E-Paper
Advertisement

3Roses S2 : త్రీ రోజెస్ ప్రమోషన్ కి రాజా సాబ్ వాడుతున్నారు, ఎస్ కే ఎన్ మాస్టర్ ప్లాన్

3Roses S2 : త్రీ రోజెస్ ప్రమోషన్ కి రాజా సాబ్ వాడుతున్నారు, ఎస్ కే ఎన్ మాస్టర్ ప్లాన్
Advertisement

3Roses S2 : ఒకవైపు థియేటర్లో విడుదల కాబోయే అద్భుతమైన సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా ఉండటం మాత్రమే కాకుండా, సినిమాలను కూడా నిర్మిస్తూ ఉంటాడు నిర్మాత ఎస్ కే ఎన్. నిర్మాత ఎస్ కే ఎన్ కి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తన సినిమాలు ఫంక్షన్స్ లో మాత్రమే కాకుండా ప్రతి సినిమా ఫంక్షన్స్ లో కూడా దర్శనమిస్తూ ఉంటారు. ఎస్ కే ఎన్ కొన్ని సినిమా ఈవెంట్స్ కు హాజరవుతూ తను ఇచ్చే స్పీచ్ వైరల్ గా ఉండేలా చూసుకుంటాడు.

మామూలుగా కొంతమంది సినిమా దర్శకులు పంచులు ప్రాసులను తమ కథల్లో ఎలా రాసుకుంటారు అలాంటివే ఎస్ కే ఎన్ స్పీచ్ లో కూడా తారస పడుతూ ఉంటాయి. ఇక ప్రస్తుతం ఎస్ కే ఎన్ త్రీ రోజెస్ సీజన్ 2 నిర్మించిన సంగతి తెలిసిందే. అది డిసెంబర్ 12 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కి రానుంది. ఈ తరుణంలో దానిని విపరీతంగా ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు.

రాజా సాబ్ ను వాడుతున్నారు

Advertisement

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా ది రాజా సాబ్. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. చాలా సంవత్సరాలు తర్వాత ప్రభాస్ ఒక ఎంటర్టైన్మెంట్ రోల్ ఈ సినిమాలో చేస్తున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలైంది. ఆ ట్రైలర్ కూడా సినిమా మీద మంచి అంచనాలను నెలకొల్పింది.

అయితే ఈ సినిమా నుంచి కొన్ని రోజుల క్రితమే ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఈ సింగిల్ చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ సింగిల్ రిలీజ్ రోజు కూడా చెప్పిన టైంకి విడుదల చేయలేకపోయారు. అలా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత వచ్చిన ఈ సింగిల్ చాలామందిని నిరాశ పరిచింది.

Advertisement

ఇక ప్రస్తుతం ఆ సింగిలు విపరీతంగా వాడుతున్నారు. నాగార్జున hostv చేసే బిగ్ బాస్ సీజన్ 9 ఇంట్రో సాంగుగా దానిని నిన్న ఎపిసోడ్ లో వాడారు. ఈరోజు త్రీ రోజెస్ సినిమాకి సంబంధించి ఒక ఇంటర్వ్యూ విడుదలైంది. ఆ ఇంటర్వ్యూ అనంతరం ముగ్గురు హీరోయిన్లు ఈ పాటకు వైబ్ అయ్యారు. రీల్ పూర్తయిన చివర్లో ఎస్కేయం త్రీ రోజెస్ డిసెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది చూడండి అంటూ చెప్పాడు. మొత్తానికి రాజా సాబ్ బానే వాడుతున్నారు.

ఎస్ కే ఎన్ మాస్టర్ ప్లాన్ 

ఎస్ కే ఎన్ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను ఎలా అయితే నిర్మిస్తాడో ఆ సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడానికి కూడా అదే స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కేవలం ప్రయత్నాలు చేయటం మాత్రమే కాకుండా అన్ని విధాల సక్సెస్ కూడా అయ్యాడు.

ఇప్పుడు త్రీ రోజెస్ సినిమా కోసం ఏకంగా ప్రభాస్ సినిమాను వాడుతున్నాడు. అయితే ది రాజా సాబ్ సినిమాకి సంబంధించి కీలకమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎస్ కే ఎన్ ఇచ్చాడు. ఆ సినిమా గురించి ఏ టాపిక్ వచ్చినా కూడా ట్విట్టర్ వేదికగా అందరికీ సమాధానం ఇస్తూ ఉంటాడు. అందుకే ఎస్ కే ఎన్ సినిమాలు తక్కువగా నిర్మించిన కూడా సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉండటంతో ఎక్కువగా వినిపిస్తాడు.

Also Read: Lokesh Kanakaraj : నిర్మాతలుగా మారిన కార్తీక్ సుబ్బరాజ్, లోకేష్ కనకరాజ్

Related News

ఆదర్శ కుటుంబం ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ లాక్..ఎప్పుడు? ఎక్కడంటే?

బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన నటి వితికా షేర్… తొలి అడుగు అంటూ!

చిన్న కూతురి పేరు రివీల్ చేసిన దీపిక పదుకొనె… ఫోటో వైరల్!

నిన్న ఫౌజీ.. నేడు స్పిరిట్ వాయిదాల దిశగా ప్రభాస్ సినిమాలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

నేను చనిపోయాకా నా ఆస్తి మొత్తం వాళ్ళకే… రజినీకాంత్ షాకింగ్ డేసిషన్!

దేవిశ్రీప్రసాద్ ‘ఎల్లమ్మ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. విడుదల ఎప్పుడంటే?

పెళ్లి పీటలెక్కబోతున్న సాయి ధరంతేజ్.. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్!

రణబాలి 2 మూవీ పై రాహుల్ బిగ్ అప్డేట్.. ఫాన్స్ కు పూనకాలు గ్యారెంటీ!

Big Stories

Advertisement
×