E-Paper
Advertisement

Ranabaali Movie: ‘రణబాలి’ గా విజయ్ దేవరకొండ మూవీ.. గ్లింప్స్ తోనే  ఫ్యాన్స్ ఆకలి తీర్చిన డైరెక్టర్?

Ranabaali Movie: ‘రణబాలి’ గా విజయ్ దేవరకొండ మూవీ.. గ్లింప్స్ తోనే  ఫ్యాన్స్ ఆకలి తీర్చిన డైరెక్టర్?
Advertisement

Ranabaali Movie: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి టైటిల్ గ్లింప్ విడుదల చేశారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు రణబాలి (Ranabaali)అని టైటిల్ పెట్టబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే తాజాగా టైటిల్ విడుదల చేశారు. ఈ సినిమాకు ‘రణబాలి ‘ అనే టైటిల్ ప్రకటిస్తూ విడుదల చేసిన వీడియో వైరల్ అవుతుంది.

బ్రిటిష్ పాలన నేపథ్యంలో..

ఈ వీడియో చూస్తుంటే బ్రిటిష్ కాలం నాటి పరిపాలనలో భారతీయులు ఎదుర్కొన్న ఇబ్బందులను కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ ఇబ్బందుల నుంచి ప్రజలను ఎలా కాపాడారనే నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందని ఈ వీడియో చూస్తేనే స్పష్టమవుతుంది. బ్రిటిష్ పాలన బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇందులో విజయ్ దేవరకొండ లుక్ కూడా అమాంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక(Rashmika) జయమ్మ అనే పాత్రలో కనిపించబోతున్నట్టు ఈ వీడియో ద్వారా వెల్లడించారు.

టైటిల్ గ్లింప్ తో అంచనాలు పెంచిన డైరెక్టర్..

Advertisement

ప్రస్తుతం ఈ టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు డైరెక్టర్ చెప్పిన విధంగానే ఈ సినిమాతో ఫాన్స్ ఆకలి తీర్చేస్తారని తెలుస్తోంది.
కేవలం టైటిల్ గ్లింప్స్ తోనే ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశారని చెప్పాలి. ఇక ఈ సినిమాతో విజయ్ దేవరకొండ పక్కాగా బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నారని తెలుస్తుంది . ఇక ఈ సినిమాని 2026 సెప్టెంబర్ లో విడుదల చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు. ఇక ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాతగా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా అనంతరం ఈయన విజయ్ దేవరకొండతో రణబాలి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు . చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ సరైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని ఈ సినిమా ద్వారా హిట్ కొట్టడం గ్యారెంటీ అంటూ అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించబోతున్న నేపథ్యంలో సినిమా పట్ల మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్లో డియర్ కామ్రేడ్ , గీతా గోవిందం సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాల తర్వాత మరోసారి రణబాలి ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Also Read: Mega Gifts: మెగాగిఫ్ట్ లతో డైరెక్టర్లకు సర్ప్రైజ్..నిన్న సుజీత్, నేడు అనిల్… నెక్స్ట్ బుచ్చినేనా?

Related News

నోరు జారితే అంతే.. నెక్స్ట్ స్కిట్‌లో నో ఛాన్స్! జబర్దస్త్ సీక్రెట్ లీక్ చేసిన నటి సత్యశ్రీ

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

Big Stories

Advertisement
×