E-Paper
Advertisement

Mirai : టీవీల్లోకి వచ్చేస్తున్న తేజా ‘మిరాయ్’.. ఎక్కడ చూడొచ్చంటే..?

Mirai : టీవీల్లోకి వచ్చేస్తున్న తేజా ‘మిరాయ్’.. ఎక్కడ చూడొచ్చంటే..?
Advertisement

Mirai : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజా సజ్జా హనుమాన్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆ సినిమా అతని కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.. అతని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది.. ఆ మూవీ తర్వాత మిరాయ్ తో ప్రేక్షకులను పలకరించాడు. భారీ యాక్షన్ కథతో వచ్చిన ఈ చిత్రం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాదు కలెక్షన్ల వర్షం కురిపించింది. సక్సెస్ ఫుల్ టాక్ తో దుమ్ము దులిపేసిన ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. భారీగా కూడా పాజిటివ్ టాక్ ని అందుకోడంతో పాటుగా భారీగా వ్యూస్ ని కూడా సొంతం చేసుకుంది. సినిమా రిలీజ్ అయిన ఇన్నాళ్లకు టీవీల్లోకి మిరాయ్ రాబోతుంది. మరి ఏ ఛానెల్లో రాబోతుందో ఒకసారి తెలుసుకుందాం..

మిరాయ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్..?

తేజ సజ్జా హీరోగా నటించిన ‘మిరాయ్’ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యింది. టీజర్, ట్రైలర్స్ తో మంచి బజ్ ను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ టాక్ అందుకుంది. థియేటర్లలో సక్సెస్ అయింది అలాగే ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఇన్నాళ్లకు ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్ కావడంతో ఈ చిత్రం మళ్లీ వార్తల్లోకి వచ్చింది.. మిరాయ్ ఈనెల 25, 2026న సాయంత్రం 5:30 గంటలకు స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం కానుంది. థియేటర్లలో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ టెలివిజన్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..

Advertisement

Also Read : మూవీ లవర్స్ కు పండగే.. ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 17 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

విజువల్స్ తో సినిమా హిట్టు.. 

గతంలో వచ్చిన తేజ బ్లాక్ బాస్టర్ మూవీ హనుమాన్ తర్వాత వచ్చిన చిత్రం మిరాయ్.. ఈ మూవీ పై మొదటి నుంచి మంచి అంచనాలు క్రియేట్ అవుతూ వస్తున్నాయి. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. సూపర్ యోధుడి పాత్రలో తేజ సజ్జా పర్ఫార్మెన్స్, విజువల్ గ్రాండియర్ ఈ మూవీకి బలంగా నిలిచాయి. టాలీవుడ్ స్టార్ హీరో మంచు మనోజ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించి తన నటనతో మెప్పించాడు. అలాగే తేజకు జోడిగా యంగ్ బ్యూటీ రితిక నాయక్ హీరోయిన్గా నటించింది. విలన్‌గా మంచు మనోజ్ పాత్రకు సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమాకు గౌర హరి సంగీతం అందించాడు.. ఇందులోని ప్రతి పాట కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకి సిక్కుల్ గా సినిమా రాబోతుందంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.. ఇక ప్రస్తుతం తేజ నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.. ప్రశాంత్ వర్మ తేజ కాంబినేషన్లో రాబోతున్న జై హనుమాన్ సినిమాలో నటిస్తున్నాడు. అతి త్వరలోనే ఈ సినిమా గురించి అప్డేట్ రాబోతుందని సినీ ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×