The Raja Saab: ఇటీవల ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ సినిమా ది రాజా సాబ్.. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. హారర్–కామెడీ జానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్నాడు.
ఇదిలా ఉండగా.. జర్మనీ, స్వీడన్ దేశాల్లో ..రాజా సాబ్.. విడుదలపై ఇటీవల కొంత గందరగోళం నెలకొంది. ముఖ్యంగా కొద్ది రోజుల కింద వరకు ఈ సినిమా నిర్మాత.. విశ్వప్రసాద్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కొంతమందిని చీట్ చేశారు అన్న వార్తలు తెగ వినిపించాయి. ఆ వార్తల్లో అసలు నిజం ఉందా లేదా అనుకుంటున్న తరుణంలో..దీనిపై తారకరామ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ముందుగా.. తమ సంస్థ మంచి నమ్మకంతో..సరైన ఒప్పందాలు.. చెల్లింపులతో ఈ సినిమాను యూరప్‌లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు.. థియేటర్ బుకింగ్స్, ప్రమోషన్లు కూడా పూర్తి చేసిన తర్వాత..అనూహ్యంగా సినిమా హక్కులు మరో పార్టీకి కేటాయించారని తెలిసినట్లు పేర్కొంది.
ఈ పరిణామంతో తమకు ఆర్థిక నష్టం.. మానసిక ఒత్తిడి ఎదురైనట్టు తారకరామ ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలిపింది. ఈ కారణాలతో జర్మనీ, స్వీడన్‌లలో రాజా సాబ్ పంపిణీ నుంచి తాము తప్పుకుంటున్నట్లు… అక్కడి తెలుగు ప్రేక్షకులకు ఈ విషయం నిరాశ కలిగించినా.. తాను ఏమీ చేయలేమని.. కాబట్టి అభిమానులకు సంస్థ క్షమాపణలు కూడా తెలియజేస్తోంది అని చెప్పుకొచ్చింది.
” ఈ అనూహ్య పరిణామం వల్ల మా బృందానికి భారీ ఆర్థిక నష్టం..నిర్వహణ సంబంధిత ఆటంకాలు.. మానసిక ఒత్తిడి ఎదురయ్యాయి. ముఖ్యంగా యూరోప్‌లోని తెలుగు సినీ అభిమానులకు గౌరవప్రదమైన విడుదల అందించాలనే.. ఉద్దేశంతో మేము చేసిన నిజమైన ప్రయత్నాల తర్వాత ఈ పరిస్థితి మరింత బాధ కలిగించింది. అయితే పరిస్థితులను అర్థం చేసుకొని..ఈ సినిమా పంపిణీ నుంచి పూర్తిగా తప్పుకోవాలని మేము నిర్ణయించుకున్నాము.
సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులందరికీ మా హృదయపూర్వక క్షమాపణలు,” అని రాసుకొచ్చింది.
“ఈ కఠిన సమయంలో సహకారం అందించిన తెలుగు ఫిల్మ్ చాంబర్‌కు (సురేష్ బాబు గారు, భరత్ చౌదరి గారు, అశోక్ కుమార్ గారు, దామోదర్ ప్రసాద్ గారు) మా కృతజ్ఞతలు. అలాగే ఈ సమస్య సమయంలో మాకు మద్దతుగా నిలిచిన వంశీ నందిపాటి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విషయంలో ఆర్థిక పరిష్కారం వృత్తిపరంగా జరిగేలా చూసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి.. శ్రీ టి.జి. విశ్వ ప్రసాద్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు,” అంటూ ఆ లేఖను ముగించారు.
ఆక ఈ సమస్యలన్నీ భారతదేశ విడుదలపై ఎలాంటి ప్రభావం చూపవని స్పష్టంగా తెలుస్తోంది. భారత్‌లో మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ కావడంతో, థియేటర్లలో భారీగా సందడి చేయనుంది. ప్రభాస్ కొత్త లుక్, వినోదాత్మక కథ, కుటుంబంతో కలిసి చూడదగిన అంశాలు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి.
ప్రజెంట్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు కూడా జోరుగా జరుగుతున్నాయి. ట్రైలర్, పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పండుగకు పెద్ద సినిమాల మధ్య పోటీ ఉన్నప్పటికీ, ‘ది రాజా సాబ్’ మాత్రం ప్రత్యేకమైన కంటెంట్‌తో ముందుకు రాబోతోంది.
ALSO READ: Jana Nayagan Postponed: జన నాయగన్‌కు హైకోర్టు నుంచి షాక్.. జనవరి 9 విడుదల లేనట్టే..!