Ram Charan: బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ షాట్ వీడియో విపరీతంగా ఆకట్టుకుంది. రామ్ చరణ్ ఈ సినిమాలో ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడుతున్నాడు. ఇదివరకే రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రలో కనిపించే విపరీతంగా ఆకట్టుకున్నాడు రామ్ చరణ్. ఆ సినిమాలో గోదావరి యాసతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసాడు.
ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ మాట్లాడే ఉత్తరాంధ్ర యాస మీద కూడా చాలామందికి ఒక రకమైన క్యూరియాసిటీ ఉంది. ఇకపోతే ఈ సినిమాను మార్చి 27వ తారీకు 2026న విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. గతంలో బుచ్చిబాబు మాట్లాడుతూ మార్చి 26న ఈ సినిమా విడుదల కానున్నట్లు కూడా అనౌన్స్ చేశాడు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నారు అని చికిరి మేకింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది.
ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే విడుదలైన చికిరి సాంగ్ 100 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించుకుంది. ఎక్కడ చూసినా కూడా ఆ పాట ట్రెండింగ్ ఉంది. జానీ మాస్టర్ తన కొరియోగ్రఫీతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారు అనే కామెంట్స్ కూడా వినిపించాయి.
ఇకపోతే ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ చాలా శరవేగంగా జరుపుకుంటుంది. ఎల్లుండి నుండి పెద్ది కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. వన్ స్టూడియో, కోఠి హాస్పిటల్ లో షూటింగ్ జరగబోతున్నట్లు విశ్వసినీయ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది.
18 నుండి నాలుగు రోజులు ఢిల్లీ షెడ్యూల్ జరుగుతుంది. ఆ షెడ్యూల్ తరువాత క్లైమాక్స్, కుస్తీ సీక్వెన్స్, ఐటెం సాంగ్ షూట్ మాత్రమే మిగిలి ఉంటాయి.
మొత్తానికి మార్చి 27వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి భారీగానే ప్లాన్ చేస్తున్నారు. అయితే మరోవైపు సినిమా వాయిదా పడుతుంది అదే సినిమాకు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వస్తుంది అనే వార్తలు కూడా మరోవైపు వినిపిస్తున్నాయి. వీటన్నిటి విషయంలో అసలైన క్లారిటీ రావాలి అంటే ఖచ్చితంగా అధికారికి ప్రకటన ఇవ్వాల్సిందే.
మరోవైపు ఈ సినిమాకి సంబంధించి సెకండ్ సింగిల్ కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 16వ తారీఖున ఈ సినిమాకి సంబంధించి సెకండ్ సింగిల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఏదేమైనా ఫస్ట్ సింగల్ కి మాత్రం విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమాకి అద్భుతమైన ఓపెనింగ్స్ రావడం మాత్రం ఖాయం. అదే తరుణంలో సినిమాకి హిట్ టాక్ వచ్చిందంటే ఖచ్చితంగా చరణ్ కెరియర్ కి స్ట్రాంగ్ కం బ్యాక్ పడినట్లే అని చెప్పొచ్చు.
Also Read: Ustaad Bhagat Singh Promo : పవన్ కళ్యాణ్ అభిమానులకు తనివి తీరిపోయింది, ఇది కదా కోరుకుంది