Tollywood Industry : ఈ ఏడాది చివర నెల డిసెంబర్లో థియేటర్లలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తాయి.. ఎందుకంటే సంక్రాంతికి స్టార్ హీరోలు సినిమాలు పోటీలో ఉంటాయి కాబట్టి.. చాలా వరకు సినిమాలన్నీ డిసెంబర్లోనే థియేటర్లలోకి వచ్చేస్తాయి. గత ఏడాది కూడా చాలా సినిమాలు థియేటర్లలోకి వచ్చి మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కురిపించాయి.. అయితే గత ఏడాది డిసెంబర్ నెల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్యాడ్ టైం నడుస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..గత ఏడాది ఇదే రోజున అల్లు అర్జున్ పుష్ప 2 థియేటర్లలోకి వచ్చింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా తొక్కిసలాట జరిగింది.. ఇక ఈ ఏడాది బాలయ్య సినిమా విడుదల కాకుండా పోయింది.. అసలు ఈ డిసెంబర్ నెల శాపంగా మారిందా..? ఇక స్టార్ హీరోల సినిమాలు ఈనెలలో రిలీజ్ అవ్వడం కష్టమేనా..? సినీ పెద్దలు డిసెంబర్ సినిమాల కోసం ఏదైన నిర్ణయం తీసుకుంటారా..? ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.. డిసెంబర్ నెల గండం నుంచి గట్టెక్కాలి అంటే ఏం చెయ్యాలో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి సినిమాలకు ఎంత డిమాండ్ ఉంటుందో… డిసెంబర్లో రిలీజ్ కాబోతున్న సినిమాలకు అంతే డిమాండ్ ఉంటుంది. ఈ నెలలో రిలీజ్ అవుతున్న సినిమాలు అన్నీ కూడా మంచి టాక్ తో పాటు కలెక్షన్లు కూడా అందుకుంటాయి. అయితే రెండేళ్ల క్రితం మాట ఇది..కానీ గత ఏడాది నుంచి ఈ మాట వినిపించలేదు.. ఎందుకంటే సినిమాల విడుదల సమయంలో జరిగిన కొన్ని పరిస్థితులే అని వార్తలు వినిపిస్తున్నాయి. గతఏడాది డిసెంబర్ మొదటి వారంలో థియేటర్లలోకి అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యింది. సినిమాకు మొదటి రోజే బిగ్ షాక్ తగిలింది. పుష్ప 2 తొక్కిసలాట. దాన్ని ఇప్పటికీ అల్లు అర్జున్ ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు అలాంటివి జరిగే అవకాశాలు లేవు అని అభిమానులు అనుకొనేలోపు బాలయ్య సినిమా వాయిదా పడింది. ఈ ఏడాది బాలయ్య మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ అనూహ్యంగా ఫైనాన్స్ ఇష్యూతో వాయిదా పడింది. బాలయ్య నటించిన సినిమాలు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు.. ఇది నిజంగానే బాలయ్య ఇలాంటి స్టార్ హీరోకి అవమానం అనే చెప్పాలి.. గత ఏడాది, ఈ ఏడాది సినిమాల పరిస్థితులు చూస్తుంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి నిజంగానే డిసెంబర్ నెల శాపంగా మారిందా? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. ఈ శాపం నుంచి ఇండస్ట్రీ బయట పడుతుందా..? ఇదే కనుక కొనసాగితే ఇండస్ట్రీకి నష్టాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని జనాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై ఫిలిం ఛాంబర్ పరిష్కారం వెతుకుతుందా..? ఇక ముందు డిసెంబర్ నెలలో సినిమాలు రిలీజ్ అవ్వడం కష్టమేనా అన్నది చర్చనీయాంశంగా మారింది..
Also Read : ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. అఖండ 2 రిలీజ్ అయ్యేది అప్పుడే..?
గత ఏడాది డిసెంబర్ టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బయటకొచ్చిన అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ చిక్కుల్లో పడింది. సినిమాలు సక్సెస్ అయినా కూడా అల్లు అర్జున్ కు పోలీస్ కేసులు, కోర్టు చుట్టూ తిరిగాడు. ఒక ప్రాణం పోయింది. మరో పసిప్రాణం ప్రాణాలతో పోరాడుతుంది. హీరోకు చేదు అనుభవాన్ని మిల్చింది.. ఇప్పుడు బాలయ్య లాంటి పెద్ద హీరోకి ఘోర అవమానం జరిగింది.. ఆయన అఖండ 2 రిలీజ్ కావాల్సింది.. కొన్ని ఫైనాన్షియల్ కారణాలవల్ల సినిమా వాయిదా పడింది.. డిసెంబర్ 5 అనేది టాలీవుడ్ ఇండస్ట్రీకి శాపంగానే మారింది. ఈరోజున ఏ సినిమా రిలీజ్ అవ్వాలని అనుకున్న కూడా వాటికి ఏదో ఒక అడ్డంకు ఎదురవుతుంది.. మరి డిసెంబర్ 5 న టాలీవుడ్ ఇండస్ట్రీ బ్లాక్ డే గా అనుకుంటుందా? ఈ రోజున ఎటువంటి సినిమాలను రిలీజ్ చేయడానికి సాహసం చేయదా..? ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితులు చూస్తే ఈ డేట్ ను బ్లాక్ చేస్తేనే బెటర్ అనే వార్తలు జనాల నుంచి వినిపిస్తున్నాయి. మరి దీనిపై ఇండస్ట్రీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి..