E-Paper
Advertisement

Raju Weds Ramabai : ఇది లోకానికి తెలియాల్సిన కథ… పగోనికి కూడా జరగకూడదు. 

Raju Weds Ramabai : ఇది లోకానికి తెలియాల్సిన కథ… పగోనికి కూడా జరగకూడదు. 
Advertisement

Raju Weds Ramabai : కొన్ని కథలను ఎవరు బయటకు చెప్పాలి అనుకోరు. అతి తక్కువ మంది మాత్రమే జరిగిన కొన్ని కథలను వెండితెర మీద ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతంగా వర్కౌట్ అవుతాయి. మరి కొన్ని సినిమాలకు ప్రశంసలు వస్తాయి కానీ డబ్బులు ఊహించిన స్థాయిలో రావు.

వేణు  దర్శకత్వంలో రానా దగ్గుపాటి మరియు సాయి పల్లవి కలిసిన నటించిన సినిమా విరాటపర్వం. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి ఒక్క నెగిటివ్ టాక్ కూడా రాలేదు. చాలామంది ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో పొగిడారు. కానీ ఈ సినిమా కమర్షియల్ గా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.

ఇది లోకానికి తెలియాల్సిన కథ 

Advertisement

విరాటపర్వం సినిమాకి దర్శకుడుగా వ్యవహరించిన వేణు. ప్రస్తుతం రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంది. అయితే టాలీవుడ్ లో ఎక్కడ విన్నా కూడా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ ఎవరు ఊహించని విధంగా ఉంటుందట. సినిమా క్లైమాక్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఈ సినిమా నవంబర్ 21న ప్రేక్షకులు ముందుకు వస్తున్న తరుణంలో , ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కిరణ్ అబ్బవరం ఈవెంట్ కు గెస్ట్ గా హాజరయ్యారు.

Advertisement

అయితే ఇది ఒక ఊర్లో జరిగిన కథ. దర్శకుడు సాయిలు ఈ కథ కోసం ఎవరిని అడిగినా కూడా పెద్దగా ఎవరూ చెప్పేవారు కాదు. ఏకంగా ఆ ఊరు నుంచి ఒక వ్యక్తిని ఈ ఈవెంట్ కు తీసుకొని వచ్చారు. మొహం కనబడనివ్వకుండా తనకి ఒక మాస్క్ కడుతూ ఈ కథ గురించి చెప్పించారు. ఈ కథ సినిమాగా రావడం అనేది మంచి పరిణామం అంటూ స్టేజ్ పైనే ఆ పెద్దాయన ఏడ్చేసాడు.ఇది లోకానికి తెలియాల్సిన కథ… పగోనికి కూడా జరగకూడదు. మా ఊరి లో నేను చూసిన స్టోరీ ఇది. ధైర్యం చేసి సినిమా చేసిండ్రు. అంటూ సంఘటన జరిగిన ఊరి కి చెందిన వ్యక్తి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.

కొత్త కథలు బయటకి 

దర్శకుడు వేణు ఉడుగుల తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది కంటే ప్రత్యేకం అని చెప్పాలి. పెద్దగా వినిపించని కథలను బయటకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. విరాటపర్వం సినిమా కూడా వెన్నెల అనే ఒక ఆమెకు సంబంధించింది. ఆ కథను చాలా అద్భుతంగా చూపించాడు వేణు.

బహుశా అందుకే ఎక్కడో విన్న ఒక కథ తనను కదిలించింది కాబట్టి ఈ సినిమాకు నిర్మాతగా మారాడు. వేణు తోపాటు ఈటీవీ విన్ కూడా ఈ సినిమాను నిర్మించింది. నవంబర్ 21న విడుదల కానున్న ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఇప్పటికే మొదలైపోయాయి.

Also Read: SKN: మరోసారి గొప్ప మనసు చాటుకున్న నిర్మాత, మహేష్ బాబు అభిమాని కుటుంబానికి 2లక్షల

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×