Tollywood:జబర్దస్త్ కామెడీ షో ద్వారా తమకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్న ఎంతో మంది కమెడియన్స్ సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయారు. కొంతమంది దర్శకులుగా మారితే. మరి కొంతమంది కమెడియన్లుగా సెటిల్ అవుతున్నారు. ఇంకొంతమంది హీరోలుగా చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ప్రముఖ కమెడియన్.. తన సినిమా ఫ్లాప్ అయితే ఏకంగా గుండు కొట్టించుకుంటాను అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు.
ఆయన ఎవరో కాదు అదిరే అభి.. ఒకప్పుడు జబర్దస్త్ లో తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా.. ఆది లాంటి ఎంతోమంది కమెడియన్స్ ను ఈ షో కి పరిచయం చేశారు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన అభి.. ఒకవైపు ఐటీ ఉద్యోగం చేస్తూనే.. మరొకవైపు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేశారు. ఇక ఆ తర్వాత దర్శకుడిగా మారారు అభి. ఇదివరకే దర్శకుడిగా చిరంజీవ అనే సినిమాతో రాగా.. ఇప్పుడు కర్మాఖ్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు..కామాఖ్య అనే టైటిల్ తో ఇన్ని రోజులు ప్రచారం చేసి ఇప్పుడు సడన్గా కర్మాఖ్య అనే టైటిల్ తో జూలై 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక నేడు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా.. ఇందులో అభి చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
also read:అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ.. ఒక్కమాటతో క్లారిటీ ఇచ్చిన మేనేజర్!
ఈ నేపథ్యంలోనే అదిరే అభి మాట్లాడుతూ.. “తాజాగా విడుదల చేసిన ట్రైలర్ మీ అంచనాలను అందుకుంది అనుకుంటున్నాను. ముందు ఈ సినిమాకి కామాఖ్య అనే టైటిల్ అనుకున్నాము. ప్రమోషన్స్ కూడా చేశాం.. కానీ కొన్ని కారణాల వల్ల టైటిల్ మార్చాల్సి వచ్చింది. అందుకే మళ్ళీ ప్రమోషన్స్ మొదటికి వచ్చినట్టు అనిపిస్తోంది. మేము కర్మాఖ్య అనే టైటిల్ తో వస్తున్నాము.. కర్మాఖ్య అంటే దీని అర్థం “మనం చేస్తున్న కర్మలే మన గుర్తింపు” అని.. ఈ సినిమా అమ్మవారి ఎలిమెంట్ ఉన్న ఒక క్రైమ్ థ్రిల్లర్.. థియేటర్లలో సినిమా చూస్తే ఖచ్చితంగా మీరు థ్రిల్ కి గురవుతారు. గుండె మీద చేయి వేసుకొని ధైర్యంగా చెబుతున్నాను. ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ టాక్ వస్తే కనుక.. నేను గుండు కొట్టించుకుంటాను..
ఇది నా ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెప్పట్లేదు. నా సబ్జెక్టు, నా కష్టం మీద ఉన్న నమ్మకంతో చెబుతున్నాను.. నిజంగా సినిమా బాగోలేకపోతే నాకు నేను ఇచ్చుకునే పనిష్మెంట్ అది.. ఈ సినిమా హిట్ అయితే సినిమా కోసం పనిచేసిన వాళ్లందరికీ కూడా క్రెడిట్ ఇస్తాను. ఒకవేళ సినిమా పోతే ఆ క్రెడిట్ మొత్తం నేనే తీసుకుంటాను” అంటూ అదిరే అభి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం అభి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏదేమైనా ఇంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే కచ్చితంగా సినిమా హిట్ అవుతుంది అంటూ ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు.