Kabaddi World Cup 2025: కబడ్డీ ప్రపంచ కప్ ( Kabaddi World Cup 2025 ) విజేతగా టీమిండియా ( Team India) మహిళల జట్టు నిలిచింది. 2025 సంవత్సరం మహిళల క్రీడాకారులకు బాగా కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా భారత మహిళలు మరో ప్రపంచకప్ గెలుచుకున్నారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన మహిళల కబడ్డీ ప్రపంచ కప్ విజేతగా ఇండియా తాజాగా నిలిచింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో చైనీస్ తైపీపై 35-28 తేడాతో ఇండియా విజయం సాధించి, 2025 సంవత్సరం ఛాంపియన్ గా నిలిచింది. దీంతో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని ఉంటాయి. అయితే ఇదే సంవత్సరం ఇప్పటికే భారత మహిళలు 3 ప్రపంచ కప్ లు గెలుచుకున్నారు. ఇవాళ కబడ్డీ ప్రపంచ కప్ విజేతగా టీమిండియా మహిళల జట్టు నిలిచి చరిత్ర సృష్టించింది.
2025 సంవత్సరంలో టీమిండియా మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారు. దీనికి నిదర్శనమే ఈ సంవత్సరం మొత్తం 4 ప్రపంచ కప్ లు గెలుచుకున్నారు భారత మహిళలు. మొదట అండర్ 19 మహిళల వరల్డ్ కప్ విజేతగా టీమిండియా ఇదే సంవత్సరం గెలిచింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టును చిత్తు చేసింది టీమిండియా. ఫైనల్స్ లో ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించి 2025 వరల్డ్ కప్ గెలుచుకుంది అండర్ 19 మహిళల టీమ్ ఇండియా.
గత నెలలో మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ జరిగింది. ఇందులో హర్మన్ ప్రీత్ కౌర్ జట్టు అద్భుతంగా రాణించింది. ఫైనల్ దాకా వెళ్లి ఛాంపియన్ గా నిలిచింది. ఈ 50 ఓవర్ల వరల్డ్ కప్ ఫైనల్ లో దక్షిణాఫ్రికాపైన 52 పరుగుల తేడాతో టీమిండియా మహిళల విజయం సాధించింది. దీంతో మొట్ట మొదటి సారిగా వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది ఈ టీమ్ ఇండియా మహిళల జట్టు.
ఇక లేటెస్ట్ గా అంధుల టీ20 వరల్డ్ కప్ మహిళల టోర్నమెంట్ లో కూడా టీమ్ ఇండియా విజయం సాధించింది. ఆదివారం రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో నేపాల్ జట్టును చిత్తు చేసి ఛాంపియన్ గా నిలిచింది టీం ఇండియా. దీంతో టీమ్ ఇండియా అంధుల జట్టు తొలిసారి టి20 వరల్డ్ కప్ గెలిచి రికార్డు సృష్టించింది. ఇక ఇవాళ కబడ్డీ వరల్డ్ కప్ లో చైనీస్ తైపీపై విజయం సాధించి ఛాంపియన్ గా నిలిచింది.
– India Won U-19 Women's WC.
– India Won Women's World Cup.
– India Won Women's WC for blind.
– Now India Won Women's Kabaddi WC.WHAT A HISTORIC YEAR FOR INDIA IN WOMEN'S, THEY MADE PROUD INDIA AT THE GLOBAL WORLD. 🙇♂️🇮🇳 pic.twitter.com/1w6mYBXACH
— Tanuj (@ImTanujSingh) November 24, 2025