Minister Ponnam Prabhakar: స్వేచ్ఛ బ్యూరో: 100 కోట్ల తో ఆర్టీసీ బస్ స్టేషన్ లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. 1350 కోట్ల పీఎఫ్ బకాయిలు ఉంటే దానిని 600 కోట్లకు తగ్గించామన్నారు. శాసనమండలిలో బుధవారం ఆర్టీసీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మహా లక్ష్మీ పథకం కింద 9 డిసెంబర్ ,2023 నుండి ఫిబ్రవరి 28,2026 వరకు ఆర్టీసీ లో 279.97 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని, ఈ పథకం అమలు కింద 2024-25లో మొత్తం 3866.30 కోట్లను, 2025-26 లో ఫిబ్రవరి 26 వరకు 2913.82 కోట్లను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందన్నారు.
వ్యవసాయ ఆధారిత మారుమూల గ్రామాలు ,పట్టణ ప్రాంతాల్లో రద్దీగా ఉన్న సమయాల్లో పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్ ను తీర్చడానికి అదనంగా కొత్త బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం పై సపోర్ట్ చేస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 69 శాతం ఆక్యుపెన్సీ నుంచి 98 శాతానికి ఆక్యుపెన్సీ వచ్చింది..దన్నారు. గతంలోసీసీఎస్ కి 664 కోట్ల బకాయిలు ఉండేవి దానిని 300 కోట్లకు తగ్గించామన్నారు. గత 10ఏళ్లుగా ఆర్టీసీ లో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు.. మేము 3038 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం.. గత ప్రభుత్వం ఒక్క బస్సు కొనుగోలు చేయలేదు.. మేము 2708 కొత్త బస్సులు కొనుగోలు చేశాం.. కొత్త రూట్ కనెక్టివిటీ చేస్తున్నాం.. ప్రజా ప్రతినిధులు అడుగుతున్న రూట్ల లో బస్సులు వేశామన్నారు. 600 బస్సులకు మహిళలకు యజమానులను చేశాం.. నెలకి 70 వేలు మహిళా సంఘాలకు అందిస్తున్నామన్నారు.
1132 కారుణ్య నియామకాలు చేపట్టిందని, 17 కోట్ల రూపాయలతో తార్నాక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అభివృద్ధి చేశామన్నారు. 2017 కి సంబంధించి 21 శాతం ఫిట్మెంట్ అందించామన్నారు. యూపీఐ సహకారం తో ఆర్టీసీ కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా ఇస్తున్నామన్నారు. వివిధ కారణాల వల్ల పూర్తి సర్వీసు నుంచి రిమూవ్ అయిన వారిని ఒక త్రిమెన్ కమిటీ వేసి 250 మందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకున్నాం.. వారి కుటుంబాలను ఆడుకున్నామన్నారు. 2013 ఆర్పీఎస్ బాండ్లు చెల్లించాం.. దీని ద్వారా 280 కోట్ల భారం పడిందన్నారు. రాష్ట్రంలో జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఒక్కొక్కటి చొప్పున 37 ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామన్నారు. ఈ ఏటీఎస్ ల ప్రక్రియ ప్రస్తుతం తుది దశలో ఉందన్నారు. ఇవి పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తాయి.. ఇందులో ఎటువంటి ప్రైవేట్ యాజమాన్యం ఉండదన్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో పాత వాహనాలపై గ్రీన్ టాక్స్ రూ.68.11 కోట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.71.14 కోట్లు గ్రీన్ టాక్స్ ద్వారా వచ్చిన నిధులను ఈ శాఖ ఉపయోగించినప్పటికీ పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలకు 100 శాతం పన్ను మినహాయింపులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఏటీఎస్ లు పూర్తిగా ప్రభుత్వ పరిధిలోని నడుస్తుంది ప్రైవేట్ కి సంబంధం ఉండదన్నారు. ప్రభుత్వం స్క్రాపేజీ పాలసీ నీ విజయవంతంగా అమలు చేస్తుంది.. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు రిజిస్టర్ వెహికల్స్ స్క్రాపింగ్ సౌకర్యాలు ఉన్నాయన్నారు. పాత వాహనంలో స్క్రాపింగ్ ను ప్రోత్సహించడానికి లయబిలిటీల మాఫీని, పన్ను రాయితీ లను కూడా ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. రవాణా శాఖలో ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 50 కి పైగా సంస్కరణలు అమలు చేశామన్నారు. రవాణా శాఖలో ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ తీసుకొస్తున్నాం.. డ్రైవింగ్ లైసెన్సులు పారదర్శకత్వం ఉండడం కోసం నూతన టెక్నాలజీ ద్వారా దీనిని వినియోగిస్తామన్నారు. ఈనెల 23వ తేదీ నుండి వాహన్ లో చేరుతామన్నారు.
317 సబ్ కమిటీ సభ్యుడిని ఇంకా ఏమైనా సమస్యలు ఉన్న పరిష్కారం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేశాం..స్థానికత కోర్టు డైరెక్షన్స్ ,రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజలకు కేంద్రం ఏం ఇస్తున్నారు.. గాడిద గుడ్డు సున్నా నా..? ఏమైనా తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తారా చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ కోడి గుడ్డు మీద వెంట్రుకలు లెక్కపెట్టినట్టు ఉందన్నారు. గత 2ఏళ్లుగా తెలంగాణ పట్ల వివక్ష చూపుతుంది.. 8 మంది పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు తెలంగాణ కు ఏం తెచ్చారని నిలదీశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు కేంద్రం ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన అనేక అంశాల్లో విద్య ,వైద్యం,మౌలిక సదుపాయాలు,పెండింగ్ ప్రాజెక్ట్ లు నిధులు పెండింగ్ లో ఉన్నాయి.. దీనిపై తెలంగాణ పట్ల బిజెపి ప్రభుత్వం విషం చిమ్ముతుందన్నారు. మేము భారతదేశంలో అంతర్భాగం కాదా..తెలంగాణ కు నిధులు ఎందుకు కేటాయించరు.. ఎందుకు ఈ వివక్ష అని మండిపడ్డారు.బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు గవర్నర్ దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గర కు వెళ్లింది బీజేపీ నేతలు డిల్లీకి వెళ్లి ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి లాభం జరిగే విధంగా మహేశ్వర్ రెడ్డి కొట్లాడితే నిర్మల్ ప్రజలు కూడా సంతోషిస్తారన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుండి ఏదైనా స్పెషల్ గా తెచ్చారా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.