E-Paper
Advertisement

Delhi bomb blast: ఢిల్లీ పేలుడు ఘటన.. కారు డిక్కీలో నిద్రిస్తున్న యువకుడు.. పోలీసులు వెళ్లేసరికే..?

Delhi bomb blast: ఢిల్లీ పేలుడు ఘటన.. కారు డిక్కీలో నిద్రిస్తున్న యువకుడు.. పోలీసులు వెళ్లేసరికే..?
Advertisement

Delhi bomb blast: మూడు రోజుల క్రితం జరిగిన ఎర్రకోట పేలుళ్ల ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. రెడ్ ఫోర్ట్ మెట్రో సమీపంలో జరిగిన భయంకరమైన బాంబు పేలుడు ఘటన జరిగిన తరువాత.. ఢిల్లీలోని అన్ని చెక్ పాయింట్ల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో.. సిగ్నేచర్ బ్రిడ్జ్ చెక్ పాయింట్ వద్ద జరిగిన పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ కారు డిక్కీలో దాచుకున్న యువకుడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పెళ్లి వేడుక నుండి తిరిగి వస్తున్న ఒక కుటుంబానికి చెందిన కారులో, పోలీసులు సాధారణ తనిఖీ చేస్తుండగా.. ఒక వ్యక్తి కారు డిక్కీలో దాక్కుని ఉన్నాడు. యువకుడు నిద్రిస్తూ కనిపించడం కలకలం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

తూర్పు ఢిల్లీలోని సిగ్నేచర్ బ్రిడ్జ్ వద్ద పోలీసులు ఈ కారును ఆపి.. తనిఖీ నిర్వహించారు. ఓ పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వస్తున్న కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు కారు దిగారు. పోలీసులు వారిని కారు డిక్కీ తెరవమని అడిగారు. కుటుంబ సభ్యులు డిక్కీ తెరవగానే.. లోపల ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నిద్రిస్తున్న ఒక వ్యక్తి కనిపించాడు. ఈ అనుహ్య దృశ్యం చూసి అక్కడి పోలీసు సిబ్బంది ఒక్కసారిగా షాకయ్యారు.

కుటుంబ సభ్యుల వివరణ ఇలా..

Advertisement

అలర్ట్ అయిన పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని నిద్ర లేపి, దీనికి గల కారణాన్ని వివరించమని సీరియస్ గా ప్రశ్నించారు. కారులో చోటు లేకపోవడంతో ఆ వ్యక్తిని డిక్కీలో పడుకోబెట్టి తీసుకురావాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కాస్త శాంతించారు. అయితే, పోలీసులు పట్టుకున్నారనే విషయం గ్రహించిన డిక్కీలోని వ్యక్తి ఆశ్చర్యానికి లోనయ్యాడు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్..

ఈ ఘటనపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ ఈ విధంగా కామెంట్ చేశాడు. ‘ఇలాంటి పరిస్థితుల్లో.. ఢిల్లీ పోలీసులు పెళ్లి నుంచి వస్తున్న ఒక కుటుంబాన్ని ఆపగా, కారులో చోటు లేక మామయ్య కొడుకుని డిక్కీలో పడుకోబెట్టారు’ అని సరదాగా కామెంట్ చేసుకొచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతూ నవ్వులు పూయిస్తోంది. మరొకరు.. ఇలాంటి సమయంలో ఇలా చేస్తే.. కచ్చితంగా ఢిల్లీ పేలుళ్లకు ఘటనకు సంబంధించిన ప్రధాన సూత్రధారి అతనే కావొచ్చని అనుకునేందకు  ఎక్కువగా అస్కారం ఉంటుంది.. అందుకే పిచ్చి పనులు చేయొద్దు అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

నవంబర్ 10న ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో ఒక కారు పేలడంతో 13 మంది మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు జరిగిన సమయంలో కారులో రెండు నుంచి మూడు మంది వ్యక్తులు ఉన్నారని ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఢిల్లీలో భద్రతా తనిఖీలను కట్టుదిట్టం చేశారు.

ALSO READ: Government Polytechnic College: ఓరీడి దుంప తెగ.. అన్నంలో కాలు పెట్టి ఎలా నిద్రపోతున్నాడో చూడండి

Related News

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

ఏడేళ్ల బంధం.. ఎండమావి అయింది.. ప్రియుడితో కలిసి భర్త తల నరికిన భార్య, ఎక్కడంటే?

Big Stories

Advertisement
×