Odyssey Collections: ‘ది ఒడిస్సీ’…నోలన్ మావ ఏ ముహూర్తాన ఆ గ్రీకు కథని పట్టుకుని సినిమా తీశాడో గానీ వరల్డ్ వైడ్ గా మాస్ రాంపేజ్ చేస్తుంది.అక్కడే కాదండోయ్ ..మన ఇండియాలో కూడా నన్నెవరూ ఆపలేరు అంటూ దూసుకుపోతుంది.ఇక జులై 17న థియేటర్లలోకి వచ్చిన ఈ హాలీవుడ్ బొమ్మకి ఏకంగా వంద కోట్ల మార్కుకి దగ్గరలో ఉందన్న టాక్ వినిపిస్తుండటంతో ఇక్కడి సినిమాలకే కలెక్షన్స్ దిక్కు లేవు, అలాంటిది హాలీవుడ్ సినిమాకి అన్నేసి కోట్లు ఎలా సమర్పించారో అంటూ నోరెళ్ళ బెట్టేస్తున్నారట ఇక్కడి మేకర్స్.
మొదటి రోజే రూ.17 కోట్ల నెట్
అవును..ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి ఇప్పటికే 2600 కోట్లు రాగా ఇండియాలోనూ ఊహించని వసూళ్లు కొల్లగొట్టి మన మేకర్స్ కి చెమటలు పట్టిస్తుంది.మొదటి రోజే రూ.17 కోట్ల నెట్ రాబట్టిన ఈ సినిమా, డే-2 రూ.22 కోట్లు, డే-3 రూ.22 కోట్లు లాగేసి ఫస్ట్ వీకెండ్‌కే రూ.57 కోట్ల నెట్ రాబట్టి సత్తా చాటింది. ఇక 4వ రోజు రూ.8 కోట్లు, 5వ రోజు మరో రూ.9 కోట్లు కొల్లగొట్టిన సినిమా ఐదు రోజుల్లోనే రూ.78 కోట్ల నెట్ (రూ.93 కోట్ల గ్రాస్) వసూలు చేయగా 6వ రోజు మరో రూ.6 కోట్లు వసూలు చేసి దాదాపు రూ.99 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిందని వినిపిస్తుంది.అంటే వంద కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో ఉందన్న మాట.
also read :“నా గురువే నా రైడర్”.. కీరవాణితో రాహుల్ సిప్లిగంజ్ ‘ఫుల్ సర్కిల్’ మోమెంట్!
ఏకంగా 14 కోట్ల గ్రాస్
ఇక వీటిలో మన తెలుగు వారి వాటాగా ఒకటో రెండు కాదండోయ్…ఏకంగా 14 కోట్ల గ్రాస్ సమర్పించారట.అసలు పెద్ద పెద్ద సినిమాలకే డ్యాన్సులు చేసి, ఊరూరా తిరిగి ప్రమోషన్లు చేస్తే కానీ థియేటర్ల వైపు చూడని జనాలు ఈ సినిమాకి ఆ రేంజ్ లో పరుగులు పెట్టారంటే నోలన్ సినిమాలకున్న క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. ‘ఇంటర్‌స్టెల్లార్’ (7 నవంబర్ 2014) నాటి నుంచీ ‘టెనెట్’ (4 డిసెంబర్ 2020) దాకా నడిచిన సీన్ ఇపుడు మళ్ళీ రిపీట్ అయిందన్న మాట.
మేకర్స్ కి నిద్రలేని రాత్రులని మిగులుస్తుందా !
ఇక సినిమా విషయానికి వస్తే యూనివర్సల్ పిక్చర్స్ బ్యానర్‌పై రూ.2650 కోట్ల భారీ బడ్జెట్‌తో, 70 ఎంఎం ఐమాక్స్ కెమెరాతో నిర్మించిన ఈ సినిమా ఈతాకా గ్రీక్ రాజు యొక్క కథ అన్న సంగతి తెల్సిందే. ఇక ఈ సినిమాలో మాట్ డామన్,అన్నె హత్‌వే మెయిన్ లీడ్ గా చేయగా హోయతే వాన్ హోయ్‌తేమ సినిమాటోగ్రఫీని , లడ్‌విగ్ గోరాన్సన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.
చూడాలి మరి కేవలం వంద దగ్గరే ఆగుతుందా..లేక ఇంకా మరిన్ని కోట్లు కొల్లగొట్టి ఇండియన్ మేకర్స్ కి నిద్రలేని రాత్రులని మిగులుస్తుందా !
also read :బాలయ్య బాబు హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. క్లారిటీ వచ్చేసింది!