E-Paper
Advertisement

SKN: మరోసారి గొప్ప మనసు చాటుకున్న నిర్మాత, మహేష్ బాబు అభిమాని కుటుంబానికి 2లక్షలు

SKN: మరోసారి గొప్ప మనసు చాటుకున్న నిర్మాత, మహేష్ బాబు అభిమాని కుటుంబానికి 2లక్షలు
Advertisement

SKN: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జర్నలిస్టుగా కెరియర్ స్టార్ట్ చేసి నేడు నిర్మాతగా ఎదిగారు ఎస్కేఎన్. ఎస్ కే ఎన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నిర్మాతగా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు. కొన్ని సందర్భాలలో తను మాట్లాడిన మాటలు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి.

అయితే కొన్నిసార్లు తన పనులు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎంతోమందికి నిర్మాత ఎస్కేఎన్ సాయాన్ని అందించాడు. నిర్మాతగా మంచి పేరు సంపాదించడమే కాకుండా ఒక మనిషిగా కూడా అద్భుతమైన వ్యక్తిత్వం కలిగి ఉంది అని చాలామంది ఇండస్ట్రీ వర్గాల్లో అతని గురించి మాట్లాడుకుంటారు. తాజాగా మరో మహేష్ బాబు అభిమాని కుటుంబాన్ని ఆదుకున్నారు ఎస్కేఎన్.

గొప్ప మనసు చాటుకున్నారు

Advertisement

మహేష్ బాబు అభిమాని ఒకరు చనిపోయారు. అయితే దానికి సంబంధించి మనలో ఒకడు ఈ రోజు మనల్ని వదిలివెళ్లిపోయాడు.

మహేష్ అన్న ఫ్యాన్స్ మరియు మన తెలుగు యువత అందరి హీరో ఫ్యాన్స్ అందరూ మీకు తోచినంత హెల్ప్ చేయండి. అంటూ ట్విట్టర్లో ట్వీట్ వేశారు. చాలామంది తమకు తోచిన సహాయం అందించారు.

Advertisement

చనిపోయిన అబ్బాయికి 10 సంవత్సరాలు కొడుకు మరియు ఆరు సంవత్సరాలు కూతురు కూడా ఉన్నారు అని నిర్మాత ఎస్ కే ఎన్ ట్యాగ్ చేసి పోస్ట్ చేశాడు రమేష్ నాయక్ అనే ఒక వ్యక్తి. దీనికి నిర్మాత ఎస్కేఎన్ వెంటనే స్పందించారు.

ఇది తెలిసిన తర్వాత చాలా బాధగా ఉంది. ఒక అభిమానిగా ఇంకొక అభిమాని ఎమోషన్ నేను అర్థం చేసుకోగలుగుతాను. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ల పిల్లలకు అది డిస్టర్బ్ కాకూడదు. నేను రెండు లక్షల రూపాయలు నా సైడ్ నుంచి వాళ్ళ చదువుల నిమిత్తం ఇస్తాను అని ట్విట్టర్ వేదికగా ప్రామిస్ చేశాడు ఎస్కేఎన్.

చెప్పిన మాదిరిగానే ఆ ఫ్యామిలీని కలిసి రెండు లక్షల రూపాయలు చెక్ అందించారు. ప్రస్తుతం ఎస్కేఎన్ చేసిన ఈ పనిని బట్టి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రశంసలు వస్తున్నాయి.

వాస్తవానికి నిర్మాత ఎస్కేఎన్ మెగా ఫ్యామిలీకి అతిపెద్ద అభిమాని. కానీ మిగతా హీరోల అభిమానులకు ప్రాబ్లం వచ్చినా కూడా సాయం చేయడానికి ముందు వరుసలో ఉంటాడు. ఇలా సాయం చేయడం అనేది మొదటిసారి కాదు. గతంలో కూడా ఎన్టీఆర్ అభిమానికి అవసరం వచ్చినప్పుడు కూడా ఇలానే నిలబడ్డాడు ఎస్కేఎన్. మెగా అభిమానులకు ఏదైనా సమస్య వచ్చినా కూడా ఇలానే నిలబడతాడు. పిఠాపురంలో ఒక ఫ్యామిలీకి ఆటోను కూడా కొనిచ్చిన సంగతి అప్పట్లో విపరీతంగా వైరల్ అయింది.

Also Read: Upasana Konidela: పెళ్లైన 10 ఏళ్లకు పిల్లలు.. ట్రోల్స్ పై ఉపాసన ఫస్ట్ టైం రియాక్షన్

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×