E-Paper
Advertisement

Jockey Movie: విజయ్ సేతుపతి చేతుల మీదుగా గోట్ ఫైట్ మూవీ ‘జాకీ’ ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే..?

Jockey Movie: విజయ్ సేతుపతి చేతుల మీదుగా గోట్ ఫైట్ మూవీ ‘జాకీ’ ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే..?
Advertisement

Jockey Movie: యంగ్ హీరో, హీరోయిన్లు యువన్ కృష్ణ, రిదాన్ కృష్ణాస్, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘జాకీ’. ఇదొక గోట్ ఫైట్ స్టోరీ మూవీ..2021లో వచ్చిన ‘మడ్డి’ సినిమా తర్వాత, PK7 స్టూడియోస్ మరోసారి దర్శకుడు డా. ప్రగభల్ కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ సినిమా మధురై గ్రామీణ నేపథ్యంలో రూపొందింది. చెన్నైలో జరిగిన వీధి తిరువిళా13వ ఎడిషన్ కార్యక్రమంలో టీజర్‌ను విడుదల చేశారు.. గతంలో వచ్చిన మడ్డి సినిమా తర్వాత రూపొందించిన ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు. ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి చేతుల మీదుగా టీజర్ ని లాంచ్ చేశారు.. ప్రస్తుతం ఆ టీజర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. టీజర్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం…

‘జాకీ’ టీజర్ ఎలా ఉందంటే..?

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ స్టోరీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఒకప్పుడు పొట్టేళ్ల ఫైట్ సినిమాల్లో చూసేవాళ్ళం. అదే స్టోరీ తో ఈ సినిమా మొత్తం కొనసాగుతుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు.. ఇందులో మధురై కి సంబంధించిన కొన్ని గ్రామాల్లో ఇలాంటి పోటీలు ఉంటున్నట్లు చూపిస్తారు. అలాగే పొట్టేళ్ల పోటీ కోసం ఓ వ్యక్తి చేసే ప్రయత్నాల గురించి ఆ టీజర్ లో చూపిస్తారు. పొట్టేళ్ల పోటీ మాత్రమే కాదు నేను రౌడీయిజాన్ని కూడా చేస్తాను. బెజవాడ సెంటర్లో నేనే రౌడీని అని ఆ టీజర్ లో పవర్ఫుల్ డైలాగ్ లు ఉంటాయి. దాంతో పాటుగా లవ్ స్టోరీ కూడా ఉందని అర్థం అవుతుంది. పొట్టేళ్ల ఫైట్ తో పాటుగా ఈ సినిమా డిఫరెంట్ జోనల్లో రాబోతుందని టీజర్ ని చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతానికి టీజర్ వీడియో జనాలు నుంచి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే..

Advertisement

Also Read : ఇంట్లోంచి వెళ్లేందుకు మహా రెడీ.. ఫోటో చూసి ఎమోషనల్.. చక్రితో మహా వెళ్ళిపోతుందా..?

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

మధురై లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పోటీలను నిర్వహిస్తుంటారు. ఒక గ్రూప్ ఈ పోటీలను నిర్వహిస్తారు.. తమ పొట్టేళ్లను గెలిచేలా చేసేందుకు అవతల వాళ్ళతో యుద్దాలకు కూడా దిగుతారు. గ్రామాల్లో జరిగే సంప్రదాయ పొట్టేలు పోరాటం చుట్టూ తిరుగుతుంది. ఈ పోరాట సన్నివేశాలు అన్ని సహజం గా తెరకెక్కించడానికి ఒక మూడు సంవత్సరాలు బాగా కష్టపడ్డారు. నేటివిటీ మిస్ అవ్వకుండా ఈ సన్నివేశాలు చిత్రీకరణ జరిపారు. నటీనటులు నిజమైన పొట్టేలుతో శిక్షణ తీసుకొని నటించారు.. ఇక ‘జాకీ’ సినిమా ద్వారా గ్రామీణ జీవితం, ప్రజల భావోద్వేగాలు, సంప్రదాయ క్రీడను సహజంగా ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ టీజర్ తో సినిమా గురించి పూర్తి వివరాలను వెల్లడించారు.. త్వరలోనే ఈ సినిమా నుంచి మరో సాంగ్ రాబోతుందని సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ పోస్టులతో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ థియేటర్ లోకి వచ్చిన తర్వాత ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Advertisement

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×