E-Paper
Advertisement

Telangana Panchayat elections : ఎత్తుకు పైఎత్తు పంచాయతీ పోరు

Telangana Panchayat elections : ఎత్తుకు పైఎత్తు పంచాయతీ పోరు

Telangana Panchayat elections:  పంచాయతీ పోరు పీక్స్ చేరుకుంది. అభ్యర్ధులు పోటాపోటీగా ప్రచారం చేస్తూ గ్రామపోరును రసవత్తరంగా మారుస్తున్నారు. గతానికి భిన్నంగా పంచాయతీ ఎన్నికల్లో విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కేటాయించిన గుర్తులు, ఫొటోలతో పాటు…గెలిపిస్తే చేయబోయే అంశాలు వివరిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు నూతన ఒరవడులు తొక్కుతున్నారట అభ్యర్ధులు.

ప్రచారం పై పార్టీ నేతలు ఫోకస్

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలతో గ్రామాల్లో రాజకీయం హీటెక్కింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న గ్రామ పంచాయతీల్లో సత్తా చాటేందుకు ప్రధాన పార్టీల నేతలు వ్యూహారచన చేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియడంతో ప్రచారంపై ఫోకస్ చేశారు అభ్యర్ధులు. పోటీ చేస్తున్న అభ్యర్థులు గతానికి భిన్నంగా సోషల్ మీడియాను వినియోగించుకుంటున్నారట. ప్రతి గ్రామంలో వార్డు మెంబర్ గా పోటీ చేస్తున్నవారు.. సర్పంచ్ గా బరిలో నిలిచినవారు సోషల్ మీడియా వేదికగాను ప్రచారం చేస్తున్నారు. గ్రామానికి చెందిన వారు ఇతర ప్రాంతాల్లో ఉంటే వారికి సమాచారం చేరవేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారట. గెలిపిస్తే ఏం చేస్తాం.. అభివృద్ధి పనులు ఇతరాత్రాలను సైతం పోస్టులు పెడుతున్నారు. ఏ వార్డుకు పోటీ చేస్తున్నామనే విషయాన్ని సైతం స్పష్టంగా చెబుతున్నారు. అంతేకాదు ఏ గుర్తు కేటాయించిందనే అంశాలను సైతం ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్ట్రాగ్రాం.. టెలిగ్రాం ఇలా అన్నింటిలోనూ ప్రచారం చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్

రాష్ట్రంలో తొలి విడత, రెండో విడత బరిలో ఉండే అభ్యర్థుల ప్రకటన జరిగింది. వారికి అధికారులు గుర్తులు సైతం కేటాయించారు. ఈ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగకపోయినప్పటికీ ఆయా పార్టీల మద్దతుతోనే అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే గ్రామాల్లో ఎక్కువగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్యే పోటీ తీవ్రంగా నెలకొంది. కొన్ని గ్రామాల్లో కొందరు పార్టీల మద్దతు ఇవ్వకపోవడంతో స్వతంత్రంగా బరిలో నిలిచారు. వారికి సైతం గుర్తులు వచ్చాయి. తొలివిడత ఈ నెల 11న, రెండో విడుత 14న ఎన్నికలు జరుగనుండటంతో విస్తృత ప్రచారంను అభ్యర్థులు చేస్తున్నారు. అయితే వార్డుల వారీగా ఓటర్ల లిస్టు ప్రకారం వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి గెలిపిస్తే చేయబోయే అంశాలను అందులో పోస్టు చేస్తున్నారు. తనకు ఫలానా గుర్తు కేటాయించారని.. ఆ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. దీనికి తోడు సోషల్ మీడియాలో ఫొటోలు, కేటాయించిన గుర్తులను పోస్టు చేసి విస్తృత ప్రచారం చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలోనూ ప్రచారం ఊపందుకుంది.

ఓటర్లను ఆకర్షంచే ప్రయత్నం

పోటీ చేసే అభ్యర్థులు ఇంటింటికెళ్లి గెలిపిస్తే ఏం చేస్తామనే విజన్‌ను వివరిస్తున్నారు. గ్రామాభివృద్ధి కోసం ఐదేళ్లలో చేయబోయే కార్యక్రమాల ప్రణాళికలు రెడీ చేశామని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. గెలిపిస్తే డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తా.. కోతులు గ్రామానికి రాకుండా చేస్తా.. ఊరిలో సీసీ కెమెరాలు పెట్టిస్తా.. గ్రంథాలయం ఏర్పాటు చేస్తా.. మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయిస్తా.. ఒకడుగు ముందుకేసి నిరుద్యోగుల కోసం ఉద్యోగ మేళా, హెల్త్ క్యాంపులు పెట్టిస్తామని.. సీసీరోడ్లు, క్రీడా పరికరాలు.. ఇలా హామీలిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం మొదలు పెట్టారట. చీరలు, కుంకుమ భరిణెలు, నగదు ఇతర కానుకలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట.

మద్దతుదారులను గెలిపించుకునేందుకు స్పెషల్ ఫోకస్

సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీల నేతలు గ్రామాలకు చేరుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు స్పెషల్ ఫోకస్ పెట్టారట. పార్టీలకు సంబంధం లేకుండా జరిగే ఎన్నికలే అయినా.. తమ వాళ్లే గెలవాలనే పట్టుదలతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గ ఇన్-చార్జిలు, తదితర నాయకులు గ్రామాల బాటపట్టారట. సొంత గ్రామాలపై మరింత ఫోకస్ పెట్టారు నేతలు. పంచాయతీల్లో పట్టు సాధించి, రానున్న ఎన్నికలకు గట్టి పునాది వేసేలా ముందుకెళ్తున్నారు. తమ సత్తా చాటేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. తమ మద్దతు దారులు గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఎదుటి వ్యక్తిలోని లోపాలను తెలుసుకొని ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఇది ఇలా ఉంటే గ్రామాల్లో మాత్రం సోషల్ మీడియాలో మాత్రం పంచాయతీ ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు వేదికగా చేసుకుంటున్నారు. విస్తృత ప్రచారం చేసుకుంటున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు వీడియోలు సైతం పోస్టు చేస్తున్నారట.

పట్నం పై పల్లె ఫోకస్

పట్నంపై పల్లె ఫోకస్ పెట్టింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు ఎవరెవరు పట్నాలలో ఉన్నారు.. ఎంత మంది ఉన్నారనేది ఆరా తీయడంతో పాటు వారికి ఎన్ని ఓట్లు ఉన్నాయి.. ఎలా రప్పించాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశారట అభ్యర్థులు. ఫోన్ చేస్తూ పోలింగ్ రోజూ విధిగా గ్రామాలకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు వరుసలు సైతం కలిపి తనను గెలిపించాలని.. గెలిపిస్తే ఏం పని కావాలన్నా చేసి పెడతానంటూ హామీలు ఇస్తున్నారట. ఓటర్లను ఇతర ప్రాంతాల నుంచి రప్పించేందుకు కొంతమంది నేతలకు పార్టీలు సైతం బాధ్యతలు అప్పగిస్తున్నాయి. వారిని పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చే వరకు వారిదే బాధ్యత అని చెబుతున్నట్లు సమాచారం.

ప్రతీ ఒక్క ఓటు కీలకం

సర్పంచ్ ఎన్నికల్లో ప్రతీ ఒక్క ఓటు కీలకం. గతంలో ఒక్క ఓటుతో ఓడిపోయిన సర్పంచ్ స్థానాలు చాలా ఉండటంతో సర్పంచ్ గా, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అంటే పోటీచేసే వారు ఎన్నికలకు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారనేది స్పష్టమవుతోంది. ఇది ఇలా ఉంటే మనకులానికి ఈసారి పోటీచేసే అవకాశం వచ్చింది. ఖచ్చితంగా గెలిపించుకుందాం.. లేకుంటే ఎప్పుడు గెలువలేమని.. అందరూ కలిసి రావాలని ఫోన్ చేసి విజ్ఞప్తులు చేస్తున్నారట. ఓవరాల్ గా పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్ది గ్రామాల్లో ప్రచారం ఊపందుకుంది.

Story by Venkatesh, Big Tv 

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×