E-Paper
Advertisement

Mouth Ulcer: నోటి పుండ్లు మహిళల్లోనే ఎందుకు ఎక్కువగా వస్తాయి? హార్మోన్లు, ఒత్తిడి, పోషకాహార లోపమే కారణమా?

Mouth Ulcer: నోటి పుండ్లు మహిళల్లోనే ఎందుకు ఎక్కువగా వస్తాయి? హార్మోన్లు, ఒత్తిడి, పోషకాహార లోపమే కారణమా?
Advertisement

Mouth Ulcer: పురుషుల్లో కంటే మహిళల్లో అధికంగా కనిపించే సమస్య నోటి పుండ్లు(మౌత్ అల్సర్). దీనికి ప్రధాన కారణం ఒత్తిడి, నిద్రలేమి, విటమిన్ లోపంతోపాటు నెలసరి సమయంలో హార్మోన్లలో జరిగే మార్పులు. కారణం ఏదైనా కావొచ్చు గానీ ఈ నోటి అల్సర్లతో తీవ్రమైన నొప్పితోపాటు నీరు తాగడానికి కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్యను తగ్గించుకోవడానికి చాలామంది అల్లోపతి మందులను వాడుతుంటారు. ఇక ఆ మందులతో అవసరం లేకుండా.. మన వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలతో నోటి పుండ్లకు పరిష్కారం కనుగొనవచ్చు.

⇒ మహిళలు తరచూ ఎదుర్కొంటున్న నోటి అల్సర్లను తగ్గించడంలో తేనె సమర్థవంతంగా పనిచేస్తుంది. తేనెలో యాంటీ మైక్రోబియల్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. దీంతో అల్సర్లను కలిగించే బ్యాక్టీరియాను ఇవి నిర్మూలించడంలో కీలకంగా పనిచేస్తాయి.

Advertisement

Also Read: రోజంతా శరీరం ఉత్సాహంగా ఉండాలంటే.. నిద్రలేవగానే ఈ ఒక్క పనిచేస్తే చాలు!

⇒ నాలుక కింద లేదా దవడల దగ్గర నోటి పుండ్లు అధికంగా ఉన్నప్పుడు.. తరచూ తేనె రాస్తుండాలి. దీంతో కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే తేనెకు చిటికెడు పసుపు కలిపితే.. మరింత త్వరగా ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది.

Advertisement

⇒ అలాగే అల్సర్లను తగ్గించే శక్తి లవంగాలకు ఉన్నాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. దీని కోసం లవంగాలను నమిలినా లేదా పుండ్లు ఉన్న చోట లవంగాల నూనెను రాసినా.. నోటి అల్సర్లు తగ్గుతాయని అంటున్నారు.

⇒ యాంటి ఇన్‌ఫ్లమేటరీ, యాంటి బ్యాక్టీరియల్‌, యాంటిఆక్సిడెంట్‌తోపాటు ఇమ్యునో మాడ్యులేటరీ లక్షణాలు కలిగి ఉన్న తులసి ఆకులు.. నోటి అల్సర్లకు చాలా త్వరగా పరిష్కారాన్ని చూపెడుతాయి. ఇవి అలర్జీలతోపాటు వివిధ నోటి రుగ్మతలను తగ్గించడంలోనూ ముందుంటాయి. దీని కోసం రోజుకు నాలుగు తులసి ఆకులను నమలడం నోటి ఆరోగ్యానికి మంచిది.

⇒ నోటి పుండ్లు ఉన్న చోట కొద్దిగా కొబ్బరినూనె రాసినా.. మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. లేదా ఎండుకొబ్బరి ముక్కలను నమిలినా అల్సర్లు తగ్గుముఖం పడుతాయట. ఒకవేళ నోటి అల్సర్లు ఎక్కువగా బాధిస్తే.. కొబ్బరినీళ్లు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. దీనివల్ల శరీరంలో వేడి తగ్గడమే కాకుండా.. అల్సర్లు కూడా తగ్గుతాయి.

Also Read: కివీ పండు తొక్కలో ఇంత ఆరోగ్యం దాగుందా? వామ్మో.. ఈ విషయం తెలియక ఇన్నిరోజులూ పడేశాం కదరా!

 

 

 

 

 

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×