E-Paper
Advertisement

Ind vs SA 1st T20I: గిల్ అట్ట‌ర్ ఫ్లాప్‌..హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ అదుర్స్‌..ద‌క్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే

Ind vs SA 1st T20I: గిల్ అట్ట‌ర్ ఫ్లాప్‌..హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ అదుర్స్‌..ద‌క్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే
Advertisement

Ind vs SA 1st T20I: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మొదటి కటక్ టి20 మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా విజృంభించాడు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు హార్థిక్ పాండ్యా. అయితే అప్పటి నుంచి జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా , ఈ టీ20 మ్యాచ్ నేపథ్యంలో రీ ఎంట్రీ ఇచ్చాడు. దానికి తగ్గట్టుగానే తన ఆటతీరుతో రెచ్చిపోయాడు హార్థిక్ పాండ్యా. త‌న రీ-ఎంట్రీలో అర్థ సెంచరీతో దుమ్ములేపిన హార్దిక్ పాండ్యా, టీమిండియాను ఆదుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన టీమిండియా 175 పరుగులు సాధించింది.

Also Read: T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి త‌ప్పుకున్న జియో హాట్‌స్టార్‌, స్టార్ స్పోర్ట్స్‌..రంగంలోకి నెట్ ఫ్లిక్స్ ?  

గిల్ అట్ట‌ర్ ఫ్లాప్‌..హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ అదుర్స్‌

Advertisement

 

కటక్ వేదికగా జరుగుతోన్న మొదటి T20 మ్యాచ్ నేపథ్యంలో దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు హార్దిక్ పాండ్యా. రీ ఎంట్రీలో దుమ్ము లేపుతున్న హార్దిక్ పాండ్యా, ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసి జట్టుకు ప్రాణం పోశాడు. 28 బంతుల్లోనే 59 పరుగులు సాధించిన హార్దిక్ పాండ్యా, దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. మంచినీళ్లు తాగినంత ఈజీగా సిక్సర్లు అలాగే బౌండరీలు సాధించాడు హార్థిక్ పాండ్యా. దీంతో హార్దిక్ పాండ్యాను అవుట్ చేసేందుకు సఫారీలు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎలాంటి బంతులు వేసిన అవలీలగా బౌండరీ లేదా సిక్సర్ తరలించేశాడు పాండ్యా. దీంతో 20 ఓవర్లలో 175 పరుగులు సాధించగలిగింది టీమిండియా. అయితే హార్దిక్ పాండ్యా ఇంత దాటిగా ఆడుతున్నప్పటికీ ఏ ఒక్క ఇండియన్ ప్లేయర్ అతనికి సపోర్ట్ గా నిలవలేకపోయారు. అభిషేక్ శర్మ 17 పరుగులకు అవుట్ కాగా.. మరో ఓపెనర్, వైస్ కెప్టెన్ గిల్ అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్లో రెండు బంతులు ఆడిన గిల్ బౌండరీ కొట్టి, వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో గిల్ ప్రదర్శన పై దారుణంగా విమర్శలు వస్తున్నాయి.

గిల్ బ్యాటింగ్ పై విమర్శలు

Advertisement

మెడ నొప్పి కారణంగా దక్షిణాఫ్రికా జరిగిన టెస్టులు అలాగే వన్డే సిరీస్ కు గిల్ దూరమైన సంగతి తెలిసిందే. అయితే గిల్ స్థానంలో వచ్చిన మిగిలిన ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తున్నారని, ఇవాళ రీ ఎంట్రీ ఇచ్చిన గిల్ మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యాడని మండిపడుతున్నారు ఫ్యాన్స్. చాలా రోజుల తర్వాత బ్యాటింగ్ చేస్తే సెంచరీ లేదా అర్థ సెంచరీ చేస్తారంటే.. గిల్ నాలుగు పరుగులు చేయడం ఏంటని విమర్శలు చేస్తున్నారు. ఇక గిల్ సంగతి అలా ఉంచితే కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా మరోసారి విఫలమయ్యాడు. 12 పరుగులకే ఉసురుమనిపించాడు. అటు తిలక్ వర్మ 26 పరుగులు చేయగా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ 23 పరుగులతో రఫ్పాడించాడు. చివరలో శివం దుబే 11 పరుగులు చేయగా జితేష్ శర్మ 10 పరుగులతో పర్వాలేదనిపించారు.

Also Read: Rohit-Kohli: రావణాసురుడిగా గంభీర్.. రామలక్ష్మణ్ అవ‌తారంలో రోకో..దుమారం రేపుతోన్న పోస్ట‌ర్‌!

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×