E-Paper
Advertisement

Karthi : ఖైదీ 2 గురించి అడగ్గానే ఫేస్ మారిపోయింది, ప్రాజెక్టు పరిస్థితి ఏంటో?

Karthi : ఖైదీ 2 గురించి అడగ్గానే ఫేస్ మారిపోయింది, ప్రాజెక్టు పరిస్థితి ఏంటో?
Advertisement

Karthi : హీరో కార్తీక్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు మామూలుగా తమిళ్ ప్రేక్షకులు కంటే కూడా తనకు తెలుగు ప్రేక్షకులే ఎక్కువ ఇష్టం అని చెబుతూ ఉంటాడు కార్తీ. అలానే తెలుగు ప్రేక్షకులకు కూడా కార్తీ ను చూస్తే ఒక తమిళ్ హీరో అనే ఫీల్ క్రియేట్ అవ్వదు. కొన్నిసార్లు బాక్స్ ఆఫీస్ వద్ద అతను చేసిన సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు కానీ పర్ఫార్మర్ గా మాత్రం అతను ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన సత్యం సుందరం సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు.

ఇక ప్రస్తుతం అన్నగారు వస్తారు సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు కార్తీ. ఈ సినిమా డిసెంబర్ 12న విడుదలకు సిద్ధంగా ఉంది ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు నిర్వహించింది. ఈ ఈవెంట్ కు దర్శకులు దేవకట్ట, బాబి, శైలేష్, రాహుల్ రవీంద్రన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఖైదీ 2 సినిమా పరిస్థితి ఏంటి?

Advertisement

నగరం సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు లోకేష్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది ఆ తర్వాత వచ్చిన ఖైదీ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక రాత్రి ప్రయాణాన్ని చాలా ఆసక్తికరంగా చూపించి దర్శకుడుగా అద్భుతమైన మార్కులు సాధించుకున్నాడు.

ఖైదీ సినిమా తర్వాత లోకేష్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పటికీ కూడా చాలామంది ఖైదీ ఏ లోకేష్ బెస్ట్ వర్క్ అని చెబుతూ ఉంటారు. ఆ తర్వాత వచ్చిన మాస్టర్, విక్రమ్ సినిమాలు కూడా నెక్స్ట్ లెవెల్ సక్సెస్ సాధించాయి.

Advertisement

ఎక్కడో హాలీవుడ్ లో ఉండే కల్చర్ ను ఇండియన్ సినిమాకి పరిచయం చేశాడు. ఇప్పటికీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అంటేనే ఒక రకమైన క్యూరియాసిటీ ఉంటుంది. ఇందులో భాగంగా ఖైదీ 2 సినిమా రాబోతున్నట్లు అధికారికంగానే ప్రకటించారు. అయితే దాని అప్డేట్ గురించి నేడు జరిగిన ఈవెంట్ లో అడిగితే కార్తీ సరైన సమాధానం చెప్పకుండా వస్తుంది వస్తుంది అని దాటిపోయారు.

ఎన్టీఆర్ ఎంజీఆర్ మళ్లీ వస్తే? 

అయితే ఈ సినిమా కాన్సెప్ట్ గురించి స్టేజ్ పైన మాట్లాడారు. ఒకప్పుడు ఎంజీఆర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు సినిమాల్లోనూ అలానే రాజకీయాల్లోనూ ఎంతో సేవ చేశారు. వాస్తవానికి వాళ్లు సక్సెస్ అయిన విధానం చాలామందికి ఆదర్శం. అలాంటి వాళ్లు మళ్లీ ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా కాన్సెప్ట్ అంటూ కార్తీ సినిమా గురించి చెప్పాడు.

Also Read : Varanasi: వారణాసి అప్డేట్ ఇచ్చిన దేవ కట్టా, రాజమౌళి చూస్తే పరిస్థితి ఏంటి గురు?

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×