E-Paper
Advertisement

Goa Fire Accident: గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. 23 మంది స్పాట్ డెడ్

Goa Fire Accident: గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. 23 మంది స్పాట్ డెడ్
Advertisement

Goa Fire Accident: గోవాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అర్పోరా లోని రోమియోలేన్‌లో ఉన్న బిర్ఛ్ నైట్ క్లబ్‌లో.. సిలిండర్ పేలి 23 సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా క్లబ్ ఉద్యోగులుగా గుర్తించారు.

ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఎమ్మెల్యే మైఖేల్ లోబో వెంటనే అక్కడికి చేరుకున్నారు. అధికారులు, రక్షణ సిబ్బందితో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. మరణించిన వారందరూ క్లబ్ ఉద్యోగులేనని ధృవీకరించారు.

Advertisement

సీఎం మాట్లాడుతూ.. ఇంత పెద్ద ప్రాణ నష్టం జరగడం చాలా బాధాకరం. సిలిండర్ పేలుడుకు గల కారణాలను పూర్తిగా విచారిస్తాం. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు అని అన్నారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నైట్ క్లబ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించారా? కిచెన్ స్టోరేజ్‌లో ఎన్ని సిలిండర్లు ఉంచారు? అగ్ని నియంత్రణ పరికరాలు సక్రమంగా ఉన్నాయా? వంటి అంశాలపై సీరియస్‌గా పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ బృందాలకు అప్పగించారు.

Advertisement

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 10 మంది మృతి

కాగా ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోవాలోని అర్పోరాలో జరిగిన అగ్ని ప్రమాదం చాలా బాధాకరం అన్నారు.  ప్రమాదంలో మృతి చెందిన వారికి నా సంతాపం తెలిపారు. గాయపడినవారు వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.  పరిస్థితి గురించి గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ తో మాట్లాడాను. బాధిత వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తోందని వెల్లడించారు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×