E-Paper
Advertisement

Viral News: భార్యతో గొడవ.. జేబులో చేతులు పెట్టుకుని 450 కి.మీలు నడుస్తూ వెళ్లిపోయిన భర్త!

Viral News: భార్యతో గొడవ.. జేబులో చేతులు పెట్టుకుని 450 కి.మీలు నడుస్తూ వెళ్లిపోయిన భర్త!
Advertisement

కోపం, బాధను కొంత మంది అంత త్వరగా కంట్రోల్ చేసుకోలేరు. కొన్నిసార్లు ఆ బాధ నుంచి బయటపడేందుకు ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఇంట్లో ఏదైనా గొడవ అయినప్పుడు కొంత మంది కాసేపు బయటకు వెళ్లి వస్తారు. మరికొంత మంది కొంత సమయం పాటు మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు. ఇంకొంత మంది తమ కోపాన్ని ఇంట్లోని వస్తువులను విరగ్గొట్టడం, పగలగొట్టడం మీద చూపిస్తారు. కానీ, ఓ వ్యక్తి అదేదో సినిమాలో చెప్పినట్లు చేతులు జేబులో పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఒకటి.. రెండు కిలో మీటర్లు కాదు. ఏకంగా 450 కిలో మీటర్లు వెళ్లిపోయాడు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

2020లో ఇటలీలో ఓ విచిత్రమైన ఘటన జరిగింది. ఒక రోజు ఇంట్లో భార్యతో కాస్త గొడవ అయ్యింది. మాటా మాటా పెరిగింది. గట్టి గట్టిగా అరుచుకున్నారు. భర్తకు ఎక్కడలేని కోపం వచ్చింది. మనసులోని బాధను తగ్గించుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. మనసులో ఎవేవో ఆలోచనలు వస్తున్నాయి. నడుచుకుంటూ వెళ్తున్నాడు. రోజు రోజుకూ, అడుగు తర్వాత అడుగు.. గమ్యం తెలియని ప్రయాణం కొనసాగుతూనే ఉంది. రాత్రి లేదు. పగలు లేదు. ఆకలి లేదు. దాహం లేదు. వెళ్లిపోతూనే ఉన్నాడు. పదే పదే గొడవనే తలుచుకుంటున్నాడు. ఇంకా అడుగులు వేగంగా ముందుకు వెళ్తున్నాయి. కానీ, మనసులోని బాధ తగ్గడం లేదు.

మార్గం మధ్యలో ఆపిన పోలీసులు  

Advertisement

2020లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఫానో పట్టణంలో పోలీసులు అతడిని ఆపారు. అప్పటికే తను ఇంటి నుంచి నడక ప్రారంభించి వారం రోజులు అయ్యింది. ఎంత దూరం వచ్చానని వెనక్కి తిరిగి చూసుకుంటే, ఏకంగా 450 కిలో మీటర్లు వచ్చేసినట్లు తెలిసింది. రోజుకు సగటును 60 కి.మీలు నడిచాడు. దారిలో అతడికి ఫుడ్, వాటర్ ఎవరో ఒకరు ఇచ్చేవారు. కొన్నిసార్లు ఏమీ తినకుండానే వెళ్లిపోయేవాడు.

Read Also: ఉల్లి పెట్టిన లొల్లి.. భార్యకు విడాకులిచ్చిన భర్త, ఇంత చిన్న కారణానికే?

కరోనా రూల్స్ ఉల్లంఘించినందుకు జరిమానా

Advertisement

కరోనా సమయంలో ఇటలీలోనూ కర్ఫ్యూ విధించారు. ఆయన ఆ రూల్స్ ను అతిక్రమించి బయట తిరిగినందుకు గాను, అక్కడి పోలీసులు జరిమానా విధించారు. కానీ, అతడి గురించి తెలుసుకుని బాధపడ్డారు. పోలీసులు అతడికి సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. అతడి భార్యకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అప్పటికే ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ లో తన భర్త తప్పిపోయాడంటూ ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకుని వెంటనే ఫానోకు చేరుకుంది. వెళ్లి భర్తను హగ్ చేసుకుంది. పట్టుకుని ఏడ్చింది. తనను ఓదార్చి వెనక్కి తీసుకొచ్చింది. ఈ ఘటన అప్పట్లో ఇటలీలో సంచలనం సృష్టించింది. మనసులో బాధ ఉన్నప్పుడు మనుషులు ఎంతలా తమను తాము మర్చిపోతారో ఈ ఘటన నిరూపించిందన్నారు నిపుణులు.

Read Also: ఉల్లి పెట్టిన లొల్లి.. భార్యకు విడాకులిచ్చిన భర్త, ఇంత చిన్న కారణానికే?

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×