E-Paper
Advertisement

Mythri Ravi : ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా టైటిల్ డ్రాగన్ కాదు, బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మైత్రి రవి

Mythri Ravi : ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా టైటిల్ డ్రాగన్ కాదు, బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మైత్రి రవి
Advertisement

Mythri Ravi : కొన్ని సందర్భాలలో చాలా ప్లాన్ గా చేసుకున్న విషయాలన్నీ బయటపడిపోతుంటాయి. ముఖ్యంగా సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు చాలా పగడ్బందీగా దాస్తుంటారు దర్శక నిర్మాతలు. అయితే అవి ఊహించని విధంగా తెలిసిపోతుంటాయి. గతంలో కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకి సంబంధించి టైటిల్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయకముందే మెగాస్టార్ చిరంజీవి ఒక ఫంక్షన్ లో నోరు జారి టైటిల్ చెప్పేశారు. ఆ ఈవెంట్ లోనే సారీ చెప్పారు. అప్పటినుండి మెగా లీక్స్ అంటే బాగా ఫేమస్ అయిపోయాయి.

అలానే వేరొక ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ విజయ్ దేవరకొండ తో చేస్తున్న రౌడీ జనార్ధన్ అనే సినిమా అంటూ టైటిల్ రిలీజ్ చేశారు. అప్పటివరకు విజయ్ సినిమాకి సంబంధించి టైటిల్ రౌడీ జనార్ధన అని ఎవరికి తెలియదు. ఏకంగా దిల్ రాజు నోటి నుంచి అది బయటకు వచ్చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ డ్రాగన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

టైటిల్ డ్రాగన్ కాదు 

Advertisement

ఎస్ ఎస్ రాజమౌళి తన సినిమా ప్రమోషన్స్ కి జపాన్లో కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు అనే ప్రశ్న రాజమౌళికి ఎదురైనప్పుడు, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమా కోసం నేను ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పారు.

అయితే అప్పటికే వీరిద్దరూ చేస్తున్న సినిమాకి డ్రాగన్ అని అనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇక రాజమౌళి ఇంటర్వ్యూలో ఆ మాటలు చెప్పిన తర్వాత అందరూ టైటిల్ అదే అని ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికీ కూడా ఆ సినిమాల ప్రస్తావన వస్తే డ్రాగన్ అని మాట్లాడుతూ ఉంటారు.

Advertisement

అయితే ఈ సినిమా టైటిల్ గురించి నిర్మాత మైత్రి మూవీ మేకర్స్ రవి ఒక క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ చేస్తున్న సినిమా టైటిల్ డ్రాగన్ అనేది ఫిక్స్ కాలేదు. కేవలం వర్కింగ్ టైటిల్ కోసం మాత్రమే దానిని వాడుతున్నాము. ఆ సినిమాకి సంబంధించి టైటిల్ మార్చే అవకాశం ఉంది అని క్లారిటీ ఇచ్చారు.

అది సాధ్యం అవుతుందా? 

ఈరోజుల్లో ఒక సినిమాకి సంబంధించిన టైటిల్ దాచడం అనేది బిగ్గెస్ట్ టాస్క్ అయిపోయింది. ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసి దాచినా కూడా ఆ టైటిల్ బయటకు వచ్చేస్తున్నాయి. ఇటువంటి విషయాల్లో స్ట్రెయిట్ గా ఉండే ఎస్ఎస్ రాజమౌళి కూడా వారణాసి సినిమా టైటిల్ ను దాచలేకపోయారు. ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమా టైటిల్ ను కూడా దాచలేకపోయారు.

అది కాదు అని కొంతమంది అనుకున్న కూడా దాన్నే ఫిక్స్ చేసి చెప్పారు. ఇప్పుడు డ్రాగన్ అనే అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు దీన్ని మళ్లీ మార్చే అవకాశం ఉందా అనేది చాలామందికి వస్తున్న డౌట్. ఎన్ని చెప్పినా కూడా డ్రాగన్ అనే టైటిల్ జనాల్లోకి వెళ్లిపోయింది కాబట్టి దాన్ని ఉంచే అవకాశం ఉంది.

Also Read: Prabhas : ప్రభాస్ దర్శకులు అందరూ ప్రామిస్ లు చేస్తున్నారు, ఒకరిని మించి ఒకరు

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×