రయాంగిల్ లో కూడా ఇలాంటి బంప్ ఉంది. ఆల్ ప్రాపర్టీస్ కలిపి 360 డిగ్రీస్ ఉంటేనే రెక్యాంగిల్ అవుతుంది. లేదంటే నాలుగు భుజాలు ఉన్నా కూడా రెక్యాంగిల్ కాదు” అంటూ తండ్రీ కూతుర్లు తనూజ, భరణిలకు క్లాస్ పీకారు నాగార్జున. హోస్ట్ ఇంత క్లారిటీ ఇచ్చాక మరి అది జస్ట్ చెక్కినప్పుడు వచ్చిన బంప్ అని హౌస్ మేట్స్ కి, ఆడియన్స్ ను ఎలా తెలుస్తుంది? అని ప్రశ్నిస్తున్నారు ప్రేక్షక దేవుళ్ళు. ఈ లెక్క ప్రకారం చూస్తే తప్పంతా బిగ్ బాస్ దే కదా మరి.
Read Also : మళ్లీ కళ్యాణ్ కు నాగ్ సెల్యూట్… తనూజతో పాటు అందరికీ అక్షింతలు… సుమన్ – డెమోన్ ట్రోఫీని విరగ్గొట్టిన కెప్టెన్