E-Paper
Advertisement

NTR – Neel : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పునకాలు తెప్పించే అప్డేట్.. హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సీన్స్..!

NTR – Neel : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పునకాలు తెప్పించే అప్డేట్.. హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సీన్స్..!
Advertisement

NTR – Neel : టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవర, అలాగే బాలీవుడ్ లో వార్ 2 సినిమాలు భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చాయి. కానీ పెద్దగా మెప్పించలేకపోయాయి. ప్రస్తుతం కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా..బస్రుర్ సంగీతం అందిస్తున్నారు.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 25 న ప్రేక్షకులకు ముందుకు రాబోతుందని ప్రకటించారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ చిత్రంలోని భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు.

ఎన్టీఆర్ – ప్రశాంత్ మూవీ షూటింగ్ అప్డేట్..

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న సినిమా యాక్షన్ సీక్వెన్స్ కోసం ఓ భారీ సెట్ ను వేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం. ఈ సెట్ లోనే రెండు వారాల పాటు ఎన్టీఆర్ ఓల్డ్ లుక్ క్యారెక్టర్ పై యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేస్తారట. ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ జరగనుందని తెలుస్తుంది. ఈ యాక్షన్స్ జీన్స్ కోసం ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టినట్లు ఓ వార్త ఫిలింనగర్ లో చక్కర్లు గుర్తుంది.. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి హైలెట్గా నిలవనుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట.. ఇప్పటివరకు ఈ ఎన్టీఆర్ నటించిన సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంటాడని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Also Read : టీవీల్లోకి వచ్చేస్తున్న తేజా ‘మిరాయ్’.. ఎక్కడ చూడొచ్చంటే..?

కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్..

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇటీవల తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రాలైన కేజిఎఫ్ సిరీస్ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. అలాగే ప్రభాస్ తో సలార్ మూవీ చేశాడు.. ఇప్పుడు ఎన్టీఆర్ తో తీసే సినిమా కూడా బ్లాక్ బాస్టర్ అవుతుందని అందరు భావిస్తున్నారు. ఇప్పటివరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి.. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నారని తెలుస్తుంది. బాలీవుడ్‌ సీనియర్ నటుడు అనిల్‌ కపూర్‌ కీలక పాత్రలో కనిపించనున్నట్లు చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వచ్చేసింది. ప్రస్తుతం ఈ కాంబోలో రెండో సినిమా రాబోతుంది. ఇకపోతే ఈ సినిమా కోసమే ఎన్టీఆర్ బక్కచిక్కారు. మరీ ఈ మూవీతో ప్రేక్షకులను అలరిస్తారో లేదో చూడాలి.. ఏప్రిల్ ఎండింగ్ కల్లా సినిమా షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్స్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు టాక్..

Advertisement

 

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×