iPhone 200MP Camera| టెక్ దిగ్గజం ఆపిల్ ప్రతి ఏడాది ఐఫోన్ కొత్త సిరీస్ మోడల్స్ లాంచ్ చేస్తూ ఉంటుంది. ఇందులో కొత్త కొత్త అప్డేట్లు, ముఖ్యంగా కొత్త జెనెరేషన్‌లో కెమెరా మెరుగులపై ఎక్కువ దృష్టి పెడుతోంది. చిన్న అప్‌గ్రేడ్‌లు కూడా ఏటా రిఫ్రెష్ స్ట్రాటజీలో పెద్ద పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు ఒక కొత్త ఇన్వెస్టర్ రిపోర్ట్ ప్రకారం.. ఆపిల్ భారీ కెమెరా జంప్ ప్లాన్ చేస్తోంది. కంపెనీ 200MP కెమెరా సెన్సార్‌తో ఐఫోన్‌పై పనిచేస్తోందట. అయితే ఈ మార్పు చూడాలంటే యూజర్లు మరికొన్ని సంవత్సరాలు వేచి ఉండాలి.
మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్టర్ నోట్ ప్రకారం.. ఆపిల్ 2028లో ఈ ఫోన్ లాంచ్ టార్గెట్ చేస్తోంది. టైమ్‌లైన్ సరిగ్గా ఉంటే ఈ అప్‌గ్రేడ్ 2028 ఐఫోన్లతో వస్తుంది. ఈ మోడల్స్ ఐఫోన్ 21 సిరీస్ పేరుతో రావచ్చు. ఇది ఆపిల్ స్మార్ట్‌ఫోన్ కెమెరా రిజల్యూషన్‌లో అతిపెద్ద జంప్ అవుతుంది. రిపోర్ట్ ప్రకారం.. ఈ అప్‌గ్రేడ్‌కు ఇంకా చాలా ప్రొడక్ట్ సైకిల్స్ దూరంలో ఉంది.
ఈ రిపోర్ట్ పూర్తి ఆశ్చర్యం కాదు. గత ఏడాది టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఆపిల్ 200MP సెన్సార్లు టెస్ట్ చేస్తోందని చెప్పాడు. అప్పుడు లాంచ్ టైమ్‌లైన్ కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు కొత్త ఇన్వెస్టర్ నోట్ స్పష్టమైన టైమ్‌ఫ్రేమ్ ఇస్తోంది. ఆపిల్ తన లాంగ్ టర్మ్ కెమెరా రోడ్‌మ్యాప్‌ను ఇంకా రిఫైన్ చేస్తోంది.
ఆపిల్ ప్రస్తుతం అన్ని రియర్ ఐఫోన్ కెమెరాల్లో 48MP సెన్సార్లు ఉపయోగిస్తోంది. మెయిన్, అల్ట్రా-వైడ్, టెలిఫోటో లెన్స్‌లలో ఇవే ఉన్నాయి. మెయిన్ కెమెరాలో 12MP నుంచి 48MPకు మార్చారు. తర్వాత ఇతర లెన్స్‌లకు కూడా ఈ అప్‌గ్రేడ్ విస్తరించారు. హై రిజల్యూషన్ డీటెయిల్ మెరుగుపరుస్తుంది. కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీ ఫీచర్లకు సహాయపడుతుంది. పిక్సెల్ బిన్నింగ్ ఆపిల్ ఇమేజింగ్ అప్రోచ్‌లో కీలకం.
మోర్గాన్ స్టాన్లీ ప్రకారం.. ఆపిల్ చాలా సంవత్సరాలు 48MP కెమెరాలతోనే కొనసాగిస్తుంది. రాబోయే ఐఫోన్ 18 సిరీస్ అదే సెన్సార్ రిజల్యూషన్‌తో వస్తుంది. 2027లో లాంచ్ అయ్యే మోడల్స్‌లో కూడా మెగాపిక్సెల్ మార్పులు రావు. ఇంతకుముందు రిపోర్ట్స్ ప్రకారం.. 200MP కెమెరా ఐఫోన్ త్వరలోనే వస్తుందని సమాచారం. కానీ ఇప్పుడు ఆ టైమ్‌లైన్స్ అవకాశం తక్కువగా ఉందని శిశ్లేషకులు చెబుతున్నారు.
రిపోర్ట్ ప్రకారం సామ్‌సంగ్ 200MP కెమెరా సెన్సార్ సప్లై చేయవచ్చు. ఆపిల్, సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీదారులు. అయినా సామ్‌సంగ్ ఆపిల్‌కు కీ కాంపోనెంట్స్ సప్లై చేస్తోంది. ఈ పార్టనర్‌షిప్ ఆ లాంగ్ స్టాండింగ్ సప్లయర్ రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తుంది. సెన్సార్ సామ్‌సంగ్ ఆస్టిన్, టెక్సాస్ ఫెసిలిటీలో తయారవచ్చు. ఇది ఆపిల్ యూఎస్ ప్రొడక్షన్ విస్తరణకు సరిపోతుంది.
విశ్లేషకులు సప్లై చైన్ స్ట్రాటజీ వల్లే కెమెరా అప్‌గ్రేడ్ ఆలస్యమవుతోందని చెబుతున్నారు. ఆపిల్ ఒకే కంపెనీపై ఆధారపడకుండా సప్లయర్లను డైవర్సిఫై చేయాలని చూస్తోంది. ఈ జాగ్రత్తలు.. అప్రోచ్ రిస్క్ తగ్గిస్తుంది. లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఇస్తుంది. ముందు 200MP అంచనాలను స్కిప్ చేయడానికి కూడా ఇదే కారణం.
రిపోర్ట్ కెమెరా సెన్సార్ల తర్వాత బ్రాడర్ సప్లయర్ మార్పులను హైలైట్ చేస్తోంది. సోనీ ఆపిల్ కెమెరా, లైడార్ కాంపోనెంట్స్ మెయిన్ సప్లయర్. అయితే ఆపిల్ అదనపు లైడార్ పార్టనర్లను చూస్తోంది. STమైక్రో సప్లయర్‌గా చర్చల్లో ఉందట. ఇది ఖర్చులు నియంత్రించడానికి, సప్లై రిస్క్ తగ్గించడానికి సహాయపడుతుంది.
ఈ అప్డేట్స్ ఫేస్ ID కాంపోనెంట్స్ మినహాయింపు. మోర్గాన్ స్టాన్లీ ప్రకారం ఫేస్ ID సెన్సార్లకు తక్షణ మార్పులు రావు. ప్రస్తుతం LITE అనే సింగిల్ సప్లయర్ నుంచి వస్తాయి. అయితే ఫేస్ ID టెక్నాలజీ మాత్రం ఎవాల్వ్ అవచ్చు. అండర్-డిస్‌ప్లే ఫేస్ ID 2027లో లాంచ్ చేయవచ్చు. ఇది ఐఫోన్ 20వ వార్షికోత్సవానికి సందర్బంగా ఉంటుంది.
Also Read: చైనా స్మార్ట్‌ఫోన్‌లో ఇండియన్ టెక్నాలజీ.. అమెరికన్ జిపిఎస్ సిస్టమ్‌కు ఛాలెంజ్
పెరుగుతున్న విడిభాగాల ఖర్చులను ఆపిల్ జాగ్రత్తగా మేనేజ్ చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ధరలు పెంచకుండా ఖర్చులు తగ్గించేందుకు ప్లానింగ్ చేస్తోంది. అందేకే ఇటీవల బేస్ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ల ధరలు స్టేబుల్‌గా ఉంచారు. ఈ స్ట్రాటజీ వల్ల కస్టమర్లకు స్థిరమైన ధరలో ఐఫోన్ కొనుగోలు చేయగలుగుతున్నారు.