Amazon Prime: సాధారణంగా ప్రేక్షకులు ఓటీటీల మీద ఎక్కువ మక్కువ చూపించడానికి కారణం ఏంటి.. కుటుంబం మొత్తం కలిసి హ్యాపీగా ఇంట్లో కూర్చొని సినిమాలు చూడొచ్చు. ఒక టికెట్ ధరకు నెల మొత్తం ఓటీటీ చూడొచ్చు. అన్నింటికన్నా ముఖ్యం.. టీవీలోలా యాడ్స్ రావు కాబట్టి.. ప్రశాంతంగా ఎలాంటి విరామం లేకుండా సినిమా చూడొచ్చు అని చూస్తారు. కానీ, ఇప్పుడు ఓటీటీలు కూడా టీవీల్లా మారిపోతున్నాయా అంటే నిజమే అనే మాటలు వినిపిస్తున్నాయి. ఒక ఓటీటీకి సబ్ స్క్రిప్షన్ తీసుకున్నాకా కూడా యాడ్స్ రావడం ప్రేక్షకులను చాలా అంటే చాలా చిరాకు తెప్పిస్తుంది.
ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వీడియోపై ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఈమధ్యనే ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 సిరీస్ అమెజాన్ లో రిలీజ్ అయిన విషయం తెల్సిందే. మనోజ్ బాజ్ పాయి, ప్రియమణి జంటగా రాజ్ అండ్ డీకే అందించిన ఈ సిరీస్ నవంబర్ 21 నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. గత రెండు సీజన్స్ బాగా హిట్ అవ్వడంతో ప్రేక్షకులు మూడో సీజన్ రాగానే చూడడం మొదలుపెట్తారు. అయితే వారికి సిరీస్ కన్నా యాడ్స్ నే ఎక్కువగా రావడం షాకింగ్ కి గురి చేసింది. అసలు మనం ఓటీటీలో చూస్తున్నామా.. టీవీలో చూస్తున్నామా అనే డౌట్ రాక మానదు.
ఈ యాడ్స్ ఎక్కువ జియో హాట్ స్టార్ లో వచ్చేవి. యాడ్స్ రాకుండా షబ్ స్క్రిప్షన్ కాకుండా విడిగా డబ్బు చెల్లించాలని రూల్ పెట్టారు. కొంతమంది డబ్బు చెల్లించి యాడ్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్స్ కూడా తీసుకున్నారు. హాట్ స్టార్ నుంచి ప్రైమ్ వీడియో కూడా యాడ్స్ ను తీసుకొచ్చింది. గతంలో అడపాదడపా మాత్రమే యాడ్స్ వచ్చేవి . మొదట యాడ్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ తీసుకుంటారా అని అడగడం, స్కిప్ కొడితే మొదట ఏదైనా సిరీస్ కానీ, సినిమా కానీ స్టార్ట్ అయ్యినప్పుడు యాడ్ రావడం కామన్ గా మారిపోయింది.
అయితే ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 కి మాత్రం సిరీస్ లో యాడ్ ఉందా.. ? యాడ్ లో సిరీస్ ఉందా.. ? అనేది మాత్రం తెలియడం లేదు. యాడ్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నవారికి కూడా యాడ్స్ రావడంతో వారు మరింత మండిపడుతున్నారు. వినియోగదారులు యాడ్ ఫ్రీ కోసం డబ్బులు కట్టినా… సదరు సంస్థ ఆ ఆప్షన్ ను అప్ డేట్ చేయకపోవడంతోనే ఇలా జరుగుతుందని ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఇక ఈ ఒక్క సమస్య వలన అమెజాన్ తన క్రెడిబిలిటీని తగ్గించుకుంటుందని, ఇది ఎంత త్వరగా సాల్వ్ చేస్తే అంత మంచిదని, లేకపోతే అమెజాన్ నెగిటివిటీ ట్రోల్స్ ను ఎదుర్కోక తప్పదు అని చెప్పుకొస్తున్నారు. మరి అమెజాన్ ఈ విషయమై ఎలా స్పందిస్తుందో చూడాలి.