Raka Movie : టాలీవుడ్ స్టార్ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న భారీ ఫాంటసీ యాక్షన్ డ్రామా ‘రాకా’.. ఈ మూవీ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు చిత్ర బృందం స్పష్టత ఇచ్చింది. ఈ మూవీ గురించి రోజుకో వార్త బయటకొస్తుంది. ఇప్పటివరకు సినిమా బడ్జెట్ గురించి హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్ గురించి అనేక రకాల వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఇందులో హీరోయిన్గా నటిస్తున్న దీపిక పదుకొనే గురించి సోషల్ మీడియాలో రూమర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ గా ఉండడంతో ఈ సినిమాలో నటించబోదు అంటూ వార్తలు వినిపించాయి.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ రూమర్లకి క్లారిటీ వచ్చిందేమో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ బడ్జెట్ తో రాబోతున్న సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని, అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ పోస్టర్ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో సినిమా కూడా డిఫరెంట్ స్టోరీ తో రాబోతుంది అని బన్నీ ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు.. ఇదిలా ఉండగా.. ఈ మూవీ లో హీరోయిన్గా నటిస్తున్న దీపిక పదుకొనే గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారంలో ఉంది. దీపికా పదుకొణె గర్భవతి కావడంతో, ఆమె స్థానంలో వేరే నటిని తీసుకుంటున్నారని లేదా ఆమె పాత్ర నిడివిని తగ్గిస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే, చిత్ర యూనిట్ ఈ వార్తలను పూర్తిగా ఖండించింది.. ప్రస్తుతం ఇండస్ట్రీలో దీనిపై చర్చలు జరుగుతున్నాయి.
నిజానికి దీపికా పాత్ర ఈ సినిమాలో అత్యంత కీలకమని, ఆమె కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లలో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ.. ఆమె షూటింగ్‌లో పాల్గొంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్స్ ప్రకారమే చిత్రీకరణ సాగుతోందని, ఎటువంటి మార్పులు లేవని తెలిపారు. ఇకపోతే ఈ చిత్రం కోసం బన్నీ తన మేకోవర్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ప్రతిరోజూ లుక్ కోసం దాదాపు 3 నుంచి 4 గంటలు వెచ్చిస్తున్నారట. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో రష్మిక, జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా కనిపిస్తారనే వార్తలు ఉన్నప్పటికీ, అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే ఏడాది ఈ విజువల్ వండర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇప్పటికే దాదాపు షూటింగ్ నీ పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ కానుంది. పుష్ప మూవీతో బన్నీ లైఫ్ చేంజ్ అయ్యింది. మరి ఈ మూవీతో అతని క్రేజ్ ఏ మాత్రం పెరుగుతుందో చూడాలి.