Podarillu Today Episode January 6th: మహా సారి చెప్పడంతో భూషణ్ కూల్ అవుతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహా అన్నది మనసులో పెట్టుకోవద్దు బాబుకు చిన్నపిల్ల కదా నేను సాటి చెప్తాను అని భూషణ్తో ప్రతాప్ అంటాడు. మహా మాత్రం ఎప్పుడూ కొట్టని నాన్న వాడి కోసం నన్ను కొట్టాడు అని తెగ బాధ పడిపోతుంది. హారిక ఎంతగా ఓదార్చిన మహా మాత్రం ఫీల్ అవుతూ ఉంటుంది. నన్ను నాకంత తండ్రి చేత కొట్టిచ్చాడు అలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలని బాధపడుతూ ఉంటుంది. నాకు అసలు వాడు వద్దు. వాడిని నేను పెళ్లి చేసుకోను అని మహా ఫిక్స్ అవుతుంది. ఇది విషయన్ని వెళ్లి ప్రతాప్ తో మాట్లాడాలని అనుకుంటుంది. ప్రతాప్ మహాతో మాట్లాడి సద్ది చెప్పాలని అనుకుంటాడు.. కానీ ఎంత చెప్పినా కూడా మహా మాట వినదు.. ఇక దానికి మహా ఫీల్ అవుతుంది.. ఈ విషయాన్ని మర్చిపోవద్దు మనిషి లాగా కనిపించలేదని ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు.. నేను తీసుకున్న నిర్ణయం నీకు నచ్చడం లేదు అని ప్రతాప్ మహా పై సీరియస్ అవుతాడు. అయితే నీ మనసులో ఎవరైనా ఉన్నారా? ఏంటి అని అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నారు మహా గురించి మనమే ఇలా అనుమానం పడతామా అని అంటారు.. ఈ పెళ్లి కచ్చితంగా జరుగుతుంది. ఈ విషయంలో నా నిర్ణయమే ఫైనలని ప్రతాప్ అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మహా ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఫిక్స్ అవుతుంది. నేను ఈ రాత్రికే ఇంట్లోంచి వెళ్లిపోవాలని చక్రితో అంటుంది.. చక్రి ఆమెకు సాయం చేస్తానని అంటాడు.. మీరు నిజంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా అని చక్రి పదేపదే అడుగుతాడు.. నేను ఫిక్స్ అయిపోయాను నన్ను నేను కాపాడుకోవడానికి ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చాను. నాకు ఒకరు సాయం కావాలి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను మీరు చేస్తారా లేదా అని మహా అడుగుతుంది.. తర్వాత రోజు కులదైవం గుడిలో పూజ చేయించాలని అందరూ వెళ్తారు. మహాను ఇంట్లో ఉంచేసి మిగిలిన వాళ్ళందరూ కూడా గుడికి వెళ్తారు. ఇదే రైట్ టైం నేను ఇంట్లోంచి వెళ్లిపోవాలి అని మహా ఫిక్స్ అవుతుంది..
అందరూ గుడికి వెళ్ళగానే మహా బట్టలు సర్దుకోవాలని అనుకుంటుంది.. తన మేనకోడలు ఆ ఆడుకుందామని ఎంత అడిగినా సరే లేదురా నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. నేను పడుకుంటాను తర్వాత ఆడుకుందాం అనేసి అంటుంది. మహా తన రూమ్ కి వెళ్లి బట్టల్ని సర్దుకుంటుంది. అక్కడ ఫోటో కింద పడిపోవడంతో అది చూసి వాళ్ళ తండ్రి తనకు చేసిన సేవలు గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతుంది. నాకు అన్నీ చేశావు కానీ ఎందుకు నన్ను ఇలా నచ్చని పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నావని చాలా ఫీల్ అవుతుంది మహా. ఇక బట్టలన్నీ సర్దేసుకొని పక్కన పెడుతుంది.. హారిక డోర్ కొట్టడంతో బట్టల గురించి ఎక్కడ అడుగుతుందో అనని బ్యాగ్ ని పక్కన పెట్టేసి డోర్ తీస్తుంది..
మహా ఎందుకు టెన్షన్ పడుతున్నావని హారిక అడుగుతుంది.. నువ్వు ఇంకా బట్టలు కూడా మార్చుకోలేదు ఏంటి మార్చుకోవా అని హారిక అడుగుతుంది.. తలనొప్పిగా ఉంది అన్నావు కదా ఇదిగో టీ అని ఇస్తుంది.. ఆ టీ ని గబగబా తాగేస్తుంది మహా.. అయితే టీ వేడిగా ఉంది కదా కాస్త మెల్లగా తాగు అని హారిక అడుగుతుంది.. నీ పెయిన్ నాకు అర్థమైంది మహా కానీ నీకు పెళ్లి అవ్వకుండా ఎవరూ ఆపలేరు ఇక అని హారిక అంటుంది. నన్ను ఎంతో ఇష్టంగా పెంచుకున్న మా నాన్ననే నన్ను అర్థం చేసుకోలేదు ఇంకెవరేం చేస్తారులే వదిన ఎలా జరగాలో అలాగే జరుగుతుంది నువ్వు వెళ్లి పెళ్లి పనులు చూసుకో నా పెళ్లి పనులు అని వెటకారంగా మాట్లాడుతుంది.. ఇక తర్వాత పెళ్లి పనులు చూసుకోవాలని హారిక వెళ్ళిపోతుంది..
అన్ని సర్దుకున్న తర్వాత చక్రి ఫోన్ చేస్తాడు.. మీరు వస్తారు కదా నిజంగానే అని చక్రి అడుగుతాడు.. అదేంటి నేను వస్తాను ఎక్కడికి రావాలి అని మహా అడుగుతుంది.. నేను వేరే కారుని తెప్పిస్తున్నాను ఆ కార్ ఇంకా రాలేదు.. రాగానే వెళ్ళిపోవాలి అని అంటాడు. అయితే మహనీ బ్యాగ్ తీసుకొచ్చి ఇవ్వమని చెప్తాడు. బ్యాగు తెచ్చిస్తే ఆ తర్వాత నువ్వు వాళ్ళందరూ పడుకున్న తర్వాత వెంటనే రావచ్చు అని చక్రి అంటాడు. ఆహా తన బ్యాగు ని తీసుకొచ్చి చక్రికిస్తుంది. ఇద్దరూ కలిసి కాసేపు మాట్లాడుకుంటారు. మీరు రెడీ అయిన తర్వాత ఒక రింగ్ ఇవ్వండి అని చక్రి అనగానే అయ్యో మీ దగ్గర పెట్రోల్ కొట్టించడానికి కూడా డబ్బులు లేవా నేను ఆ డబ్బులు ఇస్తాను అని మహా అంటుంది.
Also Read : తిరుపతికి షాక్… ధీరజ్ ను ఆడుకున్న ప్రేమ.. పెళ్లి సంబంధం చెడగొట్టిన భాగ్యం..
పెట్రోల్ కొట్టించడానికి కాదు ఫోన్ రింగ్ ఇస్తే నేను రెడీగా ఉంటాను అని చక్రి అంటాడు. ఇక గుడికి వెళ్లిన ప్రతాప్ లలిత వాళ్ళందరూ ఇంటికి వస్తారు. హారిక మహా ఎక్కడుంది భోజనం చేసిందా అని లలిత అడుగుతుంది. ఇందాకే నేను తినిపించాను అత్తయ్య అని హారిక అంటుంది.. అయితే లలిత మహా ఎక్కడుంది ఒకసారి పిలువు నేను గుడికి వెళ్లినా కూడా నాకు మహా మీదే మనసు గుంజేస్తుంది అని అంటుంది. మహాను పిలిస్తే మహా రాకపోవడంతో ఏం జరుగుతుంది మహా ఉందా లేదా అని అందరూ టెన్షన్ పడిపోతారు అప్పుడే మహా కిందకి వస్తుంది.. బాగా జరిగింది పెళ్లి మండపం కూడా చూసి వచ్చాము అని వాళ్ళు చెప్పగానే మహా ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది.. ఇక తర్వాత అందరూ పడుకున్న తర్వాత చక్రి ఫోన్ చేస్తాడు. అందరూ పడుకుంటారు మీరు వచ్చేసేయండి మెల్లగాని అనగానే మహా తన తండ్రి గదిలోకి వెళ్లి ఎమోషనల్ అవుతుంది.. పుట్టి పెరిగిన ఇంటిని చూసి ఎమోషనల్ అవుతూ బయటికి వెళ్లిపోతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..