Ind vs SA 3rd ODI: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 3rd ODI) మధ్య చిట్టచివరి వన్డేకు కౌంట్ డౌన్ షురూ అయింది. రేపటి రోజున ఈ రెండు జట్ల మధ్య చివరి వన్డే జరగనుంది. విశాఖ వేదికగా జరగనున్న ఈ వన్డే మ్యాచ్ నేపథ్యంలో ఇప్పటికే టీమిండియా తో పాటు దక్షిణాఫ్రికా జట్లు వైజాగ్ చేరిపోయాయి. వైజాగ్ వచ్చిన రెండు జట్లకు కూటమి ప్రభుత్వం గ్రాండ్ వెల్కమ్ చెప్పింది.
Also Read: Grace Hayden: నగ్నంగా తిరుగుతానంటూ బోల్డ్ కామెంట్స్..చివరి క్షణంలో కాపాడిన రూట్
టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రేపటి రోజున అంటే డిసెంబర్ 6వ తేదీన మూడవ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య రెండు వన్డేలు పూర్తయ్యాయి. ఇందులో మొదటి మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టగా, రెండవ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా అదిరిపోయే విజయాన్ని దక్కించుకుంది. ఇక విశాఖ వేదికగా రెండు జట్లకు డూ ఆర్ డై మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు ట్రోఫీ ఎగిరేసుకు వెళ్లనుంది. దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు విశాఖలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ( Dr. Y.S. Rajasekhara Reddy ACA-VDCA Cricket Stadium, Visakhapatnam) మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ టాస్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటిగంటకు ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 3rd ODI) మధ్య జరుగనున్న చిట్ట చివరి వన్డే జియో హాట్ స్టార్ లో తిలకించవచ్చును. అలాగే స్టార్ స్పోర్ట్స్ లో చూడవచ్చును. జియో హాట్ స్టార్ ( Jio Hot star) సబ్ స్ట్రిప్షన్ చేసుకున్న వాళ్లు మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. లేకపోతే చూడలేరు. కాబట్టి రీచార్జ్ చేసుకోవాల్సిందే.
దక్షిణాఫ్రికా తో జరగబోయే మూడవ వన్డేలో కీలక మార్పులతో టీమిండియా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. మూడవ వన్డేలో వాషింగ్టన్ సుందర్ పైన వెయిట్ వేసేందుకు గౌతమ్ గంభీర్ నిర్ణయం తీసుకున్నాడట. అతని తొలగించి తిలక్ వర్మాను జట్టులోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. విశాఖ వేదికలో ఆడిన అనుభవం తిలక్ వర్మకు ఉంటుంది. అందుకే అతని జట్టులోకి తీసుకునేందుకు ప్లాన్ వేసింది టీమిండియా యాజమాన్యం. ఇక సుందర్ మినహా మిగిలిన ప్లేయర్ లందరూ కొనసాగరున్నారు.
Also Read: IPL 2026: వీడు అంత మొనగాడా..ఒక్క మ్యాచ్ కు రూ.50 ఇవ్వాలట, 4 మ్యాచ్ లే ఆడతాడట !
1. రోహిత్ శర్మ
2. యశస్వి జైస్వాల్
3. విరాట్ కోహ్లీ
4. రుతురాజ్ గైక్వాడ్
5. తిలక్ వర్మ
6. Kl రాహుల్ (C) (WK)
7. రవీంద్ర జడేజా
8. కుల్దీప్ యాదవ్
9. హర్షిత్ రాణా
10. అర్ష్దీప్ సింగ్
11. ప్రసిద్ధ్ కృష్ణ