E-Paper
Advertisement

The Raja Saab సినిమా రాంగ్ టైంలో వచ్చి.. అందరిని ఇబ్బంది పెట్టింది : మారుతి

The Raja Saab సినిమా రాంగ్ టైంలో వచ్చి.. అందరిని ఇబ్బంది పెట్టింది : మారుతి
Advertisement

The Raja Saab Blockbuster Meet: మారుతి దర్శకత్వంలో.. ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ సినిమా జనవరి 9న థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా తెలంగాణలో టికెట్ ధరల పెంపు నిర్ణయం ఆలస్యం కావడం.. ప్రీమియర్ షోలు లేటుగా పడటం.. కొన్ని చోట్ల షోలు క్యాన్సిల్ కావడం వంటి సమస్యలు వచ్చాయి. దీనివల్ల మీడియా, ప్రేక్షకులు కూడా అసౌకర్యానికి గురయ్యారు. అదే సమయంలో సినిమాకు నెగటివ్ రివ్యూలు కూడా రావడంతో చర్చ మరింత పెరిగింది.

ఈ పరిస్థితులపై స్పందించిన దర్శకుడు మారుతి.. రాజా సాబ్ బ్లాక్‌బస్టర్ మీట్లో తన మనసులోని మాటలను ఓపెన్‌గా చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. “గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్.. ఫస్ట్ అఫ్ ఆల్ మీడియా ఫ్రెండ్స్ మొన్న విమల్ థియేటర్ దగ్గర చాలా డిస్కంఫర్ట్ గా ఫీల్ అయ్యారు… రాంగ్ టైంలో పడి కొంచెం అందరినీ ఇబ్బంది పెట్టాము. అందుకే అందరికీ క్షమాపణలు చెప్తున్న,” అని చెప్పుకొచ్చారు.

Advertisement

ఆ తర్వాత సినిమా గురించి మాట్లాడుతూ ..”నాకు ఒక మంచి అపర్చునిటీ ఇచ్చిన ప్రభాస్ గారికి నా జన్మంతా రుణపడి ఉంటాను. ఒక మిడ్ రేంజ్ డైరెక్టర్ తో ప్రభాస్ గారు సినిమా చేయడం నా జీవితంలో పెద్ద గిఫ్ట్. మూడు సంవత్సరాలు కష్టపడి ఈ సినిమాను చేశాను… కొత్తగా చూపించాలనే ప్రయత్నంలో కొన్ని విషయాలు టైం తీసుకుంటాయి… వన్ డేలోనే రిజల్ట్ డిసైడ్ చేయకండి… పది రోజులు ఓపికగా చూడండి… ప్రభాస్ గారి అభిమానుల మాటలను దృష్టిలో పెట్టుకుని సెకండ్ హాఫ్ షార్ప్ చేసి, ఓల్డ్ గెటప్ సీన్స్ కూడా యాడ్ చేశాం. ఈరోజు ఈవినింగ్ నుంచి రియల్ రాజా సాబ్‌ని చూస్తారు…”

పండుగ సీజన్‌లో అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటూ, ప్రేక్షకులు ఓపికగా రాజా సాబ్ను చూడాలని మారుతి మనస్ఫూర్తిగా అభ్యర్థించారు. ప్రస్తుతం ఈ స్పీచ్ వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

Advertisement

ఇంత పరీక్ష అవసరమా..!

ఇప్పటికే ఈ సినిమా మూడు గంటల పైన ఉండటంతో ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మారుతి ఇంకొన్ని సీన్లు యాడ్ చేస్తున్నాము చూడండి అని చెప్పడంతో.. ప్రేక్షకుల సహనానికి ఎంత పరీక్ష అవసరమా అని అందరూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఇలా చేయడం వల్ల సినిమాకి మరింత మైనస్ తప్ప.. ప్లస్ లేదు అన్న విషయం కూడా ఎందుకు ఈ దర్శకుడు గమనించకుండా ఇలా మాట్లాడారో తెలియడం లేదు.

ఒక వేళ ఇప్పుడు ఉన్న 3 గంటల 10 నిమిషాల వర్షన్ లో అనవసరమైన సీన్స్ ను తొలగించి… వీటితో రిప్లేస్ చేస్తే పర్లేదు. కానీ, ఉన్న దానికి యాడ్ చేస్తా మాత్రం మళ్లీ ట్రోల్స్ బారిన పడాల్సి వస్తుందేమో..

ALSO READ: Nithiin Career: నితిన్ కెరీర్ ఎందుకు ఊపందుకోలేకపోయింది? అసలు కారణాలు ఇవే..

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×