E-Paper
Advertisement

The Raja Saab: ప్రభాస్ లో ఇంత మార్పు.. వర్క్ అవుట్ అవుతుందా?

The Raja Saab: ప్రభాస్ లో ఇంత మార్పు.. వర్క్ అవుట్ అవుతుందా?
Advertisement

Prabhas Raja Saab: ప్రభాస్ పేరు వింటేనే ఫ్యాన్స్ కి భారీ యాక్షన్ సీన్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్, గ్రాండ్ స్క్రీన్ ప్రెజెన్స్ గుర్తొస్తాయి. బాహుబలి తర్వాత డార్లింగ్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. సలార్, ఆదిపురుష్, కల్కి లాంటి సినిమాల్లో ప్రభాస్‌ను లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్‌ లలో మాత్రమే చూశాం. కానీ ఇప్పుడు ఆ ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా ‘ది రాజా సాబ్’ లో ప్రభాస్ కొత్తగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ ఒక సింపుల్ బాయ్ నెక్స్ట్ డోర్ పాత్రలో కనిపిస్తారట.

ఎలాంటి భారీ ఆయుధాలు, రాజ్యాలు, యుద్ధాలు లేకుండా ప్రభాస్ ఓ సాధారణ పాత్రలో ఉంటారు టాక్. ఇది అభిమానులకు చాలా ఎక్సైట్‌మెంట్ కలిగిస్తున్న మాట నిజమే. ఎందుకంటే చాలాకాలం తర్వాత ప్రభాస్‌ను లైట్, ఫ్రెష్ అవతార్‌లో చూడబోతున్నాం. భారీ యాక్షన్ సీన్స్ అయితే ఈ సినిమాలో కూడా ఉన్నాయి కానీ గంభీరమైన డైలాగ్స్ లేకుండా లైట్ హ్యూమర్, ఫన్, ఫాంటసీ టచ్‌తో కూడిన పాత్ర ఇది. చాలాకాలం తర్వాత ప్రభాస్‌ను ఇలా రిలాక్స్ అయిన, నవ్వించే క్యారెక్టర్‌లో చూడబోతున్నామని ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు.

Advertisement

ఇదిలా ఉండగా ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం డైరెక్టర్ మారుతి ఈ సినిమాతో పెద్ద రిస్కే తీసుకుంటున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ లాంటి స్టార్‌ను హారర్ కామెడీ ఫాంటసీ జానర్‌లో చూపించడం అంత ఈజీ కాదు. కానీ మారుతికి కామెడీ టైమింగ్, ఫాంటసీ ఎలిమెంట్స్ బాగా హ్యాండిల్ చేసే అనుభవం ఉంది. అందుకే కంటెంట్ మీద పూర్తి నమ్మకంతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఆయన గత సినిమాలు కూడా చూస్తే ఇదే జానర్‌లో మీడియం రేంజ్ హీరోలతో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయగలిగారు.

ఈ సినిమాలో సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ లాంటి స్టార్ క్యాస్ట్ కూడా ఉంది. మాళవిక మోహనన్‌కు ఇది తెలుగులో మొదటి సినిమా కావడం విశేషం. మ్యూజిక్‌ను థమన్ అందిస్తున్నారు కాబట్టి ఆడియో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. అన్నీ బాగా వర్క్ అయితే యాక్షన్ హీరోగా మాత్రమే కాదు, వర్సటైల్ పెర్ఫార్మర్‌గా కూడా ప్రభాస్ ను చూపించిన సినిమాగా రాజ్ సాబ్ మిగులుతుంది.

Advertisement

అయితే అసలు ప్రశ్న ప్రభాస్ కొత్త ఇమేజ్ ను మామూలు ఆడియన్స్ అంగీకరిస్తారా? అభిమానులు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్, కామన్ వ్యూయర్స్ ఎలా కనెక్ట్ అవుతారన్నదే అసలు టెస్ట్. ఈ సారి సంక్రాంతి కంటే ముందే స్టార్ హీరో సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యింది. 2026 జనవరి 9న విడుదల కానున్న ది రాజా సాబ్ ప్రభాస్ కెరీర్‌లో ఒక మర్చిపోలేని మైలు రాయి అవుతుందా లేక పెద్ద రిస్క్‌గా మిగిలిపోతుందా అన్నది థియేటర్‌లలో తెలుస్తుంది.

ALSO READ: Prabhas: స్టార్ హీరోలకు భిన్నంగా ప్రభాస్ వెళ్లడానికి కారణం ఏమిటో తెలుసా..?

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×