E-Paper
Advertisement

Anushka Shetty : అనుష్క శెట్టి పెళ్లి వార్తల పై క్లారిటీ ఇచ్చిన టీమ్.. పెళ్లి ఎప్పుడంటే..?

Anushka Shetty : అనుష్క శెట్టి పెళ్లి వార్తల పై క్లారిటీ ఇచ్చిన టీమ్.. పెళ్లి ఎప్పుడంటే..?
Advertisement

Anushka Shetty : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. గతంలో ఈమె చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచాయి.. ముఖ్యంగా అరుంధతి సినిమా అనుష్క లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.. బాహుబలి లాంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈమధ్య పెద్దగా తెలుగులో సినిమాలు చేయలేదు. కానీ తమిళ భాషలో అయితే ఆమె అడపా దడపా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.. రీసెంట్ గా ఘాటి చిత్రంతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది..ఆ మూవీ పెద్దగా ఆశించిన ఫలితాలని అందుకోలేకపోయింది. ఇదిలా ఉండదా అనుష్క పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా ఆ వార్తలు పై అనుష్క టీం క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ వాళ్ళు ఏం చెప్పారు అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

అనుష్క పెళ్లి వార్తలపై క్లారిటీ..

గత కొద్ది రోజులుగా అనుష్క పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో రోజుకో వార్త ప్రచారంలో ఉంది.. ఆ వార్తలపై అనుష్క ఇప్పటివరకు స్పందించలేదు.. తాజాగా అనుష్క టీం స్పందించింది.. అనుష్క టీం ఆమె పెళ్లిపై వస్తున్నా సోషల్ మీడియా వార్తలను కొట్టివేశారు. ఆమె పెళ్లి చేసుకోబోతుంది అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు అంటూ తేల్చేశారు. అధికారికంగా మన నుంచి ఎటువంటి ప్రకటన లేకుండా మీరు ఎలాంటివి పోస్ట్ చేయొద్దు అంటూ వాళ్ళు సోషల్ మీడియా ట్రోలర్స్ కి వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు అనుష్క ఏజ్ గురించి పదేపదే ప్రస్తావన తీసుకురావడం మంచిది కాదు అంటూ హెచ్చరించారు. అలా చేయడం వల్ల ఆమె ప్రైవసీకి భంగం కలిగించిన వాళ్లే అవుతారని టీం పేర్కొంది.. పెళ్లి అనేది ఆమె వ్యక్తిగత విషయం అలాంటి వాటి మీద రూమర్స్ క్రియేట్ చేయడం మంచిది కాదు అంటూ తెలిపింది. ఇకమీదట అనుష్క పెళ్లి గురించి ఎలాంటి వార్తలు బయటకు వచ్చినా ఊరుకోము అంటూ ఇన్ డైరెక్ట్ గా హెచ్చరించినట్లు తెలుస్తుంది..

Advertisement

Also Read : బాలు తాగి రచ్చ రచ్చ..రోహిణికి దిమ్మతిరిగే షాక్.. డీలర్ కు నిజం చెప్పేసిన బాలు.. ట్విస్ట్ అదిరింది..

అనుష్క సినిమాల విషయానికొస్తే..

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఈమె చేసిన సినిమాలు అన్ని ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడి ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా సినిమాలలో నటించే అవకాశాలను అందుకుంది.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ని నిరూపించుకుంటూ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.. అంతేకాదు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరు సరసన నటించి మెప్పించింది.. ఈమధ్య తెలుగులో సినిమాలు చేయడం బాగా తగ్గించింది.. అయితే తెలుగులో అవకాశాలు రాకనో లేకపోతే ఆమెకు కథలు నచ్చకనో తెలియదు కానీ సినిమాలు మాత్రం బాగా తగ్గాయని తెలుస్తుంది.. చివరిగా ఘాటి చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది.. అయితే ఇప్పటివరకు తెలుగులో మరో సినిమాని ప్రకటించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె పేరు రోజు వినిపిస్తూనే ఉంది.. ఇకమీదట ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.

Related News

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

Big Stories

Advertisement
×