E-Paper
Advertisement

Sapota Benefits: తియ్యని సపోటాతో బోలెడన్ని లాభాలు.. కానీ ఆ వ్యాధి ఉన్నవారు మాత్రం అస్సలు తినకూడదు!

Sapota Benefits: తియ్యని సపోటాతో బోలెడన్ని లాభాలు.. కానీ ఆ వ్యాధి ఉన్నవారు మాత్రం అస్సలు తినకూడదు!
Advertisement

Sapota Benefits: సపోటా అంటే ఇష్టపడని వాళ్లు ఎవరు ఉంటారు చెప్పండి.. చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంతో తింటుంటారు. ఈ సపోటా తినడానికి టేస్టీగానే కాదు.. మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో విటమిన్ ఎ, బి, సి, ఇ తో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిని రోజూ తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. కానీ, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం సపోటాను అస్సలు తినకూడదట. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్‌స్టంట్ ఎనర్జీకి సపోటా:

సపోటాలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే, నీరసంగా ఉన్నప్పుడు సపోటా తింటే వెంటనే శక్తి లభిస్తుంది. తరచుగా అలసట, బలహీనతతో బాధపడేవారు తమ ఆహారంలో సపోటాను చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Advertisement

Also Read: యవ్వనంగా కనిపించాలా? క్యాన్సర్ దరిచేరకూడదా? అయితే ఈ పింక్ పండును అస్సలు వదలకండి!

ఎముకలకు బలం:

సపోటాలోని పొటాషియం, మెగ్నీషియం రక్తప్రసరణను మెరుగుపరిచి, రక్తపోటును అదుపులో ఉంచుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతేకాదు.. దీనిలో ఉండే క్యాల్షియం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.

కంటి చూపుకు మేలు:

Advertisement

సపోటాలోని విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే దీనిలో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని తేమగా ఉంచి, వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఇందులోని ఐరన్ ఎంతో మేలు చేస్తుంది.

వీళ్లు మాత్రం తినొద్దు:

సపోటా ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ.. డయాబెటిస్ ఉన్నవాళ్లు దీనికి దూరంగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. ఈ ఫ్రూట్‌లో ఉండే లేటెక్స్, టానిన్ సమ్మేళనాలు వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అలాగే ఊబకాయం, గుండె జబ్బులు ఉన్నవారు కూడా సపోటాను తినకపోవడం ఉత్తమం.

Also Read: గ్రీన్ టీతో బరువు తగ్గడం పక్కన పెడితే.. ఈ 4 అనారోగ్య సమస్యలు రావడం గ్యారెంటీ!

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×