E-Paper
Advertisement

HBD Rajinikanth : రజినీకాంత్ అంటే స్వాగ్ స్టైలే కాదు, అవార్డులు ఆలయాలు కూడా

HBD Rajinikanth : రజినీకాంత్ అంటే స్వాగ్ స్టైలే కాదు, అవార్డులు ఆలయాలు కూడా
Advertisement

HBD Rajinikanth : ఈ ప్రపంచంలో దేవుడు కొందరికి కొన్ని మాత్రమే ఇస్తాడు. అవి కేవలం వాళ్లకు మాత్రమే సెట్ అవుతాయి. వాటిని ఇమిటేట్ చేయడానికి ట్రై చేసినా కూడా సరిగ్గా పట్టుకోలేము. అలా కొంతమంది అరుదైన వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నాడు. ఎస్పీ బాలసుబ్రమణ్యం కేవలం పాట కోసమే పుట్టినట్లు, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి సాహిత్య రచయితలు పాటలు రాయడం కోసమే పుట్టినట్లు. కొంతమంది స్టార్లు ప్రేక్షకులను అలరించడానికి పుడుతుంటారు.

పుట్టగానే స్టార్లు కాకపోవచ్చు, ఏవేవో పనులతో తమ జీవితాలను కొనసాగించవచ్చు. కానీ ఎవరు ఊహించని విధంగా జీవితంలో ఒక మలుపు వస్తుంది. ఆ మలుపు ఆ వ్యక్తిని ఎంత దూరం తీసుకుపోవాలో నిర్ణయిస్తుంది. బస్ కండక్టర్ గా ఉన్న రజినీకాంత్ ఈ రోజు ఇండియన్ సినిమాకే ఐకాన్ అయ్యారు. ఐదు దశాబ్దాలుగా సౌత్ ఇండియా ప్రేక్షకులను అలరిస్తున్నారు.

స్వాగ్ & స్టైల్ 

Advertisement

రజనీకాంత్ అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేది తన స్వాగ్ అండ్ స్టైల్. ముఖ్యంగా సిగరెట్ గాలిలో విసిరి నోటితో పట్టుకునే స్టైల్ అతనికి మాత్రమే చెల్లింది. అలానే సన్ గ్లాసెస్ ఫ్లిప్ చేయడం అనేది అతని సిగ్నేచర్ మూమెంట్. తన వాకింగ్ స్టైల్ , పంచ్ డెలివరీ ఇవన్నీ కూడా ఒక యూనిక్. అవి వెండి తెరమీద చూస్తుంటే ఆడియన్ కి రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

అవార్డులు – ఆలయాలు 

రజినీకాంత్ అనగానే అందరికీ గుర్తొచ్చేది కేవలం స్లోమోషన్, స్టైల్, స్వాగ్ మాత్రమే కానీ తలైవార్ సాధించిన అచీవ్మెంట్స్ పెద్దగా వినిపించవు. కోలీవుడ్ బాక్సాఫీస్ కు 25 కోట్లనుంచి ఎనిమిది వందల కోట్లు వరకు బాక్సాఫీస్ కలెక్షన్స్ పరిచయం చేసింది రజినీకాంత్. ఇండియాలోనే హైయెస్ట్ ఫ్యాన్ క్లబ్స్ ఉన్న ఏకైక స్టార్ హీరో. దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్ హోల్డర్, చాలామందిని ప్రభావితం చేసి నటుడు. ఇలా రజనీకాంత్ గురించి చెప్పుకుంటూ పోతే ఎంతో కొంత మిగిలే ఉంటుంది.

Advertisement

కేవలం ఇండియాలో తనను ఆదరించడం మాత్రమే కాకుండా జపాన్ లో కూడా సూపర్ స్టార్ కి ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జపాన్ లో ముత్తు సినిమా తర్వాత విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తలైవర్ కు వచ్చింది. జపాన్ లో కొన్నిచోట్ల అతనికి ఆలయాలు కూడా ఉన్నాయి అనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి.

ఏదేమైనా ఐదు దశాబ్దాలుగా సౌత్ ఇండియా ప్రేక్షకులను తమ సినిమాలతో ఉత్తేజపరుస్తూ, తన నిజ జీవిత వ్యక్తిత్వంతో ఆదర్శవంతంగా నిలుస్తూ ఎంతో మందిని కెరియర్ లో ముందుకు నడిపిస్తున్న శక్తి తలైవర్ రజినీకాంత్. నేడు పుట్టినరోజు సందర్భంగా రజనీకాంత్ పడేయప్ప సినిమా కూడా విడుదలవుతుంది. ఇంక ముందు ముందు కూడా తన కెరీర్లో అద్భుతమైన సక్సెస్ఫుల్ సినిమాలు చేయాలి అని కోరుకుంటూ బిగ్ టీవీ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

Also Read: Bigg Boss 9 Telugu : మీరు అందరిని వాడుకున్నారు, తనుజకు దిమ్మతిరిగే కౌంటర్స్ ఇచ్చిన ఆడియన్

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×