Nithiin: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొంతమంది హీరోలకి విపరీతమైన టాలెంట్ ఉంది. దీంట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదు. కానీ కొన్ని సందర్భాలలో వాళ్ళు ఎంచుకునే కథలు చూస్తుంటే ఈ సినిమాను ఎలా ఓకే చేశాడు డిస్కషన్స్ లో అనిపిస్తుంది. ముఖ్యంగా హీరో నితిన్ విషయానికి వస్తే విపరీతమైన టాలెంట్ ఉంది. సినిమా కోసం బాగా కష్టపడతాడు. ఒక తరుణంలో సినిమా కోసం సిక్స్ ప్యాక్ కూడా చేసిన రోజులు ఉన్నాయి. అప్పటికి తెలుగు హీరోలు ఎవరు పెద్దగా 6 ప్యాక్ చేయలేదు అల్లు అర్జున్ మినహా ఇస్తే.
ఇకపోతే నితిన్ సక్సెస్ఫుల్ సినిమా చేసి చాలా రోజులు అయిపోయింది. భీష్మ సినిమా తర్వాత నితిన్ కెరియర్ లో ఇప్పటివరకు సక్సెస్ఫుల్ సినిమా పడలేదు. ఎన్ని సినిమాలు చేసినా కూడా అవన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో వర్కౌట్ కావడం లేదు. కొన్ని సినిమాలు ఊహించిన స్థాయిలో వర్కౌట్ కాకపోవడంతో వచ్చిన ప్రాజెక్టులు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. నితిన్ హీరోగా తమ్ముడు అనే సినిమా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చింది. ఆ సినిమా ఫలితం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత ఎల్లమ్మ సినిమా ఆ బ్యానర్ లో వస్తుంది అనుకున్నారు కానీ నితిన్ ఆ సినిమా నుంచి తప్పుకున్నారు.
ఇండస్ట్రీలో కొన్ని సందర్భాలలో ఫ్రెండ్షిప్ కోసం కూడా సినిమాలు చేసిన సంఘటనలు ఉన్నాయి. చాలా సందర్భాలలో వరుణ్ తేజ్ చేయాల్సిన సినిమాలను నితిన్ చేశాడు. అలానే నితిన్ చేయాల్సిన చాలా సినిమాలను వరుణ్ తేజ్ చేశాడు. ఈ ప్రాజెక్టుల గురించి వాళ్ళకి పూర్తి స్థాయిలో క్లారిటీ లేకపోయినా ఇలా చేయడం వల్లనే వాళ్ళిద్దరి మధ్య ఒక యాక్సిడెంటిల్ ఫ్రెండ్షిప్ మొదలైంది.
ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ మరియు దర్శకురాలు నీరజకోన నితిన్ కి మంచి ఫ్రెండ్. వాస్తవానికి తెలుసు కదా సినిమాను నితిన్ హీరోగా చేయాల్సింది కానీ కొన్ని కారణాల వలన సిద్దు జొన్నలగడ్డ చేశాడు.
అయితే ఇప్పుడు నీరజాకోనా దర్శకత్వంలో నితిన్ సినిమా చేయబోతున్నట్లు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. చాలామంది నితిన్ అభిమానులు దీనిమీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలుసు కదా సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. మళ్ళీ ఆ దర్శకురాలితో ఎందుకు సినిమా అనేది కొంతమంది అభిప్రాయం. కేవలం ఫ్రెండ్షిప్ కోసం ఇంకో ప్లాప్ వచ్చినా తట్టుకుంటాడా అని డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయి.
నితిన్ కు ఒక తరుణంలో వరుసగా డిజాస్టర్ సినిమాలు వచ్చాయి. అలా వరుసగా డిజాస్టర్ సినిమాలు పడుతున్న తరుణంలో విక్రమ్ కేక్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఇష్క్ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. అప్పటినుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా నితిన్ కి బాగా కనెక్ట్ అయిపోయారు.
అయితే రీసెంట్ గా విక్రమ్ కే కుమార్ కూడా నితిన్ కి మరో కాన్సెప్ట్ చెప్పాడు. ఆ కాన్సెప్ట్ చెప్పింది చెప్పినట్లుగా తీస్తే అది ఒక గొప్ప సినిమా అవుతుంది అని నితిన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. నితిన్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నిటిలో కంటే ఆ సినిమా మీదే కొద్దో గొప్ప హోప్స్ ఉన్నాయి. మరి విక్రమ్ కె కుమార్ ఆ సినిమాతో మరో కం బ్యాక్ నితిన్ కెరియర్ కి ఇస్తాడా లేదా చూడాలి.
Also Read: 3Roses S2 : త్రీ రోజెస్ ప్రమోషన్ కి రాజా సాబ్ వాడుతున్నారు, ఎస్ కే ఎన్ మాస్టర్ ప్లాన్