E-Paper
Advertisement

Banakacharla Project: నల్లమలసాగర్ ప్రాజెక్టుకు మేం పూర్తి వ్యతిరేకం.. సుప్రీంతో అభిషేక్ సింఘ్వీ వాదనలు

Banakacharla Project: నల్లమలసాగర్ ప్రాజెక్టుకు మేం పూర్తి వ్యతిరేకం..  సుప్రీంతో అభిషేక్ సింఘ్వీ వాదనలు
Advertisement

పోలవరం ప్రాజెక్టు నుండి సుమారు 200 టీఎంసీల గోదావరి జలాలను బనకచర్ల/నల్లమలసాగర్‌కు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తక్షణమే అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ మళ్లింపు పూర్తిగా ఏకపక్షమని, ఇది అంతర్రాష్ట్ర జల వివాదాల ట్రిబ్యునల్ (GWDT) అవార్డుకు విరుద్ధమని స్పష్టం చేశారు.

గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటి పరిమాణం 484.5 టీఎంసీలు మాత్రమేనని.. వరద జలాల పేరుతో అదనంగా 200 టీఎంసీలను మళ్లించడం అక్రమమని సింఘ్వీ వాదించారు. ఎగువ రాష్ట్రాలైన తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అనుమతి లేకుండానే ఏపీ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా, తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల వినియోగానికి ఏపీ చర్యల వల్ల తీవ్ర విఘాతం కలుగుతుందని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు నిరుపయోగంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

కేంద్ర జల సంఘం (CWC) మార్గదర్శకాల ప్రకారం ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) సమర్పించకుండానే ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలవడం నిబంధనల ఉల్లంఘన అని సింఘ్వీ పేర్కొన్నారు. గోదావరి నదిలో అదనపు వరద జలాలు ఉన్నాయని తేల్చడానికి దేశంలో ఎటువంటి అధికారిక యంత్రాంగం లేదని, అటువంటి పరిస్థితుల్లో ఏపీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు. ఒకవేళ అదనపు జలాలు ఉన్నా.. వాటిని ఏడు బేసిన్ రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలి తప్ప ఏపీ ఒక్కటే వినియోగించుకోకూడదని వాదించారు.

జనవరి 2, 2026న కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ సమస్యల పరిష్కారానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ నివేదిక ఇచ్చే వరకు ఏపీ తన పనులను నిలిపివేసేలా స్టే ఇవ్వాలని తెలంగాణ కోరింది. నవంబర్ 21, 2025న ఏపీ జారీ చేసిన రెండో టెండర్ ప్రక్రియను కొనసాగిస్తే, అది భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని.. కాబట్టి తక్షణమే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని సింఘ్వీ తన వాదనలను ముగించారు.

Advertisement

ALSO READ: BRS: కల్వకుంట్ల కవితపై ఓ రేంజ్‌లో మండిపడ్డ బీఆర్ఎస్ మహిళా నేతలు

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×