IBOMMA Ravi : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలని ఊపేస్తున్న ఏకైక న్యూస్ ఐబొమ్మ రవి అరెస్ట్… కొత్త సినిమాలను పైరసీ చేసి ఆన్లైన్లోకి వదులుతున్న ఈ రవి అనే వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు.. తెలుగు సినీ పెద్దల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అతని పక్క ప్రణాళికతో అదుపులోకి తీసుకున్నారు.. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న రవి నుంచి కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు.. ఐబొమ్మ రవిని అరెస్టు చేసిన మొదటి రోజే అతని చేతనే ఐబొమ్మ, బప్పం టీవీల అకౌంట్స్ ను బ్లాక్ చేశారు. అలాగే అతను పైరసీ వల్ల ఎంత సంపాదించాడు. ఆ మనీని ఎక్కడ దాచాడు అనేది పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు ఎన్నో బయటపడుతున్నాయని తెలిసిందే. తాజాగా ఈ కేసులో పురోగతి కోసం సీఐడి రంగంలో దిగిందని తెలుస్తుంది. కాస్త వివరాల్లోకి వెళితే..
సినిమాలను పైరసీ చేస్తున్న ఐబొమ్మ నిర్వాహకుడు రవిని ఇటీవలే అరెస్ట్ చేశారు. అతన్ని విచారిస్తున్న పోలీసులకు బుర్ర హీటెక్కెంచేలా అతని నేర చరిత్ర ఒక్కొక్కటి బయటపడుతుంది. ఈ క్రమంలో ఇమ్మడి రవి కేసును క్షుణ్ణంగా పరిశీలించేందుకు సీఐడీ రంగంలోకి దిగింది. తెలంగాణ సీఐడీ ఈ కేసును హ్యాండిల్ చేస్తుంది. ఇప్పటికే రవి నుంచి కీలక విషయాలను సెకంరించినట్లు తెలుస్తుంది. ఐబొమ్మ వెబ్ సైట్ లో ఆన్లైన్ గేమింగ్ , బెట్టింగ్ సైట్స్ లను కూడా ప్రమోట్ చేసినట్లు తెలుసుకున్నారు. అలాగే రవి కి సంబంధించిన డేటా కోసం సైబర్ క్రైమ్ పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఐడీ. త్వరలోనే ఈ కేసును ఓ కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇకపోతే రోజు రోజుకు రవి మెడకు ఉచ్చు బిగసుకుంటుంది. మరి ఉరి శిక్ష పడుతుందా? యావజ్జీవ కారగార శిక్ష పడుతుందా అన్నది ఆసక్తిగా మారింది.
Also Read :బిగ్ బాస్ లోకి యావర్ ఎంట్రీ.. ఒక్కొక్కరికి దబిడి దిబిడే..
ఐబొమ్మ రవి కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికీ అతనికి ఉచ్చు బిగుసుకుంది. తాజాగా పోలీసులు ఇమ్మడి రవిపై మరో 3 సెక్షన్లు నమోదు చేశారు. ఇప్పటికే అతడిపై ఐటీ యాక్ట్, బీఎన్‌ఎస్ సెక్షన్లు, సినిమాటోగ్రఫీ యాక్ట్, విదేశీ యాక్ట్ కింద 10 సెక్షన్లు కింద పలు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.. తాజాగా ఫోర్జరీతో పాటు మరో 2 సెక్షన్లను జోడించారు.. చంచల్‌గూడ సెంట్రల్ జైలు నుండి పోలీసులు అతన్ని ఎస్కార్ట్ చేసి బషీర్‌బాగ్‌లోని సిసిఎస్ కార్యాలయానికి తీసుకువచ్చారు.. ఇకపోతే మరో 4 రోజుల పాటు విచారించనున్నారు. అతడి దగ్గర నుంచి మరింత కీలక సమాచారాన్ని రాబట్టనున్నారు.. అంతేకాదు సీఐడీ కూడా ఈ కేసును ఫాలోఅప్ చేస్తుండటంతో త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి ఈ పైరసీ కేటుగాడికి ఎటువంటి శిక్షలు పడతాయో.. ఏది ఏమైన రవి అరెస్ట్ తో సినీ ఇండస్ట్రీకి భారీ నష్టాలు తగ్గాయనే చెప్పాలి.