E-Paper
Advertisement

Ritesh Rana : సత్య టైమింగ్ అదిరింది, నిజంగానే పిచ్చెక్కిస్తాడా?

Ritesh Rana : సత్య టైమింగ్ అదిరింది, నిజంగానే పిచ్చెక్కిస్తాడా?
Advertisement

Ritesh Rana : కొంతమంది నోటిలో విపరీతమైన టాలెంట్ ఉంటుంది. కానీ ఎంతమంది దర్శకులు దానిని వాడుకుంటున్నారు అనేదే అసలైన మేటర్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రత్యేకమైన నటులలో సత్య ఒకడు. సత్య కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఒక డిఫరెంట్ కామెడీ టైమింగ్ పట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నంత కమెడియన్స్ ఇంకో ఇండస్ట్రీలో లేరు అని చాలామంది సినిమా ప్రముఖులు కూడా గతంలో చెప్పారు.

సత్య ఎన్ని సినిమాలు చేసినా కూడా రితీష్ రానా దర్శకత్వంలో సత్య నటించే సినిమాలు కొంతమేరకు ప్రత్యేకంగా ఉంటాయి. మత్తు వదలరా సినిమాలో సత్య కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. హ్యాపీ బర్త్డే, మత్తు వదలరా 2 సినిమాల్లో సత్య కామెడీ హైలెట్ గా నిలిచింది. ఇప్పుడు సత్య హీరోగా రితీష్ రానా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ రేపు విడుదల చేయనున్నారు. ఈ తరుణంలో ఒక ప్రత్యేకమైన వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

నిజంగానే పిచ్చెక్కిస్తాడా? 

Advertisement

మనీ సినిమాలో బ్రహ్మానందం హైలెట్ సీనుని మళ్లీ రీ క్రియేట్ చేశారు. కమెడియన్ గా ఉన్న నువ్వు హీరో అవ్వడం అవసరమా అని కొంతమంది సత్య దగ్గరికి వచ్చి అంటారు. అసలు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు రా? నాకు యాక్టింగ్ రాదు అన్న వాళ్ళని నా యాక్టింగ్ తో పిచ్చెక్కించేలా చేస్తా. అని వీడియోలో అంటాడు.

ఒకే ఒక్క ఛాన్స్. నాకు కావాల్సింది ఇద్దరే నన్ను హీరోగా పెట్టి సినిమా తీసే డైరెక్టర్ అలానే నాకోసం డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్. అనగానే స్కూటీ మీద ప్రొడ్యూసర్ చెర్రీ, డైరెక్టర్ రితీష్ అన్న ఇద్దరు కలిసి వస్తారు. ఇద్దరూ సత్యాను స్కూటీ మీద ఎక్కించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ప్లేస్ లేకపోవడంతో స్కూటీని తోసుకొని వచ్చాయని చెప్తాడు రితీష్. ఈ వీడియో తోనే చాలా మంచి ఫన్ క్రియేట్ అయిపోయింది. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అనే క్యూరియాసిటీ ఇప్పటికే మొదలైంది.

రితీష్ రానా స్ట్రెంత్ 

Advertisement

ముఖ్యంగా రితిష్రాణ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అతని సినిమాలు కామెడీకి కేర్ అఫ్ అడ్రస్ గా ఉంటాయి. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కామెడీ రాస్తుంటాడు రితీష్. ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ కూడా కామెడీ జోనర్ లోనే ఉంటాయి.

ఇప్పుడు సత్య హీరోగా సినిమా చేస్తున్నాడు కాబట్టి కంప్లీట్ ఫుల్ లెన్త్ కామెడీ ఏ మేరకు రాస్తాడు అనే క్యూరియాసిటీ చాలామందికి ఉంది. సత్య తో పాటు వెన్నెల కిషోర్ కూడా కీలకపాత్రలో ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. వీరిద్దరితో రితీష్ ఈసారి ఏ మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

Also Read : Spirit: సందీప్ రెడ్డి భారీ ప్లానింగ్, ఏకంగా 20 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు

Related News

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

Big Stories

Advertisement
×