E-Paper
Advertisement

The Raja Saab : ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్‌ని చీట్ చేసి డబ్బులు నొక్కేసిన ‘ది రాజాసాబ్’ నిర్మాత విశ్వప్రసాద్

The Raja Saab : ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్‌ని చీట్ చేసి డబ్బులు నొక్కేసిన ‘ది రాజాసాబ్’ నిర్మాత విశ్వప్రసాద్
Advertisement

The Raja Saab Movie : ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ అధినేత టి.జి.విశ్వప్రసాద్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ని చీట్ చేశారా? అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. వివరాల్లోకి వెళితే.. ఈ సంక్రాంతికి తెలుగులో రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా సినిమా ‘ది రాజాసాబ్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమా ఇది. దీనిపై ఆడియన్స్ ఫోకస్ ఎక్కువగానే ఉంది. అయితే ఈ సినిమా ఓవర్సీస్ పంపిణీ విషయంలో నిర్మాత విశ్వప్రసాద్ కొందరు డిస్ట్రిబ్యూటర్స్ ని చీట్ చేశారట.

2 ఏరియాలకి గాను ఒక డిస్ట్రిబ్యూటర్ ముందుగా ‘ది రాజాసాబ్’ థియేట్రికల్ హక్కుల కోసం టి.జి.విశ్వప్రసాద్ బావమరిది కళ్యాణ్ ని సంప్రదించాడట. అతను పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి.. 2 ఏరియాల హక్కులకు గాను రూ.40 లక్షలు చెప్పారట. సదరు డిస్ట్రిబ్యూటర్ కాదనకుండా అడిగినంత కట్టేసి అగ్రిమెంట్ చేయించుకున్నాడట. అటు తర్వాత థియేటర్లకు కూడా రెంట్లు వంటివి కట్టేసి లాక్ చేశారట.

Advertisement

అయితే ఇంతలో ఓ పిడుగు లాంటి వార్త ఆ డిస్ట్రిబ్యూటర్ చెవిన పడింది. అదేంటంటే..’ది రాజాసాబ్’ కి సంబంధించి మొత్తం ఓవర్సీస్ హక్కులు ‘ప్రత్యంగిర..’ అనే సంస్థకి ఇచ్చేశారట విశ్వప్రసాద్ అండ్ టీం. అంతేకాకుండా అంతకు ముందు ‘ది రాజాసాబ్’ హక్కులు దక్కించిన డిస్ట్రిబ్యూటర్ల అగ్రిమెంట్లు చెల్లవు అనే నివేదికను సైతం జారీ చేశారట.ఇదేమి అన్యాయం అని ఆ డిస్ట్రిబ్యూటర్ కళ్యాణ్ ని అలాగే విశ్వప్రసాద్ ని ప్రశ్నించగా.. ‘మాకు మార్కెట్ లో ఇంకా ఎక్కువ రేటుకి ఆఫర్ వచ్చింది. కాబట్టి మీతో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నాం’ అంటూ మొహం మీదే చెప్పేశారట.

దీంతో చేసేదేమీ లేక ఆ డిస్ట్రిబ్యూటర్ తాము కట్టిన రూ.40 లక్షలు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేయగా.. అందుకు మొదట సరే అని చెప్పిన విశ్వప్రసాద్ తర్వాత నుండి వాళ్ళ ఫోన్లు ఎత్తడం మానేశారట. అతను మాత్రమే కాదు ఇంకా చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు ఇలాగే మోసపోయినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో వారంతా కలిసి తెలుగు ఫిలిం ఛాంబర్ ని ఆశ్రయించారట. కానీ వాళ్ళు కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు అని తెలుస్తుంది.

Advertisement

ఓ పక్క ‘ది రాజాసాబ్’ నిర్మాతకు కట్టిన రూ.40 లక్షలు.. మరోపక్క థియేటర్లు హోల్డ్ చేసినందుకు లక్షల్లో చెల్లించిన రెంటులు వంటి వాటి వల్ల నలిగిపోతున్నారు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు. అక్కడ ఒక్కసారి థియేటర్లు హోల్డ్ చేశారు అంటే.. చెప్పిన టైంకి సినిమా షో పడినా పాడకపోయినా పూర్తిగా అమౌంట్లు చెల్లించాల్సిందే. టి.జి.విశ్వప్రసాద్ అత్యాశ వల్ల అక్కడి బయ్యర్స్ చాలా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. ఓ పెద్ద సినిమా తీసినప్పుడు ఇలాంటి నెగిటివ్ ఎనర్జి కూడబెట్టుకోవడం.. నిర్మాతకు మంచిది కాదని బయ్యర్లు విశ్వప్రసాద్ ను తిట్టిపోస్తున్నారు. మరి ఈ విషయంపై ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×