Odyssey Facts: ఒక సినిమా థియేటర్ లలోకి వచ్చాక అందరు మెచ్చుకునేది కనిపించే నటీ నటులనే.ఇక కాస్త సినిమా నాలెడ్జ్ ఉన్నవారే మెయిన్ టెక్నీషియన్స్ ఎవరా అరా తీసి ప్రశంసిస్తుంటారు.కానీ ఆ సినిమా వెనకాల జరిగిన సంగతులేంతో ఎవరికీ పెద్దగా తెలీవు. ఇక తాజాగా జులై 17న వచ్చిన ఒడిస్సీ సినిమా కూడా వేల కోట్లు కొల్లగొట్టడంతో అంతా తీసిన నోలన్ ని ,కనిపించిన మ్యాట్ డేమన్,టామ్ హాలండ్, యాన్ హాతవే, జెండయా, రాబర్ట్ ప్యాటిన్సన్ లని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.కానీ ఈ సినిమా ఇంతలా బాగా తెరకెక్కడానికి తెర వెనుక ఎన్నో ఆసక్తి కరమైన సంఘటనలు జరిగాయని మీకు తెలుసా ?లేకపోతె తెలుసుకుందాం రండి !
ఏకంగా 20 లక్షల అడుగులకు పైగా
ఈ సినిమా కోసం నోలన్ ఎక్కడో ఒక లొకేషన్ లోనే చుట్టేయకుండా గ్రీస్, ఇటలీ, మొరాకో, స్కాట్లాండ్, ఐస్‌లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్ అంటూ ఆరు దేశాలను చుట్టేసింది.. నోలన్‌కు కంప్యూటర్ గ్రాఫిక్స్ (CGI) కంటే రియల్ లొకేషన్లు అంటేనే ప్రాణం. అందుకే పెద్ద పెద్ద సముద్రపు అలైలు, రాక్షస గుహలు, ప్రాచీన కోటలు, చివరికి ఆ భారీ ట్రోజన్ గుర్రం సీన్ కూడా గ్రాఫిక్స్ వాడకుండా నిజమైన వాటర్ ట్యాంకులు, రియల్ సెట్లతోనే ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ ద్వారా తీశారు. ఈ సినిమా కోసం ఏకంగా 20 లక్షల అడుగులకు పైగా IMAX ఫిల్మ్ వాడారు!ఇంత భారీ సినిమా షూటింగ్‌ను నోలన్ కేవలం 91 రోజుల్లోనే పూర్తి చేయడం ఒక రికార్డ్ అని చెప్పాలి.
ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, చివరికి మోడర్న్ షూస్ కూడా బ్యాన్
అంతేకాదు, షూటింగ్ టైమ్‌లో నోలన్ పెట్టిన రూల్స్ వింటే షాక్ అవుతారు! ఆనాటి పాతకాలపు ఫీల్ దెబ్బతినకూడదని సెట్‌లోకి ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, చివరికి మోడర్న్ షూస్‌ను కూడా అనుమతించలేదట. ఇక ‘ఒపెన్‌హైమర్’ సినిమాకు ఆస్కార్ సాధించిన మ్యూజిక్ డైరెక్టర్ లుడ్విగ్ గోరాన్సన్ ఈ సినిమాకు ప్రాచీన గ్రీకు వాద్యాలతో మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించడం మరో విశేషం.
టాప్ స్టార్స్ రెమ్యూనరేషన్ల కోసమే బడ్జెట్‌లో సగానికి పైగా
ఇక మేకర్స్ ఏకంగా 250 మిలియన్ డాలర్లు పైగా అంటే మన కరెన్సీ లో2,100 కోట్లకు పైగా ఖర్చు పెట్టారట.అందులో ముఖ్యంగా ఒడిస్సియస్ పాత్రలో అదరగొట్టిన మ్యాట్ డేమన్ తో పాటు టామ్ హాలండ్, యాన్ హాతవే, జెండయా, రాబర్ట్ ప్యాటిన్సన్, లుపిటా న్యోంగో, చార్లీజ్ థెరాన్ లాంటి హాలీవుడ్ టాప్ స్టార్స్ రెమ్యూనరేషన్ల కోసమే బడ్జెట్‌లో సగానికి పైగా ఖర్చు చేశారంటే నటీనటులకి ఎంత పెద్ద పీట వేశారో అర్థం అవుతుంది.
also read :ఏంటీ..ఒడిస్సీ కి ఇండియాలో వంద కోట్లా ?
వీరిలో హీరో మ్యాట్ డేమన్‌కు సుమారు 270కోట్లతో పాటు ప్రాఫిట్స్ లో వాటా ఇవ్వగా, ఆయన కొడుకుగా నటించిన టామ్ హాలండ్‌కు ఏకంగా 130కోట్లని సమర్పించారట మేకర్స్. ఇక ఈ నోలన్ ప్రాజెక్ట్ కోసం టామ్ హాలండ్ ఏకంగా తన ‘స్పైడర్ మ్యాన్.. బ్రాండ్ న్యూ డే’ షూటింగ్‌ను కూడా వాయిదా వేసుకుని డేట్స్ అడ్జస్ట్ చేసుకోవడం ఇక్కడ చెప్పుకోతగ్గ విషయం.
IMAX 70mm ఫిల్మ్ కెమెరాతో ఫస్ట్ టైమ్
టెక్నాలజీ పరంగానూ ఈ సినిమా సరికొత్త చరిత్ర సృష్టించిందనే చెప్పాలి.అవును ..మాములుగా ఐమాక్స్ కెమెరాల శబ్దం వల్ల నటీనటుల డైలాగ్స్ సరిగ్గా రికార్డ్ కావు, అందుకే కేవలం యాక్షన్ సీన్లకే వాడతారు. కానీ ఈ సినిమా కోసం ఫస్ట్ టైమ్… మొత్తం సినిమా అంతటినీ IMAX 70mm ఫిల్మ్ కెమెరాలతోనే షూట్ చేశారట నోలన్. దీని కోసమే IMAX కంపెనీ ప్రత్యేకంగా శబ్దం తక్కువగా వచ్చేలా ఒక కొత్త కెమెరా సిస్టమ్‌నే తయారు చేసిందట మరి.ఇక అద్దాల సెటప్‌తో నటీనటుల ఐ-కాంటాక్ట్ మిస్ అవ్వకుండా కొత్త టెక్నిక్ వాడాడట నోలన్.
కథ విషయానికి వస్తే
ఈ సినిమా కథ విషయానికి వస్తే, దాదాపు మూడు వేల ఏళ్ల క్రితం ప్రాచీన గ్రీకు మహాకవి హోమర్ రాసిన ‘ఒడిస్సీ’ అనే ఐతిహాస కావ్యాన్ని బేస్ చేసుకొని తెరకెక్కించాడు నోలన్. ప్రపంచ ప్రసిద్ధ ట్రోజన్ యుద్ధం ముగిసాక, ఒడిస్సియస్ అనే రాజు తన సొంత రాజ్యాంబడిన ఇథాకాకు చేరుకోవడానికి చేసిన పదేళ్ల భయంకరమైన సముద్ర ప్రయాణమే ఈ కథ.
ఇక ఈ జులై 17న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించిన సునామీ మామూలుగా లేదు. మొదటి వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 264 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,200 కోట్లు) కొల్లగొట్టి రికార్డులు తిరగరాసింది. మన ఇండియాలో కూడా బెంగళూరు, ముంబై, హైదరాబాద్ లాంటి సిటీల్లో ఐమాక్స్ టికెట్ల రేటు రూ. 2,000 నుంచి రూ. 3,000 ఉన్నప్పటికీ నిమిషాల వ్యవధిలోనే షోలన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయంటే నోలన్ సినిమాలకి ఎంత క్రేజ్ ఉందొ అర్థమవుతుంది.ఇక ఈ సినిమా ఇండియాలో ఏకంగా వంద కోట్లు దాటిందని చెప్పక్కర్లేదు .
నోలన్ ని మెచ్చుకొని తీరాల్సిందే !
ఏది ఏమైనా ఈ సినిమాను కేవలం ఒక అడ్వెంచర్ మూవీలా కాకుండా, ఒక మనిషి తన ఇంటికి చేరుకోవడానికి పడే తపన, కుటుంబ బంధాలు, మానవ సహనానికి ప్రతీకగా ఒక ఎమోషనల్ మైథలాజికల్ వండర్‌గా తీర్చిదిద్దిన నోలన్ ని మెచ్చుకొని తీరాల్సిందే !