Akhanda 2 Movie Review : ఇప్పటి వరకు బాలయ్య – బోయపాటి కాంబోలో వచ్చిన ఏ ఒక్క మూవీ కూడా నిరాశపర్చలేదు. అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత.. దానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రమిది. కాబట్టి దీనిపై అంచనాలు హై రేంజ్‌లో ఉన్నాయి. దీనికి తోడు ఈ ఫైనాన్స్ ఇష్యూ వల్ల వాయిదా పడటం వల్ల కూడా ఈ సినిమాపై కాస్త సింపథి వచ్చింది. అలాంటి అఖండ 2 నేడు థియేటర్స్‌లోకి వచ్చింది. ఎలా ఉందో ఈ రివ్వ్యూలో చూద్దాం.
గతంలో వచ్చిన అఖండ మూవీకి ఇది సీక్వెల్. బాలమురళి కృష్ణ (బాలకృష్ణ) ఎమ్మెల్యే అవుతాడు. అతని కూతురు జనని (హర్షాలి మల్హోత్రా) 17 ఏళ్లకే DRDOలో ఉద్యోగం చేస్తుంది. అఖండ రుద్ర సికందర్ అఘోర (బాలకృష్ణ) మరింత పవర్‌ఫుల్ అఘోరగా మారుతాడు. ఇదే టైంలో మహా కుంభమేళలో ఒక వైరస్‌ను వదులుతాడు చైనాకు చెందిన ఓ జనరల్. దీనికి యాంటీడోట్‌ను జనని కనిపెడుతుంది. ఆ యాంటీడోట్‌ను ప్రభుత్వానికి అందకుండా అడ్డగిస్తారు. జనని చంపాలని చూస్తారు. జననిని అఖండ ఎలా కాపాడుతాడు? యాంటీడోట్ ప్రజలకు అందుతుందా? చైన జనరల్‌పై అఖండ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది మిగితా స్టోరీ.
బోయపాటి శ్రీను సినిమాలంటే… చిన్నప్పుడు మనం చదువుకున్న గురుత్వాకర్షణ శక్తి, న్యూట్రన్ నియమాలు, ఇంకా మిగితా ఫిజిక్స్ అన్నింటినీ పక్కన పెట్టి చూడాలి. అప్పుడే కాస్తో కూస్తో సినిమాను అర్థం చేసుకుంటాం. చూస్తాం. ఎప్పటిలానే.. ఈ అఖండ 2 లో కూడా అంతే జరిగింది. కొత్త బోయపాటిని చూడలేం. కొత్త బాలయ్యనూ చూడలేం.
యాంటీడోట్ ప్రజల వద్దకు చేర్చడం అనే చిన్న పాయింట్‌ను పట్టుకుని బోయపాటి 02:45 గంటల సినిమా చేశాడు. ఆ లాగడం థియేటర్ స్క్రీన్‌పై కనిపిస్తది.
అఖండ 2 సినిమాను అందరూ అఘోర పాత్ర కోసమే చూస్తారు. కానీ, ఆ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉండటం మైనస్‌గా కనిపిస్తుంది. పాత్ర లేట్ వచ్చినా.. సెకండాఫ్ మొత్తం డల్ ఫీల్‌తోనే నడుస్తుంది. అభిమాన హీరో వచ్చి స్క్రీన్‌పై తాండవం చేస్తున్నా.. అసలేం అనిపించదు.
ఫస్టాఫ్‌లో పాత్రల ఇంట్రడక్షన్‌కే దాదాపు 40 నిమిషాలు తీసుకున్నాడు. అది కాస్త టైం ఎక్కువే అయినా… పెద్దగా ఏం ఎఫెక్ట్ చూపించలేదు. అలాగే బాలమురళి కృష్ణ పాత్రతో ఓ ఫైట్ పర్లేదు. ఇక ఇంటర్వెల్ అందరికీ పూనకాలు. అదే ఊపు సెకండాఫ్ కంటీన్యూ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేసిన వాళ్లకు డైరెక్టర్ నిరాశే మిగిల్చాడు. స్లో నారేషన్‌తో కొంత వరకు చిరాకు పెట్టిస్తాడు.
యాంటీడోట్ తయారు చేసిన పర్పస్ వేరు. కానీ, దాన్ని వాడే పర్పస్ వేరు. ఆ విషయంలో ఆడియన్ కన్ఫ్యూజ్ అవుతాడు. ఇలా కథలో చాలా లాజిక్స్ మిస్ అయ్యాయి. బాలయ్య తాండవం చేస్తే చాలు. సినిమా హిట్ అయిపోతుంది అనే ఫీల్‌లో ఈ సినిమా చేసినట్టు అనిపిస్తుంది. నిజానికి ఈ సినిమాలో బాలయ్య హీరో కాకపోయి ఉంటే.. ఇంతలా ఉండేది కాదు అనేది స్పష్టంగా చెప్పొచ్చు. అయితే, కేవలం బాలయ్యనే ఎంత టైం వరకు చూస్తారు. కథ కూడా కావాలి కదా.
ఈ కథ, కథనం గురించి పక్కన పెడితే… అఖండ పాత్ర వచ్చిన ప్రతి సారి మ్యూజిక్ డైరెక్టర్ కొట్టిన కొట్టుడు కొన్ని సార్లు ఏంట్రా ఇది అనేలా ఉంది. కొన్ని సార్లు సినిమాను, ఆ సన్నివేశాన్ని ఒక్కసారిగా లేపినట్టు అనిపిస్తుంది. కెమెరా పర్లేదు కానీ, VFX వర్క్ మాత్రం చాలా సందర్భాల్లో తేలిపోయింది. ఎడిటింగ్‌కి చాాలా పని ఉంది.
ఇక ఫర్ఫామెన్స్ గురించి అంటే.. బాలయ్య ఎప్పటిలానే చేశాడు. కొన్ని సీన్స్ చూస్తే అఖండ చూసినట్టే ఉంది. అదే డైలాగ్ డేలవరీ.. నిజానికి చెప్పాలంటే.. ఆ డైలాగ్సే మళ్లీ చెప్పినట్టు ఉంది. అది డైరెక్టర్ చూసుకోవాల్సిన అంశం. అయితే బాలయ్య రెండు పాత్రల్లో తనదైన ముద్ర వేశాడు. సంయుక్తను జాజి కాయ సాంగ్ కోసమే తీసుకున్నట్టు ఉన్నారు. ఆది పినిశెట్టి చాలా పవర్ ఫుల్‌గా చూపించి.. సిల్లిగా చంపేశారు. తన నటన కనిపించినా.. అతను పెద్దగా కనిపించలేదు స్క్రీన్‌పై.
బాలయ్య నటన
ఇంటర్వెల్
డైలాగ్స్
మ్యూజిక్
కథ
లాజిక్స్ మిస్
VFX
పాటలు లేకపోవడం
మొత్తానికి… బాలకృష్ణ తాండవం ఫర్ ఓన్లీ ఫ్యాన్స్