The Girl Friend : రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మందన్న నటించిన సినిమా ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా విపరీతమైన సక్సెస్ సాధించింది. ఒకవైపు ప్రశంసలు వస్తూనే మరోవైపు అద్భుతమైన కలెక్షన్స్ కూడా రాబట్టింది. మామూలుగా కొన్ని సినిమాలుకు నెగిటివ్ కామెంట్స్ రావడం కూడా సహజంగా జరుగుతుంది. ఈ సినిమాకు కూడా అలానే నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.
ముఖ్యంగా రాహుల్ సతీమణి చిన్మయి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సామాజిక అంశాల పైన ఆవిడ రియాక్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఆవిడని కూడా కొంతమంది ట్రోల్ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయం పైన చిన్మయి ట్రోల్ అవుతూనే ఉంటుంది. అలానే అద్భుతమైన పాటలు పాడటం మాత్రమే కాకుండా డబ్బింగ్ చెబుతూ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకుంది. తెలుగులో సమంత చేసిన సినిమాలకు ఎక్కువ శాతం డబ్బింగ్ చెప్పేవారు.
ఇక రాహుల్ దర్శకత్వం వహించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా 5వ తారీఖున నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది. అయితే సోషల్ మీడియాలో కూడా ఆ సినిమాకి విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి. అలానే కొంతమంది ఆ సినిమా పైన నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజన్ ఈ సినిమా మీద విపరీతమైన బూతు పదాలను వాడుతూ ట్రోల్ చేశాడు దానికి కౌంటర్ ఎటాక్ గా రాహుల్ కూడా అదే స్థాయిలో మాట్లాడుతూ వెంటనే ప్రేమను కూడా వ్యక్తపరిచాడు.
అరే అంటూ డాష్ పదాన్ని వాడుతూ ఇలాగే రాస్తారా. ఎంజాయ్ అండ్ థాంక్యూ ఆ యాష్ టాగ్ యూస్ చేసినందుకు. ఆల్రెడీ నెట్ఫెక్స్ లో నెంబర్ వన్ పొజిషన్లో మూడు నాలుగు దేశాల్లో ఉంది. ఇంకొన్ని దేశాల్లో 9, 10 ట్రెండింగ్ లో ఉంది. ఇంకొన్ని ట్వీట్స్ వేయండి బ్రో. వీయర్ షిప్ ఇంకా పెరుగుతుంది. ఐ హోప్ మీరు థియేటర్లో రిలీజ్ అయినప్పుడు కూడా ఇలాగే గోల చేశారు. చేసి ఉంటారులే బ్రో అందుకేగా సూపర్ హిట్ అయింది వెరీ గ్రేట్ ఫుల్ బ్రో అంటూ లవ్ సింబల్స్ పెట్టాడు రాహుల్.
Arey lavadeykebaal… ilaage raasta ra. Enjoy🤗🤗♥️ And thanks for using the hashtag bro. Helps 😊👍🏽 Already Number 1 on Netflix in 3-4 countries. In the top 10 in 9 countries. Inkonni tweets veyyandi bro… viewership inka peruguddhi. I hope meeru theatrical release appudu kuda…
— Rahul Ravindran (@23_rahulr) December 10, 2025
అయితే కొన్ని సినిమాలు ప్రశంసలకు మాత్రమే నోచుకుంటాయి ప్రశంసలతో పాటు కమర్షియల్ సక్సెస్ రావడం అనేది అతి తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించి మంచి ప్రశంసలు కూడా వచ్చాయి. ఇప్పటికీ కూడా నెట్ ఫ్లెక్స్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంది అంటే ఈ సినిమాకి ఏ స్థాయిలో వియర్ షిప్ వస్తుందో ఈజీగా అర్థమయిపోతుంది. మొత్తానికి రష్మిక లేడీ ఓరియంటెడ్ గా చేసిన ఈ సినిమా చాలామందికి కూడా ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక టాక్సిక్ రిలేషన్ నుంచి ఈ సినిమా చూసిన తర్వాత దూరం అవుతున్న వాళ్లు కూడా ఉన్నారు అని సోషల్ మీడియా పోస్టులు చూస్తే అర్థమవుతుంది.
Also Read : Karthi : ఖైదీ 2 గురించి అడగ్గానే ఫేస్ మారిపోయింది, ప్రాజెక్టు పరిస్థితి ఏంటో?