E-Paper
Advertisement

GV Prakash : హీరోగా జీవి ప్రకాష్ కొత్త సినిమా, ఆకట్టుకుంటున్న పోస్టర్

GV Prakash : హీరోగా జీవి ప్రకాష్ కొత్త సినిమా, ఆకట్టుకుంటున్న పోస్టర్
Advertisement

GV Prakash : తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో చాలామంది మల్టీ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. వాళ్ల ప్రస్తావన వస్తే జీవి ప్రకాష్ ఒకరు. ఒకవైపు అద్భుతమైన సినిమాలకు మ్యూజిక్ చేయడం మాత్రమే కాకుండా నటుడుగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. తను హీరోగా చేసిన ఎన్నో సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. ఇక జీవి ప్రకాష్ ప్రస్తుతం తెలుగులో సూపర్ హిట్ సినిమాలకు మంచి మ్యూజిక్ అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో వచ్చిన సార్, లక్కీ భాస్కర్ వంటి సినిమాలకు జీవీ ప్రకాష్ మ్యూజిక్ మంచి ప్లస్ గా మారింది.

జీవి ప్రకాష్ కొత్త సినిమా 

ఒకవైపు మ్యూజిక్ చేస్తూనే మరోవైపు నటుడుగా కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం జీవి ప్రకాష్ హ్యాపీ రాజా అనే సినిమాను చేస్తున్నాడు. దీనికి సంబంధించిన పోస్టర్ కొద్దిసేపటి క్రితమే విడుదల అయింది. పోస్టర్ విపరీతంగా ఆకట్టుకుంటుంది.

Advertisement

అఫీషియల్ బ్లాక్ కోట్ తో ఒక చేత్తో కూల్డ్రింక్ పట్టుకొని హ్యాపీగా కనిపిస్తున్నాడు జీవీ ప్రకాష్. వెనక మాత్రం దారుణమైన గొడవ జరుగుతుంది. ఈ పోస్టర్ చేస్తుంటే ఒక ఫంక్షన్ లో వెనక దారుణమైన గొడవను ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు జీవీ ప్రకాష్. ఈ సినిమాకి హ్యాపీ రాజా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అంటే ఈ సినిమాలో జీవీ ప్రకాష్ క్యారెక్టర్ ఆనంద్ రాజా అని ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

సూర్య సినిమాకి మ్యూజిక్ 

ఇకపోతే ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య తన 46వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కూడా జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుంది అని గతంలో అనౌన్స్ చేశారు. మొత్తానికి తెలుగులో సంగీత దర్శకుడుగా, తమిళ్లో హీరోగా విపరీతమైన పేరు సాధించుకుంటున్నాడు జీవి ప్రకాష్.

Advertisement

హ్యాపీ రాజా సినిమాకి మరియా రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. జస్టిన్ ప్రభాకర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. జస్టిన్ మ్యూజిక్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు విజయ్ దేవరకొండ రష్మిక నటించిన డియర్ కామ్రేడ్ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ అందించాడు జస్టిన్.

Also Read: Ustad Bhagat Singh : పవర్ స్టార్ స్టైలిష్ స్వాగ్, ఫస్ట్ సింగిల్ కంప్లీట్ డీటెయిల్స్

Related News

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

ఒంటిమీద బట్టలు లాగేసి ఘోరంగా అవమానించారు – స్టార్ కమెడియన్ ఎమోషనల్!

పవన్ అభిమాని మృతి..గొప్ప మనసు చాటుకున్న ఎస్కేఎన్!

నాని ‘ప్యారడైజ్’ అసలు కథ ఇదేనా?

రజనీకాంత్ జైలర్ 2 వాయిదాపై మేకర్స్ క్లారిటీ..వెనక్కి తగ్గేదేలే!

ప్రభాస్ తో సుమంత్ ప్రభాస్.. ఒక్కమాటతో రియల్ క్యారెక్టర్ రివీల్!

నేపాల్ విధ్వంసం.. రంగంలోకి సోనూసూద్.. ప్రజలకు విజ్ఞప్తి!

Big Stories

Advertisement
×