E-Paper
Advertisement

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ కెరియర్ నిర్ణయించేది ఈ 2 సినిమాలే..!

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ కెరియర్ నిర్ణయించేది ఈ 2 సినిమాలే..!
Advertisement

Vijay Deverakonda: కరోనా తర్వాత టాలీవుడ్‌లో కొంతమంది హీరోలకు కష్టకాలం ఎదురైంది. ఆ జాబితాలో ముందుగా గుర్తుకు వచ్చే పేరు విజయ్ దేవరకొండ. ఒకప్పుడు వరుస హిట్లతో యువతకు ఐడల్‌గా మారిన విజయ్, గత కొన్ని సంవత్సరాలుగా మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాడు. ఒకప్పుడు వరుసగా పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం.. లాంటి సూపర్ హిట్ సినిమాలు అందుకున్న ఈ హీరోకి ప్రస్తుతం కనీసం మినిమం హిట్ సినిమా కూడా పడటం లేదు.

లైగర్, ఖుషి, ది ఫ్యామిలీ స్టార్, కింగ్‌డమ్ లాంటి సినిమాలపై భారీ అంచనాలతో విడుదలైనా కూడా.. అవి బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా లైగర్ సినిమా అలానే కింగ్ డమ్ సినిమా అయితే డిజాస్టర్స్ గా మిగిలాయి. ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా మరి గోరంగా ఫ్లాప్ అయ్యింది. దీంతో విజయ్ కెరీర్‌పై ఒత్తిడి పెరిగిందనే చెప్పాలి. అభిమానులు కూడా మళ్లీ పాత విజయ్ ఎప్పుడు వస్తాడు?.. అని ఎదురుచూస్తున్నారు.

Advertisement

ఇలాంటి పరిస్థితుల్లో 2026 సంవత్సరం విజయ్ దేవరకొండకు చాలా కీలకంగా మారింది. ఈ ఏడాది అతడు కేవలం నాలుగు నెలల గ్యాప్‌లో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇది అతడి కెరీర్‌లోనే అరుదైన విషయం.

మొదటి సినిమా రణబలి. టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంతో, బ్రిటిష్ కాలం కథాంశంతో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని సమాచారం. సెప్టెంబర్‌లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కథ, ప్రెజెంటేషన్ పూర్తిగా కొత్తగా ఉంటుందని టీమ్ చెబుతోంది.

Advertisement

ఇక రెండో సినిమా రోడీ జనార్ధన. ఈ సినిమాకు రవి కుమార్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ఇది కూడా పీరియడ్ సెటప్‌లోనే ఉండగా, రక్తపాతం, యాక్షన్ ఎక్కువగా ఉండే మాస్ సినిమాగా తెరకెక్కుతోంది. డిసెంబర్‌లో ఈ సినిమా థియేటర్లలోకి రావొచ్చని టాక్.

ఈ రెండు సినిమాల కోసం విజయ్ ఒకేసారి షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. గ్యాప్ లేకుండా పని చేస్తూ, టైమ్‌కు సినిమాలు పూర్తిచేయాలని ప్లాన్ చేస్తున్నారు. నాలుగు నెలల్లో రెండు రిలీజ్‌లు రావడం వల్ల విజయ్‌పై అంచనాలు భారీగా పెరిగాయి.

ఈ రెండు సినిమాల్లో కనీసం ఒకటి పెద్ద హిట్ అయితే, విజయ్ దేవరకొండ కెరీర్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చే అవకాశం ఉంది. అభిమానులు మాత్రం 2026ని ఆయన కంబ్యాక్ ఇయర్ గా మార్చాలని ఆశతో ఎదురుచూస్తున్నారు. మరోపక్క ఈ రెండు సినిమాలు కానీ ఫ్లాప్ అయితే మాత్రం ఈ హీరోకి ఇబ్బందులు తీవ్రంగా మారక తప్పదు. కాబట్టి ఈయన కెరియర్ ని డిసైడ్ చేసేది ఈ రెండు సినిమాలే అని పక్కా క్లారిటీ వేసుకోవచ్చు.

ALSO READ: Spirit Update: ప్రభాస్ స్పిరిట్ సినిమాలో చిరంజీవి.. క్లారిటీ వచ్చేసింది..!

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×